తెలంగాణ ప్రభుత్వం తీరుపై గవర్నర్ తమిళిసై ఆరోపణలు చేశారు. తనను ఉద్దేశపూర్వకంగానే అవమానిస్తున్నారని.. తన విషయంలో ఏం జరుగుతోందో మీడియాకు, ప్రజలకు తెలుసునని ఆమె వ్యాఖ్యానించారు. గవర్నర్‌ను గౌరవించకున్నా.. కనీసం రాజ్‌భవన్‌ను గౌరవించాల్సి బాధత్య ఉందని ఆమె అన్నారు. అంతేకాకుండా సోదరిగా భావిస్తే ఇలా అవమానిస్తారా అని ఆమె ప్రశ్నించారు. గతంలో బీజేపీకి చెందినా ఇప్పుడు గవర్నర్ స్థాయిలో ఉన్నానని ఆమె అన్నారు.
ఆమె వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. గవర్నర్ తో మాకు పంచాయితీ ఏమి లేదని ఆయన స్పష్టం చేశారు. తనకు తానే ఊహించుకుని ఎదో మాట్లాడితే మేమేమి చేయాలని ఆయన అన్నారు. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ విషయంలో ఇబ్బంది పెట్టినందుకు తనను మేము ఇబ్బంది పెడుతున్నారని గవర్నర్ అన్నారట.. నరసింహన్ ఉన్నప్పుడు మాకు ఎప్పుడు ఇబ్బంది కాలేదు.. గవర్నర్ ప్రసంగం లేకుండా లేకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయన్నారు. గవర్నర్ కాకముందు తమిళ సై ఏ పార్టీ నాయకురాలో అందరికి తెలుసునని ఆయన వెల్లడించారు.
MLC Kavitha : ప్రతి గింజ కొనేదాక.. ఢిల్లీ గల్లీల్లో ఉద్యమించుడే..