ఐసెట్ చివరి విడత కౌన్సిలింగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. కొత్తగా కౌన్సిలింగ్లో పాల్గొనే విద్యార్థులు నేడు స్లాట్ బుక్ చేసుకోవాలని కన్వీనర్ మిత్తల్ నవీన్ కోరారు. రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని తెలిపారు. రేపు, ఎల్లుండి వెబ్ అప్షన్లకు అవకాశం ఉందని తెలిపారు. చంద్రబాబు కుటుంబం పట్ల అనుచిత వ్యాఖ్యలపై నిరసనగా మౌన ప్రదర్శనలు, దీక్షలు చేపట్టాని పార్టీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నేడు టీడీపీ శ్రేణులు…
టీడీపీ నేత కూన రవికుమార్‌ను అర్థరాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసులను దుర్భషలాడారనే ఆరోపణతో కూన రవికుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న అర్థరాత్రి శ్రీకాకుళం జిల్లా శాంతినగర్‌లోని తన అన్నయ్య ఇంట్లో కూన రవికుమార్ నిద్రిస్తున్నారు. Also Read:10వ రోజు : కోటి దీపోత్సవంలో.. కోనేటి రాయుడి కల్యాణం.. ఆ సమయంలో పోలీసులు భయబ్రాంతులకు గురి చేసి, గది తలుపులు తొలగించి మరీ తన తమ్ముడిని అరెస్ట్ చేశారని కూన…
గత కొన్ని రోజుల క్రితం ఇంట్లో కాలు జారిపడి సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ సికింద్రాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు . అయితే తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 1959లో సిపాయి కూతరు సినిమాతో వెండితెరకు పరిచయమైన ఆయన మొన్న వచ్చిన అరుంధతి సినిమా వరకు వివిధ పాత్రల్లో నటించిన ప్రేక్షకులను మెప్పించారు. ఆయన నటనకు ‘నవరసనటనా సార్వభౌమ’ ‘కళా ప్రపూర్ణ’ ‘నటశేఖర’ లాంటి బిరుదులు వరించాయి. ఆయన ఇప్పటివరకు…
ఏపీలో రాజకీయాల రోజురోజుకు మారుతున్నాయి. నిన్న అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన పరిణామాలతో ఒక్కసారిగా ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. అధికార వైసీపీ నేతలు వ్యక్తిగతంగా, తన భార్య భువనేశ్వరీ సైతం విమర్శించారంటూ.. ఇక ముఖ్యమంత్రి హోదాలోనే అసెంబ్లీలోకి అడుగుపెడుతానంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సభను నిష్ర్కమించారు. అయితే అనంతరం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఒక్కసారిగా విలపించారు. దీంతో తమ అభిమాన నేతను కించపరిచేలా మాట్లాడారని టీడీపీ కార్యకర్తలు, అభిమానులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా…
గుండెపోటుతో ఎమ్మెల్సీ మృతి చెందడంతో అధికార వైసీపీ పార్టీలో విషాదం చోటు చేసుకుంది. ఈ సంవత్సరం మార్చిలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైనా మహ్మద్ కరీమున్నీసా గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటనతో విజయవాడ వైసీపీలో విషాదఛాయలు అలుముకున్నాయి. గతంలో ఆమె విజయవాడ కార్పోరేషన్‌లోని 56వ డివిజన్‌కు కార్పోరేటర్‌గా కూడా పనిచేశారు. Also Read : అనంతపురంలో కూలిన 4అంతస్థుల భవనం.. అయితే నిన్నరాత్రి అస్వస్థతకు గురికావడంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో…
ఏపీ రాజకీయం వేడెక్కింది. అసెంబ్లీ సమావేశాల్లో రెండవ రోజు అధికార, విపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, తన భార్యను కూడా అవమానిస్తున్నారంటూ చంద్రబాబు సభను వెళ్లిపోయారు. అంతేకాకుండా ఇక సభలోకి ముఖ్యమంత్రిని అయ్యాకే అడుగుపెడుతానంటూ శపథం చేశారు. అనంతంర తన ఛాంబర్లో టీడీఎల్పీ సమావేశం నిర్వహించిన అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే మీడియాతో మాట్లాడుతూనే చంద్రబాబు భావోద్వేగానికి లోనయ్యారు. అంతేకాకుండా…
నెల్లూరు కార్పోరేషన్‌తో పాటు 12 మున్సిపాలిటీ, నగరపంచాయతీలకు ఎన్నికలు జరుగగా నిన్న ఫలితాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే నెల్లూరులోని 49,50 డివిజన్లకు టీడీపీ తరుపున ఇంచార్జీగా వ్యవహరించిన కప్పిర శ్రీనివాస్ అరమీసం, అరగుండుతో దర్శనమిచ్చారు. ఎన్నికల ప్రచారంలో 49,50 డివిజన్లలో టీడీపీ గెలవపోతే అరగుండు, అరమీసం తీయించుకుంటానని సవాల్ చేశారు శ్రీనివాస్.. ఈ మాటకు కట్టుబడి ఎన్నికల ఫలితాల అనంతరం ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే నెల్లూరు కార్పోరేషన్లో 54 డివిజన్లకు 54…
గడ్చిరోలి ఎన్కౌంటర్లో 26 మంది మావోయిస్టులు మరణించారు. వీరిలో ఆరుగురు మహిళలు కూడా ఉన్నారు. అయితే ఘటన స్థలం నుంచి భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు మిళింద్ కూడా ఉండటం గమనార్హం. మృతుడు మిళింద్‌పై రూ.50లక్షల రివార్డు ఉంది. ఎన్ కౌంటర్లో మరణించిన మావోయిస్టులకు సంబంధించిన ఆయుధాలను, వస్తువులను పోలీసులు స్వాధీన పరుచుకున్నారు. వీటికి సంబంధించిన ఫోటోలు ఎన్టీవీ ఎక్స్‌క్యూజివ్‌గా..
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల కోసం ఓ విషయాన్ని ప్రకటించింది. 6 రోజుల పాటు రాత్రి పూట రిజర్వేషన్ సౌకర్యం లేదని దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది. రాత్రి 11.30 గంటల నుంచి ఉదయం 5.30 గంటల వరకు రిజర్వేషన్ ఉండదని స్పష్టం చేసింది. నేటి రాత్రి నుంచి 20వ తేదీ వరకు సేవలకు అంతరాయం కలుగుతుందని ఇది ప్రయాణికులు గమనించాలని కోరింది. అంతేకాకుండా కరెంట్ బుకింగ్, టికెట్ల రద్దు సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది. రైల్వే డేటా…
రేణిగుంట ఎయిర్‌పోర్టు సమీపంలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. తిరుపతిలో జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో పాల్గొనడానికి ఏపీ సీఎం జగన్ తిరుపతికి రానున్నారు. ఈ నేపథ్యంలో రేణిగుంట ఎయిర్‌పోర్టు చేరుకున్న జగన్.. తన కాన్వాయ్‌లో తిరుపతికి బయలుదేరారు. అయితే అలా మొదలై సీఎం కాన్వాయ్ వెంబడి ఓ మహిళ పరిగెత్తుతూ వచ్చింది. ఇది గమనించిన సీఎం జగన్ కాన్వాయ్కి నిలిపివేయించి.. ఓఎస్డీని ఆ మహిళ దగ్గరకు పంపించారు. అంతేకాకుండా ఆ మహిళ…