మహరాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. అహ్మద్‌నగర్ జిల్లా ఆసుపత్రి ఐసీయూలో మంటలు చెలరేగాయి. ఈ ఘటన శనివారం ఉదయం 11 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఐసీయూలో కరోనా వార్డులో 17 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. వారిలో ఆరుగురు మృతి చెందగా.. మరో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అందుపులోకి తీసుకువచ్చాయి. షాట్ సర్య్కూట్ కారణంగా ఈ…
కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఎన్డీయే పాలిత ప్రాంతాలతో పాటు మరికొన్ని రాష్ట్రాలు కూడా తమ ప్రజలపై భారం తగ్గించేందుకు రాష్ట్ర వ్యాట్‌ను కూడా తగ్గించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ పెట్రోల్, డీజిల్ ధరలపై ఆధ్యాయనం చేస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింస్తే రాష్ట్ర ఆదాయాంపై పడే భారంపై అధికారులతో చర్చిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించే పరిస్థితి లేదని అధికారులు ప్రభుత్వానికి వెల్లడించినట్లు…
వైద్యం వికటించి మహిళ ప్రాణాలు కోల్పోయిన సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓజోన్ హాస్పిటల్ లో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం రాందిగల్ల గ్రామానికి చెందిన ఈదుల అంజనమ్మ (35), ఈదుల కృష్ణయ్య భార్యభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. భర్త కృష్ణయ్య ఆటో నడుపుతూ జీవనం సాగిస్తూ ఉండగా, అంజనమ్మ వ్యవసాయ కూలీలకు వెళ్తూ భర్తకు చేదోడువాదోడుగా ఉంటుంది. కాగా అంజనమ్మకు 3 నెలల క్రితం వ్యవసాయ కూలీ పనులు చేస్తుండగా కాలికి…
శ్రీనగర్‌లోని బెమీనాలో గల స్కిమ్స్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలోకి ఉగ్రవాదులు చొరబడ్డారు. అనంతరం ఉగ్రవాదులు భారత భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాదుల కాల్పులను తిప్పికొట్టాయి. దీంతో ఉగ్రవాదులు ఆసుపత్రిలోని సిబ్బందిని, పౌరులను అడ్డుపెట్టుకొని తప్పించుకున్నట్లు శ్రీనగర్ పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు శ్రీనగర్ పోలీసులు, భద్రత బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా కోచ్ రవిశాస్త్రి పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో సులక్షణ నాయక్, మిస్టర్ ఆర్పి సింగ్‌లతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ బుధవారం రాహుల్ ద్రవిడ్‌ను టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా ఏకగ్రీవంగా నియమించింది. న్యూజిలాండ్‌తో జరగనున్న సిరీస్‌లో రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. రవిశాస్త్రి (మాజీ టీమ్ డైరెక్టర్ & హెడ్ కోచ్), బి. అరుణ్ (బౌలింగ్ కోచ్), ఆర్. శ్రీధర్ (ఫీల్డింగ్ కోచ్), విక్రమ్…
రోజురోజు పెట్రోల్ ధరలు ఆకాశానంటుతున్నాయంటూ వాహనదారులు ప్రభుత్వాలపై మండిపడుతున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. లీటర్ పెట్రోల్ ధరపై రూ.5, లీటర్ డిజీల్ ధరపై రూ.10 ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. తగ్గించిన ధరలు రేపటి నుంచి అమలులో ఉండనున్నట్లు కేంద్రం తెలిపింది. దీంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో నర్సింగ్ విద్యార్థులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. జీఎన్ఎం, బీఎస్సీ, నర్సింగ్ విద్యార్థులకు స్టైఫండ్ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు స్టైఫండ్ నెలకు రూ. 1500లు ఉండగా రూ.5 వేలకు పెంచింది. అంతేకాకుండా సెకండ్ ఇయర్ విద్యార్థులకు రూ.1700 నుంచి రూ. 6 వేలకు పెంచగా, మూడో సంవత్సరం విద్యార్థులకు రూ. 1900 నుంచి రూ.7వేలు, నాలుగో సంవత్సరం విద్యార్థులకు రూ.2,200 నుంచి…
హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో ప్రారంభమైంది. అధికారులు ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతోనే టీఆర్ఎస్ తన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మొత్తం 753 బ్యాలెట్ ఓట్లను లెక్కించగా అందులో టీఆర్ఎస్కు ఓట్లు ఆధికంగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్లలో 503 టీఆర్ఎస్ కు రాగా, బీజేపీకి 159, కాంగ్రెస్ కు 32 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన అనంతరం హుజురాబాద్ ఓట్లను…
ఏపీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్మారకార్థం అవార్డులు ప్రధానత్సవ కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుజాతి తరఫున అందరికి శుభాకాంక్షలు.. కేంద్రం పద్మ అవార్డులను, భారతరత్న వంటి అవార్డులతో సత్కరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాంటి అవార్డులు ఇవ్వాలని వైఎస్ఆర్ అవార్డులు ఇస్తున్నాం’ అని అన్నారు. ‘నిండైన తెలుగుదనం నాన్నగారి పంచెకట్టులో కనిపిస్తుంది. ఆకాశమంత ఎత్తు ఎదిగిన ఆ మహామనిషి…
రోజురోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి సామాన్యుడి నడ్డి విరిస్తున్నాయి. ఇప్పటికే సెంచరీ కొట్టి నాటౌట్‌తో ఉన్న పెట్రోల్, డీజిల్ మరోసారి పరుగులు తీశాయి. తాజాగా లీటర్ పెట్రోల్‌పై 41 పైసల, లీటర్ డీజిల్‌పై 42పైసలు పెరిగాయి. దీంతో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ. 114.13 లకు చేరకుంది. దీనితో పాటు లీటర్ డీజిల్ ధర రూ. 107.40ల వద్ద ఉంది. ఇప్పటి వరకు రోజూ 30 పైసల మీద పెంచిన ఇంధన ధరలు.. ఒకేసారి…