విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ వద్ద టీపీసీసీ తరపున టీపీసీసీ అధికార ప్రతినిధి, సమన్వయ కర్త బోరెడ్డి అయోధ్య రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పేదలను లక్ష్యంగా చేసుకుని విద్యుత్ సంస్థలు 2022-23 సంవత్సరానికి టారిఫ్ లను ప్రతిపాదించాయని, పేదల మీద ఇప్పుడు ఉన్న విద్యుత్ చార్జీలకు అదనంగా 55.20 శాతం పెంపునకు ప్రతిపాదనలు పంపాయని ఆయన అన్నారు. ఈ పెంపు నెలకు 50 యూనిట్లకు లోపు వినియోగదారుల మీదనే పడుతుందని, 51-100…
హైదరాబాద్ కు చెందిన పలువురు వ్యాపారవేత్తలు డ్రగ్స్ డీలర్ టోనీ సంబంధాలు పెట్టుకునందున అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు నేడు హై కోర్టులో విచారణకు వచ్చింది. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బిజినెస్ మేన్ లను ను విచారించాల్సిన అవసరం ఉందన్న పబ్లిక్ ప్రాసిక్యూషన్ అన్నారు. అంతేకాకుండా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కీలక నిందితుడు టోని దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఆధారాలు సేకరించని పీపీ కోర్టుకు తెలిపారు. నిందితుడు కాల్…
సిరిసిల్ల జిల్లా సుద్దాల కి చెందిన ప్రకృతి ప్రేమికుడు ప్రకాష్ కుమార్తె బ్లెస్సీ. తన పుట్టిన రోజు నాడు పర్యావరణ హిత కార్యక్రమం చేయాలని తలచింది. పచ్చదనాన్ని ప్రేమించే తండ్రినే స్ఫూర్తిగా తీసుకుని 65 వేల సీడ్ బాల్స్ స్వయంగా తయారుచేసింది. తాను తయారు చేసిన సీడ్ బాల్స్ కొన్ని సిరిసిల్ల అటవీ ప్రాంతంలో వెదజల్లింది. పర్యావరణంపై ప్రేమతో భావి తరాలకు స్ఫూర్తివంతంగా నిలుస్తున్న బ్లెస్సీని మంత్రి కేటీయార్, ఎంపీ సంతోష్ కుమార్ ట్విట్టర్ వేదికగా అభినందించారు.…
తెలంగాణ కోసం పార్లమెంటు సభ్యులుగా మేమంతా ఆరోజు పోరాడాం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ వల్లే తెలంగాణ వచ్చిందని అన్నారు. నిరుద్యోగ ఆత్మహత్యలు అన్ని ప్రభుత్వ హత్యలేనని ఆయన ఆరోపించారు. ఒకే కులానికి మంత్రి పదవులు ఉన్నాయని, ఇతర కులాలకు పనికిరాని పదవులు ఉన్నాయని ఆయన అన్నారు. కేంద్రంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు..ఉద్యోగాలు అక్కడ లేవు..ఇక్కడ లేవు.. ఉద్యోగాలు వచ్చే వరకు…
తెలంగాణ లో నిరుద్యోగ భృతి ఇస్తా అని మూడేళ్ళయింది.. ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు అని యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనా రెడ్డి అన్నారు. నిరుద్యోగుల యువత ఆత్మహత్యలు జరుగుతున్నాయని, యువకుడు ముత్యాల సాగర్ చనిపోవడం బాధాకరమన్నారు. అసెంబ్లీ ల ముట్టడి చేసాం.. రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత చనిపోయారు…ఆ అమరవీరుల సాక్షిగా గన్ పార్క్ వద్ద ధర్నా చేపట్టాం ,నివాళులు అర్పించామని ఆయన అన్నారు. సీఆర్ నిరుద్యోగ ఆత్మహత్యలు కనిపించడం లేదా.. 2018 లో ఎన్నికల్లో…
ఏపీలో పీఆర్సీపై స్పష్టత రావడం లేదు. ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రకటించిన 11వ పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తితో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు అన్ని ఏకతాటిపైకి వచ్చి పీఆర్సీ సాధన సమితిగా ఏర్పడ్డాయి. అయితే ఉద్యోగసంఘాలను బుజ్జగించేందుకు ప్రభుత్వం మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఇప్పటికే పలుమార్లు మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాల నేతలను పీఆర్సీపై చర్చలకు రావాలని ఆహ్వానించింది. అయితే ఇప్పటివరకు పీఆర్సీ సాధన సమితి ప్రతినిధులు మంత్రుల కమిటీతో…
వైసీపీ ప్రభుత్వంపైన, సీఎం జగన్ పైన టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ మహిళా ద్రోహి అంతో వంగలపూడి వనిత ధ్వజమెత్తారు. రెండున్నరేళ్ళుగా సీఎంలో మార్పు వస్తుందని ఆశించామని ఆమె అన్నారు. పాదయాత్ర లో ముద్దులు పెట్టిన సీఎం జగన్ నేడు గుద్దులు గుద్దుతున్నారని ఆమె వ్యంగ్యంగా మాట్లాడారు. మద్యం ఎక్కువ రేట్లకు అమ్ముతూ మహిళల మెడలోని పుస్తెలు తెంచుతున్నారని, ప్రతి రోజు మహిళలపై వేధింపులు కొనసాగుతున్నాయని ఆమె విమర్శించారు.…
ఫిస్కల్ కౌన్సిల్ అవసరం లేదని ఆర్థిక మంత్రి బుగ్గన చెప్పడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బడ్జెట్ కేటాయింపులన్నీ దుబారా చేశారని, పట్టపగలే ప్రజాధనాన్ని నిలువుదోపిడీ చేశారని వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. అందుకే ఫిస్కల్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు. ఆర్ధిక నిపుణులు పేర్కొన్నట్లుగా ఫిస్కల్ కౌన్సిల్ ఏర్పాటు ఏపీలో తక్షణావశ్యకం ఉందన్నారు. రాష్ట్రంలో గతితప్పిన ఆర్ధిక పరిస్థితిని…
గత రెండు సంవత్సరాలుగా యావత్తు ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి తగ్గడం లేదు. కరోనా కట్టడికి అగ్ర దేశమైన అమెరికా సైతం కోవిడ్ టీకాలపైనే ఆధారపడింది. అయితే ఇప్పటికే కరోనా టీకాలు ఆయా దేశాలు విస్తృతంగా చేపట్టాయి. అయితే ఫ్రాన్స్ వంటి దేశాల్లో 75శాతం కరోనా టీకాలు పంపిణీ జరిగినా కరోనా కేసులు మాత్రం తగ్గడం లేదు. అయితే భారత్ లో కరోనా సెకండ్ వేవ్ తరువాత కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ.. దక్షిణాఫ్రికా…
హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ డ్రిల్మెక్ ఏర్పాటు కానుంది. ఇవాళ ఇటలీకి చెందిన డ్రిల్ మెక్- తెలంగాణ ప్రభుత్వం మధ్య MoU జరగనుంది. ఆయిల్ రిగ్గుల తయారీలో అంతర్జాతీయ స్థాయి సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న డ్రిల్మెక్.. 200 మిలియన్ US డాలర్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో గ్లోబల్ ఆయిల్ రిగ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటు చేయనుంది. మేఘా ఇంజనీరింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) అనుబంధ సంస్థ డ్రిల్మెక్. డ్రిల్మెక్ సీఈవో అలెక్స్‌కు MoU కాపీని పరిశ్రమలు, ఐటిశాఖ…