ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో దాదాపు 4 నెలలపాటు శాంతించిన పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. అయితే నిన్న హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెరిగింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.110.89కి చేరుకుంది. డీజిల్ ధర రూ.97.22కి పెరిగింది. అయితే నేడు మరోసారి ప్రెటోల్, డిజీల్ ధరలు పెరిగి వాహనదారులకు షాక్ ఇచ్చింది. తాజాగా లీటరు పెట్రోల్,…
కేంద్రం తీరుపై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో మెడికల్ కాలేజీల ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం పదే పదే పచ్చి అబద్ధాలు వల్లె వేస్తున్నదని ఆయన మండిపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా గోబెల్స్ ప్రచారానికి దిగిందని, మొన్న గిరిజన రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదనలు తెలంగాణ నుంచి రాలేదని చెప్పిన కేంద్రం.. ఈరోజు మెడికల్ కాలేజీల ఏర్పాటుపైనా లోక్ సభ వేదికగా దుష్ప్రచారం చేస్తున్నదని ఆయన ఆరోపించారు. తెలంగాణ నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదనలు అందలేదని కేంద్ర…
రోజురోజుకు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులనే టార్గెట్ చేసి అందినకాడికి దండుకుంటున్నారు. ఇలాంటి సంఘటనే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అమీర్‌పేట మోతీనగర్‌కు చెందిన రైటర్డ్ ఉద్యోగి రామరాజుకు పలుమార్లు ముగ్గురు నిందితులు ఇన్సూరెన్స్ పేరుతో ఫోన్ చేసి, ఇన్సూరెన్స్ తీసుకోవాలని ఒత్తిడి చేశారు. అంతేకాకుండా నమ్మలేనంత డబ్బువస్తుందంటూ నమ్మబలికి రామరాజు దగ్గర నుంచి పలు దఫాల వారీగా రూ.3.5 కోట్లు వసూలు చేశారు. అయితే ఇన్సూరెన్స్ పత్రాలను అమెరికా నుండి రామరాజు కొడుకు చెక్ చేశాడు.…
Telangana Animal Husbandary, Fisheries and Cinematography Minister Talasani Srinivas Yadav Fired on Telangana BJP Leaders. కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌పై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు. నిన్న తెలంగాణ మంత్రులు యాసంగి ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను కలిసిన విషయం తెలిసిందే. అయితే పరిస్థితులకు అనుగుణంగానే ధాన్యం కొనుగోళ్లు జరుపుతామని పీయూష్ వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించి తెలంగాణ మంత్రి శ్రీనివాస్ యాదవ్.. ఎఫ్‌సీఐ రాజ్యాంగం…
Famous Poet Srirangam Srinivas Rao (SRI SRI) Daughter Mala has been Appointed as a Judge of the Madras High Court. తెలుగు సాహిత్య ప్రపంచాన్ని శాసించిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) కుమార్తెకు కీలక పదవి దక్కింది. శ్రీశ్రీ కుమార్తె నిడుమోలు మాలా మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 32 ఏళ్లుగా మద్రాస్ హైకోర్టులో మాలా ప్రాక్టీసు చేస్తున్నారు. మాలా 1989లో మద్రా్‌స-పుదుచ్చేరి బార్ అసోసియేషన్‌లో నమోదయ్యారు. అయితే…
Union Minister Kishan Reddy Made Comments on CM KCR. కేంద్ర పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. అధికార టీఆర్ఎస్ పార్టీని చూస్తుంటే జాలేస్తుందని, కేసీఆర్ కుటుంబం తెలంగాణ రైతులను బలి చేస్తోందని ఆయన ఆరోపించారు. పుత్ర వాత్సల్యంతో బీజేపీపై కుట్ర చేస్తూ రైతులను ముంచుతున్నారని ఆయన విమర్శించారు. ధాన్యం కొనుగోళ్ళపై రాజకీయం చేస్తున్నారని, చేసుకున్న ఒప్పందం…
TRS Party Leader Nama Nageswara Rao Fired On Central Government. టీఆర్ఎస్ లోక్‌సభ పక్షనేత నామానాగేశ్వర రావు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని 8 సంవత్సరాలుగా ప్రస్తావిస్తున్నామన్నారు. మా డిమాండ్లను కేంద్రం పెడచెవిన పెడుతోందని, “నవోదయ విద్యాలయాల ఏర్పాటు గురించి వాయిదా తీర్మానం ఇచ్చామన్నారు. మా నోటీసులను అనుమతించక పోవటంతో ఉభయ సభల నుంచి వాకౌట్ చేశామని ఆయన వెల్లడించారు. కేంద్రం తన…
తెలంగాణలో మరోసారి ధాన్యం కొనుగోలు వ్యవహారం తెరపైకి వచ్చింది. యాసంగిలో పండించిన ధాన్యం చివరి గింజ వరకు కేంద్రం కోనుగోలు చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే గులాబి దళం మంత్రులు హస్తినకు చేరుకొని కేంద్ర మంత్రులతో భేటీ అయ్యేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రధాని మోడీకి లేఖ రాయడం హాట్ టాపిక్‌గా మారింది. యాసంగిలో పండిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ ప్రధానికి రాసిన లేఖలో…
Another Program at TSRTC. టీఎస్ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు తీసుకున్ననాటి నుంచి ఆర్టీసీని తనదైన శైలిలో ముందుకు తీసుకువెళ్తున్నారు. కొత్తకొత్త ప్రయోగాలతో మునుపెన్నడూ లేని విధంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రజలతో టీఎస్ఆర్టీసీ మమేకం చేసేందుకు అహర్నిషలు కష్టపడుతున్నారు. సోషల్ మీడియాలో ఎప్పడూ యాక్టీవ్‌గా ఉంటూ.. ఆర్టీసీకి సంబంధించిన ఎవైనా సమస్యలు, సలహాలు ఇచ్చినా వెంటనే స్పందిస్తున్నారు. మొన్నటికి మొన్న.. తెలంగాణాకే తలమానికమైన సమక్క-సారక్క జాతర సందర్భంగా అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తుల ఇంటివరకు చేర్చే బాధ్యతను…
MLA Padma Devender Reddy Car Accident. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మెదక్ పట్టణంలో నేడు పర్యటించారు. ఈ పర్యటన అనంతరం రామయంపేటలో ఓ వివాహానికి హాజరయ్యేందుక వెళ్తున్న క్రమంలో అక్కన్నపేట రైల్వే గేట్ వద్ద వెనుక నుంచి వస్తున్న వాహనం వేగంగా ఢీకొట్టింది. దీంతో భారీ శబ్దంతో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఉన్న వాహనం ఎరిగిపడింది. అయితే వాహనం వెనుకనుంచి వచ్చి…