TS TET 2022 : వాళ్లకు కూడా టెట్ రాసే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ టీచర్ ఎంట్రెన్స్ టెస్ట్ 2022 అభ్యర్థులు మార్చి 26 నుంచి ఏప్రిల్ 12 వరకు అప్లై చేయొచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి. జూన్ 12న టెట్ జరగనుంది. టెట్ పూర్తైన తర్వాత టీచర్ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ జరగనుంది. ఈసారి టెట్ అర్హతలు, నిర్వహణకు సంబంధించి కొన్ని మార్పులు ఉన్నాయి. గతంలో బీఈడీ అభ్యర్థులు టెట్ పేపర్ 2 మాత్రమే రాసే అవకాశం ఉండేది. డిప్లొమా అభ్యర్థులు టెట్ పేపర్ 1 రాసేవారు. కానీ ఈసారి బీఈడీ అభ్యర్థులు కూడా టెట్ పేపర్ 1 రాయొచ్చు. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి ఆదేశాల మేరకు ఈ మార్పులు చేసింది ప్రభుత్వం.
టెట్‌కు బీఈడీ, డీఈడీ చివరి సంవత్సరం విద్యార్థులకు కూడా అవకాశం కల్పించినట్టు టెట్ కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు. టెట్ సమాచార బులెటిన్, సిలబస్ విడుదల చేశారు. జూన్ 12న టెట్ నిర్వహించి, 27న ఫలితాలు విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు. 2017 సిలబస్ ప్రకారమే టెట్ నిర్వహించనున్నట్టు స్పష్టంచేశారు. పేపర్-1, పేపర్-2 కు దరఖాస్తు రుసుము రూ.300గా నిర్ణయించినట్టు పేరొన్నారు. రెండు పేపర్లు రాసేవారికి కూడా ఇదే ఫీజు వర్తిస్తుంది. శనివారం నుంచి ఏప్రిల్ 12 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. రెండు పేపర్లు రాయాలనుకునే అభ్యర్థులు ఒకే దరఖాస్తు చేసుకోవాలి. లేకపోతే రెండు వేర్వేరు పరీక్ష కేంద్రాలు కేటాయించే అవకాశం ఉన్నది. హాల్‌టికెట్లను జూన్ 6 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థుల సందేహాలు, సూచనలకు మార్చి 26 నుంచి జూన్ 12 వరకు హెల్ప్‌డెస్ సేవలు అందుబాటులో ఉంటాయి. వివరాలకు 040-23120340, 23120433, 8121010310, 8121010410 నంబర్లలో, tstet.cgg.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించాలి.
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!