మావోయిస్టులు వరుసగా పోలీసుల ముందు లొంగిపోతున్నారు. కరోనా ప్రభావం తరువాత మావోయిస్టుల లొంగుబాటులు ఎక్కువయ్యాయి. కానీ ఈ విషయం మావోయిస్టు పార్టీలకు తీవ్ర నష్టాన్ని కలిగించేదే. అయితే ఇటీవల కరోనా బారినపడి మావోయిస్టుల్లో అగ్రనేతలు సైతం మరణించారు. దీంతో మావోయిస్టులు అడవిని వీడి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. తాజా మరో 14 మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో ఎస్పీ ముందు లొంగిపోయారు. వీరిలో రూ.లక్ష రివార్డు ఉన్న సన్నా మార్కం కూడా ఉండడం విశేషం. భద్రత సిబ్బందిపై…
రాష్ట్రంలోని కొమురం భీం ఆసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో ఆదివారం భూమి కంపించింది. భూమి కంపించడంతో ప్రజలు ఇళ్లను వదిలి బయటకు పరుగులు తీశారు. మంచిర్యాల జిల్లాలో వారం వ్యవధిలోనే భూమి కంపించడం ఇది రెండో సారి. దీంతో ఆ జిల్లా వాసులు భయాందోళనకుల గురవుతున్నారు. భూకంపం రావడంతో బోగ్గు గనుల్లో ఉన్న కార్మికులను ఖాళీ చేయించారు అధికారులు. వీటితో పాటు కరీంనగర్, వరంగల్, సిరిసిల్ల జిల్లాల్లో భూమి స్వల్పంగా కంపించినట్లు అధికారులు వెల్లడించారు. భూకంపం సంభవించడంతో…
విశాఖ ఉక్కు ప్రవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి పోరాటం చేస్తోంది. వారికి సంఘీభావం తెలిపేందుకు విశాఖకు చేరుకున్న పవన్.. కూర్మన్నపాలెం వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ.. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఏపీ ప్రభుత్వం కృషి చేయాలన్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వంతో విన్నవించి విశాఖ ప్రైవేటీకరణను ఆపాలని కోరారు. అవసరమైతే సీఎం జగన్ అఖిలపక్షాన్ని పిలవండి అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణలో ప్రతి యువకుడు జైతెలంగాణ…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు గుడ్న్యూస్ చెప్పింది. ఇటీవలే పోస్ట్మెట్రిక్ స్కాలర్ షిప్, ఫీజు రియంబర్స్మెట్ దరఖాస్తు గడువు డిసెంబర్ 31వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే మరోసారి ఈ గడువును పెంచుతున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ఈ పాస్ ద్వారా విద్యార్థులు జనవరి నెల చివరి వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. ఇప్పటివరకు తక్కువ శాతంలో విద్యార్థులు స్కాలర్ షిప్, ఫీజు రియంబర్స్మెంట్కు దరఖాస్తు చేసుకున్నారని.. అందుకే దరఖాస్తు గడువును…
హుజురాబాద్ ఉప ఎన్నికకు ఈ రోజు పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు 306 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారనంటూ.. ఒకరిపైఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్కు పోలీసులు షాక్…
అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ లోక్సత్తా నేతపై దాడి చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. లోక్సత్తా పార్టీకి చెందిన వెంకటరమణ రాయదుర్గంలో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కంట్లో కారం కొట్టి కర్రలతో దాడికి యత్నించారు. దీంతో వెంకటరమణ తన వాహనాన్ని అక్కడే వదిలిపెట్టి సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ వైపు పరుగులు తీశారు. వెంకటరమణను దుండగులు ద్విచక్ర వాహనాలపై వెంబడించినట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్ కు…