టీనేజర్లకు ఇనార్బిట్ మాల్‌లో ఉచిత టీకా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను కట్టిడి చేసేందుకు కోవిడ్ టీకాలను పంపిణీ చేస్తోంది. అయితే ఇటీవల 15 నుంచి 18 సంవత్సరాల వయసుగల యువతకు కూడా కోవిడ్ టీకాలు పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో యువత కోవిడ్ టీకాలను తీసుకోవాలంటూ అవగాహన కల్పిస్తోంది. యువతను ఆకర్షించేందుకు ఇనార్బిట్ మాల్‌లో ఉచిత టీకాను అందజేయనున్నట్లు ఆ మాల్ నిర్వాహకులు వెల్లడించారు. 15-18 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతను వారి తల్లిదండ్రులు కోవిడ్ టీకా మొదటి డోస్ కోసం ఇనార్బిట్ మాల్‌లో ఉచితంగా వేయించవచ్చు. మాల్ ప్రముఖ హాస్పిటల్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది. జనవరి-ఫిబ్రవరిలో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య టీకాను అందజేస్తుంది.
“మేము, ఇనార్బిట్ మాల్ హైదరాబాద్‌లో, మా కస్టమర్‌లకు మేము చేయగలిగిన విధంగా సేవలందించడం సంతోషంగా ఉంది. తల్లిదండ్రులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మరియు వారి పిల్లలకు ఇనార్బిట్‌లో సురక్షితమైన, ఆరోగ్యకరమైన మరియు స్వచ్ఛమైన వాతావరణంలో టీకాలు వేయించాలని నేను కోరుతున్నాను, అది కూడా ఉచితంగా’ అని ఇనార్బిట్ మాల్ సెంటర్ హెడ్ శరత్ బెలవాడి అన్నారు.
Also Read
వాక్-ఇన్ క్యాంప్‌కు ఆరోగ్య సేతు యాప్‌లో ముందస్తు రిజిస్ట్రేషన్ అవసరం. తల్లిదండ్రులు వారి పిల్లలకు మొదటి డోస్ కోసం వారి ఆధార్ కార్డ్‌ని తీసుకెళ్లాలి. టీకాలు వేసుకున్న అభ్యర్థులందరూ కనీసం 30 నిమిషాలు అక్కడే వేచి ఉండాలి. ఏదైనా సహాయం కోసం వైద్యుల బృందం సిద్ధంగా ఉంటుంది. టీకా శిబిరం గురించి మరింత సమాచారం కోసం 8008054704 ఫోన్ నెంబర్‌ను సంప్రదించండి.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!