రైతు బంధులాంటి పథకం ఎక్కాడా లేదని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రగతిభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న కేసీఆర్ మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం ధాన్యం సేకరణను చేపట్టమని చెబుతోందన్నారు. అందుకే వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ యాసంగిలో వరి పంట వేయొద్దని చెప్పారన్నారు. కేంద్ర ప్రభుత్వం బాధ్యతారహితంగా ధాన్యం తీసుకోబోమని చెప్పడం శోచనీయమన్నారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, ధాన్యాన్ని కూడా పూర్తిగా కొన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన అన్నారు. నేను ఢిల్లీకి వెళ్లి సంబంధిత మంత్రితో కూడా మాట్లాడాను అని ఆయన తెలిపారు.రైతులు యాసంగిలో వరి పంట వేసి నష్టపోవద్దనే మంత్రి నిరంజన్ రెడ్డి ఆవిధంగా చెప్పారని ఆయన అన్నారు.