గడ్డి అన్నారంలో గల మార్కెట్‌ను తరలించేందుకు తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. అయితే మార్కెట్‌ను తరలించవద్దని పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు విచారణ చేపట్టింది. అంతేకాకుండా గడ్డి అన్నారం మార్కెట్ తరలింపుపై హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మార్కెట్ తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. విస్తృత ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవచ్చునని హైకోర్టు తెలిపింది.
అలాగే బాటసింగారం వెళ్లేందుకు వ్యాపారులకు హైకోర్టు నెల గడువు ఇచ్చింది. నెల రోజుల్లో ప్రభుత్వం బాటసింగారంలో పూర్తి సదుపాయాలు కల్పించాలని అధికారులను అదేశించింది. దీనితో పాటు ఆదేశాలిచ్చినా వ్యాపారులను మార్కెట్ లోకి అనుమతించకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కౌంటర్లు దాఖలు చేయని గడ్డిఅన్నారం మార్కెట్ కమిటి చైర్మన్, కార్యదర్శిపై అగ్రహం వ్యక్తం చేస్తూ.. చైర్మన్ ముత్యంరెడ్డి, కార్యదర్శి పి.హర్షలకు రూ.2వేల చొప్పున హైకోర్టు జరిమానా విధించింది.