కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఒమిక్రాన్ వ్యాప్తితో దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఏపీలో కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగతూ వస్తున్నాయి. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో పెరుగుతున్నాయి. అయితే గతంలో ఫస్ట్, సెకండ్ వేవ్‌లలో ఎన్టీఆర్ ట్రస్ట్ కోవిడ్ బాధితులకు సేవలందించింది. ఎంతో మంది కోవిడ్ సోకినవారికి ఉచితంగ మందులు అందించింది. ప్రస్తుతం మళ్లీ కరోనా రక్కసి కోరలు చాస్తున్న క్రమంలో కోవిడ్ బాధితుల కోసం మళ్లీ ఎన్టీఆర్…
కరోనా రక్కసి కోరలు చాస్తోంది. ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో క్రమక్రమంగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఏపీలో సైతం కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అయితే తెలంగాణ కరోనా ఉధృతి దృష్ట్యాల విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అయితే ఏపీలో మాత్రం విద్యాసంస్థలు నడుస్తూనే ఉన్నాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారినపడుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ప్రతి…
ఏపీలో పీఆర్సీపై రగడ సాగుతోంది. ఇటీవల సీఎం జగన్ ప్రకటించిన 11 పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తితో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాస రావు మాట్లాడుతూ.. రెండో రోజు ముఖ్యమంత్రితో చర్చలు జరుగలేదని, ఆ రోజు మాకు మాట్లాడే అవకాశం రాలేదన్నారు. ముఖ్యమంత్రి పీఆర్సీపై తన ప్రకటన చేసి వెళ్ళి పోయారని, ప్రభుత్వంతో మాకు ఎటువంటి ఒప్పందం లేదని, మేము ఎక్కడా సంతకాలు పెట్టలేదని ఆయన స్పష్టం చేశారు. పీఆర్సీ…
రానున్న రెండేళ్ళ కాలంలో కాకినాడ శివారు ప్రాంతాలకు తాగునీటి సమస్యను తీరుస్తామని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. బుధవారం ఆయన కాకినాడలో మాట్లాడుతూ.. త్వరలో జరిగే కొన్ని మున్సిపల్ ఎన్నికలకు గ్రామాల విలీన సమస్యలు ఉన్నాయని అన్నారు. దీనిపై కొందరు కోర్టును ఆశ్రయించారని, వాటికి వేకెట్ చేయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. రోడ్లు అనేవి ఒక నిరంతర ప్రక్రియ. ఒక కొత్త రోడ్డుకు ఐదేళ్ళ నుండి ఏడేళ్ళ వరకు కాల పరిమితి…
ఏపీలో సినిమా టికెట్ల సమస్య ఇంకా సర్దుమనగడం లేదు. ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్లను ఆన్లైన్ విధానంలో పొందాలని జీవో 142ను జారీ చేసింది. అంతేకాకుండా టికెట్ల ధరలపై కూడా జీవో 35ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో 35ను సవాల్ చేస్తూ ఇప్పటికే సినిమా నిర్మాతలు, ఎగ్జిబిటర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవోను రద్దు చేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం…
కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను కట్టిడి చేసేందుకు కోవిడ్ టీకాలను పంపిణీ చేస్తోంది. అయితే ఇటీవల 15 నుంచి 18 సంవత్సరాల వయసుగల యువతకు కూడా కోవిడ్ టీకాలు పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో యువత కోవిడ్ టీకాలను తీసుకోవాలంటూ అవగాహన కల్పిస్తోంది. యువతను ఆకర్షించేందుకు ఇనార్బిట్ మాల్లో ఉచిత టీకాను అందజేయనున్నట్లు ఆ మాల్ నిర్వాహకులు వెల్లడించారు. 15-18 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతను…
ఆరాంఘర్ నుండి నెహ్రూ జూలాజికల్ పార్క్ మార్గంలో 4.5 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న, నగరంలో రెండవ అతి పొడవైన ఫ్లైఓవర్ మార్చి 2023 నాటికి ప్రారంభించబడే అవకాశం ఉంది. ప్రస్తుతం పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే నగరంలో పొడవైన ఫ్లైఓవర్. 636.80 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ (ఎస్ఆర్డీపీ) కింద ఆరు లేన్ల ఫ్లైఓవర్‌ను నిర్మిస్తున్నారు. ఫ్లై ఓవర్ పనులను బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ పరిశీలించారు.…
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను సంతృప్తి పరచాలేకానీ… బ్లాక్ మెయిల్ చేయడం తగదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ అన్నారు. తిరుపతిలోని స్థానిక బైరాగి పట్టెడలో ఉన్న సీపీఐ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతం దాల్చుతున్న నేపథ్యంలో ఖమ్మం నందు ఆసుపత్రిలో ఉన్న కేసీఆర్ ఉద్యమ విరమణకు ప్రయత్నించగా తెలంగాణ ప్రజలు, ఊస్మానియా వర్శిటీ విద్యార్థులు తిరగబడటంతో తప్పనిసరి పరిస్థితుల్లో…
తెలంగాణకే తలమానికమైన సమ్మక్క-సారక్క జాతర ఏర్పాట్లను మంత్రి సత్యవతి రాథోడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమ్మక్క-సారక్క జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలను నుంచి రోజుకు సుమారు 3 లక్షల మంది అమ్మవార్ల దర్శనం కోసం విచ్చేస్తారని అంచనా వేసినట్లు ఆమె పేర్కొన్నారు. భక్తుల ఆరోగ్య దృష్ట్యా జాతరలో మెడికల్…
కరోనా మహమ్మారి రోజురోజుకు మరింతగా విజృంభిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి వచ్చిన తరువాత మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు దేశవ్యాప్తంగా భారీగా నమోదవుతున్నాయి. అయితే కరోనా రక్కసి కొత్త కొత్తగా రూపాంతరాలు చెంది ప్రజలపై విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా సోకి ఇంటివద్దనే ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నవారి కోసం విలువైన సమచారాన్ని సోషల్‌మీడియా వేదికగా…