ఏపీ ప్రభుత్వ జీవోను సవాల్ చేసిన మల్టీప్లెక్స్ అసోసియేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో సినిమా టికెట్ల సమస్య ఇంకా సర్దుమనగడం లేదు. ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్లను ఆన్లైన్ విధానంలో పొందాలని జీవో 142ను జారీ చేసింది. అంతేకాకుండా టికెట్ల ధరలపై కూడా జీవో 35ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో 35ను సవాల్ చేస్తూ ఇప్పటికే సినిమా నిర్మాతలు, ఎగ్జిబిటర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవోను రద్దు చేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేయడంతో హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి సీఎం జగన్‌తో సమావేశమై సినిమా టికెట్ల ధరలపై చర్చించారు.
త్వరలోనే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ఆయన వెల్లడించారు. అయితే తాజాగా ఏపీ హైకోర్టుని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆశ్రయించింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో 142ను సవాల్ చేస్తూ హైకోర్టులో మల్టీప్లెక్స్ అసోసియేషన్ పిటిషన్ దాఖలు చేసింది. సినిమా టికెట్లు ఆన్లైన్లో ప్రభుత్వ విక్రయాలు చేసేలా జీవో ఉందని, ప్రభుత్వ జీవో నిబంధనలకు విరుద్దమని పిటిషనర్ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. విచారణను 4 వారాలకి వాయిదా వేసింది.
Also Read
- AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
- Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
- PVN Madhav: సీఎం చంద్రబాబుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడి లేఖ.. 22-A భూములపై కీలక సూచనలు
తాజావార్తలు
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
-
Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
-
Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!