317 జీవోను సవరించేదాకా ఉద్యోగ, ఉపాధ్యాయులంతా మరో మహోద్యమానికి సిద్దం కావాలని పిలుపునిస్తూ రూపొందించిన కరపత్రాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక ఇగ ఎట్లాంటి సమస్యలుండవ్… పిల్లలకు మంచిగ పాఠాలు చెప్పవచ్చని ఆశించి తెలంగాణ సాధనలో కీలక పాత్ర వహించిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు నా హ్రుదయ పూర్వక నమస్సులు తెలిపారు. పరాయి పాలనలో ఏ స్థానికతకైతే భంగం వాటిల్లుతోందని పోరాడి తెలగాణ సాధించుకున్నమో అదే…
సిద్దిపేట పట్టణంలోని విపంచి కళానిలయంలో, సుడా మాస్టర్ ప్లాన్ సమీక్ష సమావేశంలో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట పట్టణ భవిష్యత్ ప్రణాళిక కోసం మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నామన్నారు. 2041వ సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకొని 20 సంవత్సరాల కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. గతంలో 3.15 చదరపు కిలోమీటర్లు ఉన్న సుడా పరిధి నేడు 310 చదరపు కిలోమీటర్లకు విస్తరించబోతున్నామని ఆయన వెల్లడించారు. సమగ్రమైన…
ముచ్చింతల్ లో జరుగుతున్న సమతామూర్తి శ్రీరామానుజ సాహస్రాబ్ది వేడుకల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2003 నుంచి చిన జీయర్ స్వామితో నాకు అనుబంధం ఉందని ఆయన తెలిపారు. గుజరాత్ లో భూకంపం వచ్చినప్పుడు చిన జీయర్ స్వామి అక్కడ సేవ కార్యక్రమలు నిర్వహించారని ఆయన గుర్తు చేశారు. సమాత మూర్తి విగ్రహ సమాత మూర్తి కేంద్రంను దేశం గుర్తు పెట్టుకుంటుంది.. అందరూ గుర్తు పెట్టుకుంటారని ఆయన అభిప్రాయం…
రాజ్యసభలో ప్రధాని మోడీ వ్యాఖ్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. రాష్ట్ర విభజనకు బీజేపీ వ్యతిరేకమని మరోసారి రుజువైందని ఆయన అన్నారు. సాక్షాత్తూ ప్రధానమంత్రి ఈరోజు రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అభ్యంతరం, ఆక్షేపణీయమని ఎర్రబెల్లి మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మోడీ వ్యాఖ్యలు ఉన్నాయి. దేశ సమాఖ్య స్ఫూర్తికి మోడీ వ్యాఖ్యలు పూర్తిగా వ్యతిరేకమని, ప్రజాస్వామ్యంపై బీజేపీకి ఏమాత్రం నమ్మకం లేదని తేలిపోయిందని ఆయన అన్నారు. తెలంగాణపై బీజేపీకి మోడీకి ఎందుకంత…
ఈ నెల 12వ తేదీన భువనగిరిలో జరగబోయే సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశo నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి జగదీష్ రెడ్డి. స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే, భాస్కర్ రావు, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణా రెడ్డి హజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్రెడ్డి మాట్లాడుతూ.. ఎదో రాజకీయ నాయకుడిలాగా ఓట్ల కోసం సంక్షేమ పథకాలు తెచ్చే అలవాటు కేసీఆర్ కు…
ప్రధాని మోడీ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో తాజాగా పెద్దపల్లి టీఆర్ఎస్ ఎంపీ నేతకాని వెంకటేశ్ మాట్లాడుతూ.. ప్రధాని రాజ్యసభ లో తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి అవాస్తవాలను, ఈర్ష్య, ద్వేషాలను కక్కారని ఆయన అన్నారు. ప్రధాని ఇలా మాట్లాడటం సిగ్గు చేటు ఆయన విమర్శించారు. మోడీ వ్యాఖ్యలను టీఆర్ఎస్ ఎంపీలం ఖండిస్తున్నామని ఆయన వెల్లడించారు. బీజేపీ నాయకులు అబద్దాలు చెప్పటం, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయటం అలవాటైందన్నారు. గ్లోబెల్స్ ప్రచారంలో మోడీకి…
ప్రధాని మాట్లాడిన మాటలు కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలకు అర్థం అయినట్టు లేదు.. నరేంద్ర మోడీ తెలంగాణకి వ్యతిరేకమని అంటున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ తమ మనుగడ కోసం ఎప్పుడు పడవ మునిగి పోతుందోనని భయంతో బీజేపీ పై విమర్శలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. రేవంత్ రెడ్డిని మేము కూడా అనవచ్చు… పొట్టోడు, చిటికెన వేలు అంత లేడని.. గతంలో మాట్లాడిన మీ నేతలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అని…
ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి చేసేందుకు ప్రధానమంత్రి మోడీ సంకల్పం కనిపిస్తుంది బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో ఆగిపోయిన 6 రైల్వే ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయమని కేంద్ర రైల్వే మంత్రిని కోరానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ విషయంలో ముందుకు రావాలని, కొంత నిధులు కూడా కేటాయించాలని కోరుతున్నానన్నారు. రాష్టంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని కోరానని, విశాఖపట్నం నుంచి వారాణసికి (స్పెషల్ ట్రైన్)…
ప్రధాని మోడీ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధిలో గుజరాత్ను దాటిపోతున్నామని భయమా అని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు వేరుపడ్డము.. బాగు పడ్డము.. 1999 లో కాకినాడ తీర్మానం చేసి, ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పి మోసం చేశారని ఆయన అన్నారు. నాడు బీజేపీ అధికారంలోకి వచ్చి తెలంగాణ ఇవ్వకుండా దగా చేశారని, సుఖ ప్రసవం…
నిరుద్యోగ రేటు ఎక్కువగా ఉన్న సమయంలో ఖాళీలు భర్త చేయకపోవడం అన్యాయమని, కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఎనిమిది లక్షల పోస్టులను భర్తీ చేయాలని రాజ్యసభ ఎంపీలు మంగళవారం డిమాండ్ చేశారు. జీరో అవర్ ప్రస్తావన ద్వారా సమస్యను లేవనెత్తిన ఎంపీ విజయసాయి రెడ్డి, నిరుద్యోగం పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వ రంగం ఖాళీలతో నిండిపోతోందని అన్నారు. అధికారిక సమాచారం ప్రకారం, సాయుధ దళాలలో లక్ష, రైల్వేలో రెండు లక్షలతో సహా కేంద్ర ప్రభుత్వంలో దాదాపు ఎనిమిది లక్షల…