Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- మీరు ప్రపంచానికే హీరో..
- స్మిత్ మచ్చర్‌పై ఇజ్రాయిల్ ప్రధాని ప్రశంసల జల్లు..
- ఇజ్రాయిల్ స్వాతంత్ర్య వేడుకలకు ఆహ్వానించిన నెతన్యాహూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫ్లైదుబాయ్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రశంసలు కురిపించారు. విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన కోపైలట్ దాడిని అడ్డుకుని 180 మంది ప్రయాణికుల్ని కాపాడారు. ఈ ఘటనలో మచ్చర్ చూపించిన ధైర్యాన్ని నెతన్యాహూ కొనియాడారు. ‘‘ఇజ్రాయిల్, భారత్‌తో పాటు ప్రపంచానికి హీరో’’గా అభివర్ణించారు. సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న విమానాన్ని ఒమన్ జాతీయుడైన కోపైలట్ కూల్చే ప్రయత్నం చేశాడు. అతడిని హమామ్ అల్ హమ్మామీగా గుర్తించారు.
శనివారం స్మిత్‌తో ఫోన్లో మాట్లాడిన నెతన్యాహూ ఇజ్రాయిల్ స్వాతంత్య్ర దినోత్సవానికి హాజరుకావాలని ఆహ్వానించారు. ఈ గౌరవం సాధారణంగా ఇజ్రాయిల్ పౌరులకు మాత్రమే దక్కుతుందని, అయితే మచ్చర్ విషయంలో ఇజ్రాయిల్ ప్రజలంతా ఆయనను తమవాడిగా స్వీకరించారని అన్నారు.
Also Read
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
తాను ఎలాంటి దాడిని తట్టుకుని విమానాన్ని రక్షించాననే విషయాన్ని మచ్చర్ నెతన్యాహూకు వెల్లడించారు. మచ్చర్ చెప్పిన వివరాలు విన్న నెతన్యాహూ ఆయన ధైర్యాన్ని ప్రశంసించారు. మీ ధైర్యానికి ఆశ్చర్యపోయానని, అసాధారణ పరిస్థితుల్లో ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకున్న తీరు తనను ఆశ్చర్యపరిచిందని అన్నారు. మీరు ఎంతో మంది ప్రాణాలు కాపాడారని ప్రశంసించారు. మచ్చర్‌కు తన భార్య తరుఫున నెతన్యాహూ శుభాకాంక్షలు తెలిపారు.
తాజావార్తలు
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!