దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల కోసం ఓ విషయాన్ని ప్రకటించింది. 6 రోజుల పాటు రాత్రి పూట రిజర్వేషన్ సౌకర్యం లేదని దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది. రాత్రి 11.30 గంటల నుంచి ఉదయం 5.30 గంటల వరకు రిజర్వేషన్ ఉండదని స్పష్టం చేసింది. నేటి రాత్రి నుంచి 20వ తేదీ వరకు సేవలకు అంతరాయం కలుగుతుందని ఇది ప్రయాణికులు గమనించాలని కోరింది. అంతేకాకుండా కరెంట్ బుకింగ్, టికెట్ల రద్దు సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది. రైల్వే డేటా…
రేణిగుంట ఎయిర్‌పోర్టు సమీపంలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. తిరుపతిలో జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో పాల్గొనడానికి ఏపీ సీఎం జగన్ తిరుపతికి రానున్నారు. ఈ నేపథ్యంలో రేణిగుంట ఎయిర్‌పోర్టు చేరుకున్న జగన్.. తన కాన్వాయ్‌లో తిరుపతికి బయలుదేరారు. అయితే అలా మొదలై సీఎం కాన్వాయ్ వెంబడి ఓ మహిళ పరిగెత్తుతూ వచ్చింది. ఇది గమనించిన సీఎం జగన్ కాన్వాయ్కి నిలిపివేయించి.. ఓఎస్డీని ఆ మహిళ దగ్గరకు పంపించారు. అంతేకాకుండా ఆ మహిళ…
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి శ్రీకారం చుట్టనుంది. ఈ నిర్ణయంతో 11.56 లక్షల కేంద్ర ఉద్యోగులకు లాభం కలుగనుంది. జనవరి 2022 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ (హౌస్ రెంట్ అలవెన్స్) పెంచేందుకు కసరత్తు ప్రారంభించింది. హెచ్ఆర్ఏ పెరుగనుంది. ఐఆర్‌టీఆఎస్‌ఏ, ఎన్ఎఫ్ఐఆర్ ఉద్యోగులు డిమాండ్ నేపథ్యంలో హెచ్ఆర్ఏ పెంపుకు కేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఎక్స్, వై, జడ్ అంటూ మూడు భాగాలుగా నగరాలను విభజించి, ఎక్స్ భాగానికి రూ.5400, వై భాగానికి…
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కర్కర్దుమా మెట్రో స్టేషన్ సమీపంలో గల రిషబ్ టవర్లోని 6వ అంతస్థులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు 14 ఫైర్ ఇంజన్లను రంగంలోకి దింపి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఇప్పటికే కాలుష్యపు పొగమంచుతో నిండిన ఢిల్లీలో ఈ ఘటనతో మరింత పొగ అలుముకుంది.
తెలంగాణ వ్యాప్తంగా మాదకద్రవ్యాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న మరోసారి డ్రగ్స్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఫోటోస్ ఫ్రేమ్ వెనుక డ్రగ్స్ పెట్టి పార్శిల్స్ చేసి సరఫరా చేస్తున్న ముఠాను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. బేగంపేటలో ఇంటర్ నేషనల్ పార్శిల్స్ ఆఫీసులో పోలీసులు తనిఖీలు చేయగా 14 కిలలో డ్రగ్స్ లభ్యమయ్యాయి. వీటి విలువ సుమారు రూ. 5.5 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు ఈ…
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు, చిత్తూరు జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నందున ఆయా జిల్లాల కలెక్టర్ అప్రమత్తంగా ఉండాలన్నారు. తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ముఖ్యంగా తమిళనాడు సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలని జగన్ సూచించారు. ఇప్పటికే చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు ఎన్డీఆర్ఎస్ బృందాలు చేరుకున్నాయని, కర్నూలులో మరో రెండు బృందాలు సిద్ధంగా ఉన్నాయని…
ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టినాటి నుంచి టీఎస్ ఆర్టీసీని అభివృద్ధి చేసేందుకు తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు సజ్జనార్. ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కొత్త ఆలోచనలతో ప్రయాణికులు ఎక్కువగా ఆర్టీసీ పై దృష్టి పెట్టే విధంగా చేస్తున్నారు. నూతన సంస్కరణలతో ఆర్టీసీ లాభాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా మరో కీలక విషయాన్ని సజ్జనార్ వెల్లడించారు. ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులకు వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. 48,214 మంది ఉద్యోగులతో పాటు 5,034…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9 మంది జడ్జీల బదిలీలు జరిగాయి. హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు జడ్జిగా ఈ.తిరుమల దేవి, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా వై. రేణుక, రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ డైరెక్ట్‌గా సీహెచ్‌కే భూపతి, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శిగా ఎం.వి.రమేశ్, నిజామాబాద్ జిల్లా ప్రిన్సిపల్, సెషన్స్ జడ్జిగా కుంచాల సునీత, నల్గొండ జిల్లా ప్రిన్సిపల్ జడ్జిగా బి.ఎస్.జగ్జీవన్ కుమార్, ఆదిలాబాద్ జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జిగా రామకృష్ణ సునీత,…
పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న భార్యాభర్తలతో పాటు ఓ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలియడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చీటింగ్ కేసులో సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావును రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. నానక్‌రాంగూడలోని సర్వే నెంబర్ 104లో శ్రీధర్ రావుకు ఐదు ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి సంబంధించిన అంశంలో మమ్మల్ని మోసం చేశాడంటూ రాయదుర్గం పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఆ భూమి అమ్మకం జరిగినప్పుడు తమకు రావాల్సిన అమౌంట్ ఇవ్వకుండా మోసం చేశాడని, డబ్బులు అడిగితే గన్మెన్లను చూపించి బెదిరింపులకు పాల్పడ్డాడని, చంపుతామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. కొందరికి…