ముచ్చింతల్ లో జరుగుతున్న సమతామూర్తి శ్రీరామానుజ సాహస్రాబ్ది వేడుకల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2003 నుంచి చిన జీయర్ స్వామితో నాకు అనుబంధం ఉందని ఆయన తెలిపారు. గుజరాత్ లో భూకంపం వచ్చినప్పుడు చిన జీయర్ స్వామి అక్కడ సేవ కార్యక్రమలు నిర్వహించారని ఆయన గుర్తు చేశారు. సమాత మూర్తి విగ్రహ సమాత మూర్తి కేంద్రంను దేశం గుర్తు పెట్టుకుంటుంది.. అందరూ గుర్తు పెట్టుకుంటారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. సనాతన ధర్మ యాత్ర ఆగదు.. దిగ్విజయంగా ముందుకు సాగుతోందని ఆయన అన్నారు.
రామానుజ అందరూ సమానం అనేవారని, రామానుజ విగ్రహం దూరం నుంచి చుస్తే అద్భుతముగా ఉందని ఆయన వెల్లడించారు. రామానుజ విగ్రహం దగ్గరకు వెళ్లిన తర్వాత శాంతి లభిస్తుందని ఆయన తెలిపారు. సనాతన ధర్మం కు ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరో ఒకరు ముందుకు వచ్చి సనాతన ధర్మంను ముందుకు తీసుకెళ్లారని ఆయన అన్నారు. రామానుజ చార్యులు కూడా అటువంటి వారు …ఆయన జీవిత సందేశమును ముందుకు తీసుకెళ్లాలన్నారు. సమాత మూర్తి విగ్రహం ఏర్పాటు చేసిన చిన జీయర్ స్వామికి దేశం తరపున ధన్యవాదాలు చెబుతున్నాను అని ఆయన పేర్కొన్నారు.