BJP Women Leader Vijayashanthi Fired on TRS Govetnment.
తెలంగాణ ప్రభుత్వం కరెంట్ చార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నాయకురాలు విజయశాంతి సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. ఆమె మాట్లాడుతూ.. నిన్నగాక మొన్న ఆర్టీసీ చార్జీల పెంచిన సర్కారు, నేడు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై పెనుభారం మోపుతోందన్నారు. పేదలను నిత్యం ఇబ్బందులకు గురిచేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపడం ఖాయమని అన్నారు. కేసీఆర్ సర్కారుకు పోయేకాలం దగ్గరపడిందని, అందుకే ప్రజలపై కరెంటు చార్జీల పెంపుతో మోయలేని భారాన్ని వేసిందని ఆమె మండిపడ్డారు.
మరోవైపు పాతబస్తీలో కరెంటు బిల్లులు వసూలు చేసే దమ్ము చూపించడంలేదని, ఈ లోటును పూడ్చేందుకు ప్రజలపై భారం మోపడం ఎంతవరకు న్యాయమని విజయశాంతి ప్రశ్నించారు. డిస్కమ్ లకు వినియోగదారులు చెల్లించాల్సిన బకాయిలు రూ.17 వేల కోట్లు కాగా… అందులో ప్రభుత్వ శాఖలకు చెందిన బకాయిలు రూ.12,598 కోట్లు అని, ఇతర వినియోగదారులు చెల్లించాల్సిన బకాయిలు రూ.4,603 కోట్లు అని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం డిస్కమ్ లకు కట్టాల్సిన రూ.48 వేల కోట్ల బకాయిలు ఇంతవరకు చెల్లించలేదని విజయశాంతి వ్యాఖ్యానించారు.