రాష్ట్రంలో రోజురోజుకూ మరింత చలి తీవ్రత పెరుగుతోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా కనిష్టస్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అధికారులు తెలిపారు. మునుపెన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతు పడిపోతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. మరో 3 రోజుల పాటు తీవ్ర చలిగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కుమురం భీం జిల్లా గిన్నెధరిలో అత్యల్పంగా 3.5 డిగ్రీలు నమోదైనట్లు అధికారులు…
శంషాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. బ్యాటరీలను దొంగతనం చేసారంటూ ఇద్దరు యువకులను కరెంటు స్తంభానికు కట్టివేసి గుండు కొట్టించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. జరిగిన అవమానంతో బాధితులు స్థానిక ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శంషాబాద్ లోని అహ్మద్ నగర్ లో నివాసం ఉంటున్న మహమ్మద్ ఖుద్దూస్, ఎండి…
మొన్నటి వరకు కరోనా డెల్లా వేరియంట్‌తోనే కొట్టుమిట్టాడిన ప్రపంచ దేశాలు ఇప్పుడు గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్‌తో భయాందోళన గురవుతున్నాయి. ఈ వేరియంట్ ఇప్పటికే పలు దేశాలకు వ్యాప్తి చెందింది. ఒమిక్రాన్ వేరియంట్ ఇటీవల భారత్‌లోకి కూడా ప్రవేశించి దాని ప్రభావాన్ని చూపుతోంది. ఇప్పటికే దేశంలో పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్యం 173కు చేరుకుంది. ఢిల్లీలో 6, గుజరాత్ 1, కేరళలో 4 చొప్పున గడిచిన…
ఇప్పటికే ప్రపంచ దేశాలు కరోనా డెల్టా వేరియంట్‌తో సతమతమవుతున్న వేళ దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ మరోసారి యావత్తు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే తాజాగా ఒమిక్రాన్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ పలు విషయాలు వెల్లడించారు. ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాప్తి చెందుతోందని ఆయన తెలిపారు. ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకుని కోవిడ్ బారినపడి కోలుకున్న వ్యక్తులైన వారికి సైతం ఈ ఒమిక్రాన్…
ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర తీరును నిరసిస్తూ టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మండలాల్లో, నియోజకవర్గాల్లో, జిల్లాల్లో టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున్న ర్యాలీ నిర్వహిస్తూ నిరసనలు తెలుపుతున్నారు. అయితే నియోజకవర్గ కేంద్రాల్లో ఆయా ఎమ్మెల్యేలు పాల్గొనాలని కేసీఆర్ సూచించడంతో గజ్వేల్ ఇందిరాపార్క్ వద్ద ధర్నాలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఆందోళ చేస్తే కార్లు ఎక్కించి చంపిన చరిత్ర బీజేపీది అని…
మెల్బోర్న్లో 2018లో జరిగిన ప్రపంచకప్‌లో కాంస్య పతకం సాధించిన తొలి భారతీయ జిమ్నాస్ట్‌గా చరిత్ర సృష్టించింది 25 ఏళ్ల హైదరాబాద్ జిమ్నాస్ట్, చెందిన బుద్ధార్ అరుణారెడ్డి. అయితే తాజాగా సోమవారం ఈజిప్ట్‌లోని కైరాలో జరిగిన హరోస్ కప్ అంతర్జాతీయ కళాత్మక టోర్నమెంట్లో హైదరాబాద్ జిమ్నాస్ట్ బుద్ధార్ అరుణారెడ్డి రెండు పతకాలను కైవసం చేసుకొని మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఫ్లోర్, వాల్ట్ ఈవెంట్లో అత్యున్నత గౌరవాన్ని సాధించి అరుణరెడ్డి రెండు స్వర్ణపతకాలను సాధించింది. గత సంవత్సరం…
గత నెల దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చింది. అయితే ఈ వేరియంట్ డెల్టా వేరియంట్ కంటే 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ఇప్పటికే పలు దేశాలకు ఈ వేరియంట్ వ్యాప్తి చెందింది. అయితే ఇటీవల భారత్‌లోకి కూడా ఒమిక్రాన్ వేరియంట్ ప్రవేశించింది. భారత్‌లోని పలు రాష్ట్రాలకు వ్యాప్తి చెందిన ఒమిక్రాన్ వేరియంట్ దాని ప్రభావాన్ని చూపుతోంది. 20 రోజుల వ్యవధిలోనే దాదాపు 100కు పైగా ఒమిక్రాన్ కేసులు దేశ వ్యాప్తంగా నమోదయ్యాయి.…
ధాన్యం కొనుగోళ్లపై లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలంటూ తెలంగాణ మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు వ్యవసాయ శాఖ మంత్రి అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రత్యకప్రసారం కోసం కింద ఉన్న లింక్ ను క్లిక్ చేయండి.
క్రైస్తవులకు పర్వదినమైన క్రిస్మస్ను పురస్కరించుకొని సీఎం కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో మంగళవారం విందును ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎల్బీ నగర్ వైపుకు వెళ్లే ట్రాఫిక్‌పై ఆంక్షలు విధిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దీని ప్రకారం, బీజేఆర్ విగ్రహం వైపు ట్రాఫిక్ అనుమతించబడదని, నాంపల్లి, చాపెల్ రోడ్ వైపు మళ్లించబడుతుందని అధికారులు వెల్లడించారు. అదేవిధంగా, అబిడ్స్ రోడ్ నుండి ట్రాఫిక్‌ను బీజేఆర్ విగ్రహం వైపు అనుమతించరు. ఆ…
ఇటీవల ఇంటర్ ఫస్టియర్ ఫలితాలను ఇంటర్ బోర్డ్ అధికారులు విడుదల చేశారు. అయితే ఈ ఫలితాలలో 51 శాతం మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. టాప్ ర్యాంక్ విద్యార్థులు కూడా పాస్ కాకపోవడం గమనార్హం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికీ పలువురు విద్యార్థులు ఫెయిల్ అయ్యామనే మనస్థాపంతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో విద్యార్థి సంఘాలు ఇంటర్ బోర్డు, విద్యాశాఖ తీరుపై నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే విద్యాశాఖ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలపై…