Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
- Tecno Pop 20C సీక్రెట్‌గా లాంచ్
- 4GB RAM, 64GB స్టోరేజ్‌తో కొత్త ఫోన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tecno Pop 20C: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో Tecno మరో కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. Tecno Pop 20C పేరుతో ఈ ఫోన్‌ను కంపెనీ ఆఫ్రికన్ మార్కెట్లో నిశ్శబ్దంగా పరిచయం చేసింది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్ ఓ రిటైలర్ వెబ్సైట్లో ధరతో సహా లిస్ట్ కావడంతో ఫోన్‌కు సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు కూడా వెల్లడయ్యాయి. భారీ డిస్ప్లే, 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 5200mAh భారీ బ్యాటరీ, 4GB RAM, 64GB స్టోరేజ్ వంటి ఫీచర్లను Tecno Pop 20Cలో అందించారు. ముఖ్యంగా ఈ ఫోన్ Android 16 OSతో వస్తుండటం బడ్జెట్ సెగ్మెంట్లో ఆసక్తిని పెంచుతోంది.
Tecno Pop 20C ధర ఎంత?
Tecno Pop 20Cని ప్రస్తుతం కెమెరూన్ మార్కెట్లో లిస్ట్ చేశారు. Glotelho అనే రిటైలర్ వెబ్సైట్లో ఈ ఫోన్ FCFA 64,990 ధరతో కనిపించింది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.10,780కు సమానం. ఈ ఫోన్‌ను బ్లాక్, బ్లూ, ఆరెంజ్, గ్రే కలర్ ఆప్షన్లలో లిస్ట్ చేశారు. అదనంగా వైట్ కలర్ వేరియంట్ కూడా రిటైలర్ లిస్టింగ్‌లో కనిపించింది. అయితే భారత్‌తో పాటు ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో Tecno Pop 20C ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై ప్రస్తుతం స్పష్టమైన సమాచారం లేదు.
Also Read
- Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
- Vivo V80 FE: వివో V80 FE త్వరలో భారత్‌లోకి? BIS సర్టిఫికేషన్‌లో గుర్తింపు.. 7500mAh బ్యాటరీ ఉండే ఛాన్స్!
- iPhone Duo: స్క్రీన్ పగిలితే రూ. 1.5 లక్షలు గోవిందా.. ‘ఐఫోన్ డ్యుయో’తో జర భద్రం!
- Lenovo IdeaPad Vibe 15Q8X12: లెనోవా IdeaPad Vibe 15Q8X12 లాంచ్.. Snapdragon X ప్రాసెసర్, 15-ఇంచ్ డిస్ప్లే
6.75 అంగుళాల పెద్ద డిస్ప్లే
Tecno Pop 20Cలో 6.75 అంగుళాల డిస్ప్లేను అందించారు. పెద్ద స్క్రీన్ కావడంతో వీడియోలు చూడటం, సోషల్ మీడియా వినియోగం, వెబ్ బ్రౌజింగ్ వంటి రోజువారీ అవసరాలకు ఈ ఫోన్ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.
MediaTek ప్రాసెసర్‌తో పనితీరు
ఈ స్మార్ట్‌ఫోన్‌లో MediaTek MT6769 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇది ఆక్టాకోర్ ప్రాసెసర్. ఇందులో 2 Cortex-A75 కోర్లు – 2.0GHz క్లాక్ స్పీడ్, 6 Cortex-A55 కోర్లు – 1.7GHz క్లాక్ స్పీడ్, ARM Mali-G52 GPU అందించారు. సాధారణ రోజువారీ పనులు, సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్ వంటి అవసరాలకు ఈ ప్రాసెసర్ ఉపయోగపడే అవకాశం ఉంది.
4GB RAM.. 64GB స్టోరేజ్
Tecno Pop 20Cలో 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ అందించారు. అదనంగా 4GB వర్చువల్ RAMకు కూడా సపోర్ట్ ఉంది. దీంతో అవసరమైనప్పుడు వర్చువల్ మెమరీని ఉపయోగించుకుని మల్టీటాస్కింగ్‌ను మెరుగుపరచుకునే అవకాశం ఉంటుంది. కెమెరాల విషయానికి వస్తే వెనుక భాగంలో 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. బడ్జెట్ ధర విభాగంలో సాధారణ ఫోటోగ్రఫీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ కెమెరా సెటప్‌ను అందించినట్లు తెలుస్తోంది.
5200mAh భారీ బ్యాటరీ
Tecno Pop 20Cలో ప్రధాన ఆకర్షణల్లో ఒకటి దీని బ్యాటరీ. ఫోన్లో 5200mAh బ్యాటరీను అందించారు. అదనంగా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ఛార్జింగ్ స్పీడ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ప్రస్తుతం స్పష్టంగా వెల్లడికాలేదు. సాఫ్ట్వేర్ పరంగా Tecno Pop 20C Android 16 OSతో అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌గా Android 16ను అందించడం ఈ ఫోన్‌కు మరో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. Tecno Pop 20Cలో డ్యూయల్ నానో-SIM సపోర్ట్ ఉంది. కనెక్టివిటీ కోసం Wi-Fi, Bluetooth, USB Type-C వంటి ఫీచర్లు అందించారు.
భారత్‌లోకి వస్తుందా?
ప్రస్తుతం Tecno Pop 20C కెమెరూన్ రిటైల్ మార్కెట్లో కనిపించింది. భారత్‌లో ఈ ఫోన్‌ను ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంపై కంపెనీ నుంచి అధికారిక సమాచారం లేదు. కాబట్టి భారతీయ ధర, లాంచ్ తేదీ వంటి వివరాల కోసం అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
World Records: ఐదు మ్యాచ్‌ల్లో 1864 పరుగులు.. టీ20 సిరీస్‌లో సరికొత్త రికార్డులు..
-
Rajahmundry: 11 గ్రామ పంచాయతీల విలీనానికి గెజిట్ విడుదల.. మహానగరంగా రాజమహేంద్రవరం!
-
AP Municipal Elections 2026: నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం.. విజయవాడలో రాజకీయ వేడి!
-
Shreyas Iyer: సూర్యవంశీకి ఛాన్స్ దక్కకపోవడానికి కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
-
Haizil Jebin: 20 బ్యాక్‌లాగ్స్.. జొమాటో డెలివరీ బాయ్..సీన్ కట్ చేస్తే పైలట్..!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!