Home
Breaking News
Breaking News News
-
కాశ్మీర్లో 6గురు ఉగ్రవాదులు ఖతం..
కాశ్మీర్లో పోలీసు, భద్రతా దళాల ఉమ్మడి బృందాలు గత 48 గంటల్లో 6 గురు ఉగ్రవాదులను హతమార్చాయి. అనంత్‌నాగ్‌లోని కలాన్ సిర్గుఫ్వారా గ్రామంలో ఒక ఉగ్రవాది ఉన్నాడని విశ్వసనీయ సమాచారం మేరకు కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌ను శనివారం ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. అయితే సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఉగ్రవాదిని లొంగిపోవాలని కోరినా వినకుండా విచక్షణారహితంగా పోలీసులు, భద్రతా దళాలపై కాల్పులు తెగబడ్డాడు. దీంతో ఎదురుకాల్పులు చేసి ఆ ఉగ్రవాదిని ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చిందని పోలీసులు వెల్లడించారు. అయితే… -
వైభవోపేతంగా కొమురవెల్లి మల్లన్న కల్యాణోత్సవం..
సిద్ధిపేట జిల్లాలోని కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా స్వామి వారి కల్యాణోత్సవం కన్నుల పండువగా సాగింది. ప్రభుత్వం తరుపున స్వామి వారికి పట్టువస్త్రాలను ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు సమర్పించారు. ఈ కల్యాణోత్సవ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు కూడా హజరయ్యారు. మల్లన్న స్వామి కల్యాణోత్సవంతో నేటి నుంచి కొమురవెల్లిలో మల్లన్న… -
బీహార్‌లో నూడుల్స్ పరిశ్రమలో భారీ పేలుడు..
బీహార్ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్‌లో గల నూడుల్స్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. నూడుల్స్ పరిశ్రమలో వినియోగిస్తున్న ఓ బాయిలర్ ప్రమాదవశాత్తు పేలింది. దీంతో అక్కడే ఉన్న 10 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మరి కొందరికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అయితే ఘటనపై సమాచారం అందిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరగవచ్చని సమాచారం. ఈ… -
కేసులు పెరుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేదు : అచ్చెన్నాయుడు
ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారత్‌లో రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. అయితే ఇటీవల ఏపీలో కూడా ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదవడంతో ఏపీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 6కు చేరుకుంది. ఒమిక్రాన్ వ్యాప్తిపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా ఏపీ ప్రభుత్వంలో చలనం లేదంటూ ఆరోపించారు. ప్రజల ప్రాణాలకంటే కక్ష సాధింపు చర్యలకే సీఎం జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. వ్యాక్సినేషన్లో ఏపీ వెనకబడిందని, ఇతర… -
ఒమిక్రాన్ టెన్షన్.. కర్ణాటకలో నైట్ కర్ఫ్యూ..
ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇండియాలో కూడా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌లతో ప్రజలు, ప్రభుత్వాలు ఆర్థికంగా చాలా నష్టపోయాయి. అయితే ఇప్పుడు ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో మరోసారి లాక్డౌన్ విధిస్తే ఆర్థిక రాష్ట్రాల్లో కురుకుపోయే ప్రమాదం లేకపోలేదు. ఇటు చూస్తే ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా కంటే 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో కర్ణాటకలో నైట్ కర్ఫ్యూ… -
సంజయ్‌ది నిరుద్యోగ దీక్ష కాదు.. సిగ్గు లేని దీక్ష : కేటీఆర్
తెలంగాణలో ఉద్యోగాల భర్తీ చేపట్టాలని కోరుతూ బీజేపీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ రేడు ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగ దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ యువతకు ఉద్యోగాల కల్పనపై టీఆర్ఎస్ ప్రభుత్వ చిత్తశుద్ధి, ఉపాధి అవకాశాల విషయంలో బీజేపీ వైఫల్యాలపై మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ విడుదల చేశారు. బండి సంజయ్‌ది ఉద్యోగ దీక్ష కాదు.. సిగ్గులేని దీక్ష అంటూ ధ్వజమెత్తారు. బండి సంజయ్ తలపెట్టిన దీక్ష పచ్చి అవకాశవాదమేనని, బీజేపీ ప్రభుత్వం… -
2 లక్షలకు చేరువలో ఒమిక్రాన్ కేసులు…
కరనా రక్కసి మరోసారి ఒమిక్రాన్ రూపంలో రెక్కలు చాస్తోంది. ఇప్పటికే డెల్టా వేరియంట్‌తోనే ప్రపంచ దేశాలు సతమతమవుతుంటే.. ఇప్పుడు ఒమిక్రాన్ పలు దేశాలకు వ్యాపించి దాని ప్రభావాన్ని చూపుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు సంఖ్య 1,83,240కి చేరుకుంది. ఇప్పటి వరకు 31 మంది ఒమిక్రాన్ సోకి మృతి చెందారు. యూకేలో 1,14,625 ఒమిక్రాన్ కేసులు ఉండగా, డెన్మార్క్‌లో 32,877, కెనడాలో 7,500, యూఎస్‌లో 6,331 చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పటికే పలు దేశాలు విదేశాల… -
సంక్రాంతి పండుగకు 320 ప్రత్యేక బస్సులు..
ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ఆంధ్రవాసులు సంక్రాంతి పండుగకు ఊరు చేరుకుంటారు. ప్రతి సంవత్సరాలాగే ఈ సంవత్సరం కూడా ప్రత్యేక బస్సుల నడపేందుకు ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా తూర్పుగోదావరి జిల్లాలోని తొమ్మిది డిపోల నుంచి 320 ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. జనవరి 9 నుంచి 13వ తేదీ మధ్య వివిధ ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా… -
ఒంగోలులో ఒమిక్రాన్ కేసు కలకలం..
దక్షిణాఫ్రికాలో గత నెల వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే భారత్‌లోని పలు రాష్ట్రాల్లో వ్యాపించింది. అయితే తాజాగా ఏపీలో మరో ఒమిక్రాన్ కేసు నమోదవడంతో స్థానికంగా కలకలం రేగింది. ఉద్యోగం కోసం దక్షిణాఫ్రికాలో ఉంటూ ఇటీవలే ప్రకాశం జిల్లా ఒంగోలుకు వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ గా నిర్దారణైంది. విదేశాలలో చేయించుకున్న పరీక్షల్లో నెగిటివ్ రాగా, ఒంగోలులో మరోసారి నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ వ్యక్తి శ్యాంపిల్స్‌ను హైదరాబాద్… -
నేను పుట్టిన ఊరంటే నాకు చాలా ఇష్టం : సీజేఐ ఎన్వీ రమణ
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేడు ఆయన సొంతూరులో పర్యటిస్తున్నారు. కృష్ణా జిల్లాలోని పొన్నవరం ఆయన స్వగ్రామం. అయితే ఆయనను గ్రామస్థులు ఎడ్లబండిపై ఊరేగింపు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సమేతంగా శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్థుల అభినందన సభలో మాట్లాడుతూ.. ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలు మర్చిపోను.. నేను పుట్టిన ఊరంటే నాకు చాలా ఇష్టమని ఆయన అన్నారు. చిన్నతనంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. 1967లోనే రాజకీయంగా చైతన్యమైన గ్రామం మాది.…
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?