నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి సెటైర్లు వేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. పసుపు బోర్డు తెస్తానంటూ అబద్ధపు హామీలను ఇచ్చి ధర్మపురి అరవింద్ ఎంపీగా గెలిచారని కవిత అన్నారు. ఆయన ధర్మపురి కాదని, అధర్మపురి అని విమర్శినస్త్రాలు సంధించారు. పసుపుబోర్డు తెస్తానని బాండ్ పేపర్లపై హామీ ఇచ్చిన అర్వింద్.. 3 ఏళ్లైనా పసుపుబోర్డు తీసుకురాలేదని మండిపడ్డారు. మోసం చేసిన ఎంపీ ఆర్వింద్ను ఎక్కడికక్కడ రైతులు అడ్డుకుంటారని కవిత వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి ఆయన తెచ్చిన…
సరూర్నగర్లో నిన్న రాత్రి 9 గంటల సమయంలో పరువు హత్య చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన నాగరాజు, అశ్రీన్లు ప్రేమించుకున్నారు. అయితే వారి వివాహానికి ఇంట్లో వాళ్లు అభ్యంతరం చెప్పడంతో.. ఈ ఏడాది జనవరి నెలలో మతాంతర వివాహం చేసుకున్నారు. అయితే.. వారిపై పెళ్లిపై కోపం పెంచుకున్న యువతి తరుపు బంధువులు.. నిన్న నాగరాజు, అశ్రీన్లు బైక్ వెళ్తున్న సమయంలో అడ్డగించి దాడి చేసి హతమార్చారు. ఈ నేపథ్యంలో బాధితురాలు అశ్రీన్ మాట్లాడుతూ.. ఇద్దరం కలిసి…
వేసవి కాలం ప్రారంభం నుంచి భానుడి ప్రతాపానికి ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఉదయం నుంచే సూర్యుడు విరుచుకుపడుతుండడంతో మునుపెన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే తెలంగాణపై ఉపరితల ద్రోణి ఏర్పడడంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నిన్న వేకువ జామున తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసాయి. దీంతో ఎండ తీవ్రత నుంచి ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది. కానీ.. రైతులకు ఆపార నష్టం వాటిల్లింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట.. కళ్లముందే నీటి పాలైంది. తెలంగాణలో…
ఏపీలో సంచలనం సృష్టించిన మూడు రాజధానుల విషయం మరోసారి తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో అమరావతి రైతులు, ఇతరులు ఒకే రాజధాని కావాలని అది కూడా అమరావతే కావాలంటూ.. హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. ఆ తరువాత అమరావతి ఒక్కటే రాజధాని అంటూ హైకోర్టు…
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేపట్టిన రెండో దశ ప్రజాసంగ్రామ యాత్ర నేడు 22వ రోజుకు చేరుకుంది. అయితే.. ఈ రోజు మహబూబ్నగర్ జిల్లాలోని బండమీదిపల్లి, వన్ టౌన్ మీదుగా జిల్లా కేంద్రంలో ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగనుంది. బండి సంజయ్.. 200 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో నేడు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ జాతీయ…
ఏపీలో మహిళలపై చోటు చేసుకుంటున్న ఉదంతాలను నిరసిస్తూ నేడు బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టనుంది. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, మహిళల రక్షణలో ప్రభుత్వం వైఫల్యాన్ని నిరసిస్తూ.. ఆందోళనకు పిలుపునిచ్చారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలో బీజేపీ శ్రేణులు నిరసనలు తెలుపనున్నారు. అయితే.. ఏపీలో వరుసగా అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న రేపల్లె రైల్వేస్టేషన్లో మహిళపై గ్యాంగ్ రేప్ జరుగగా, ఆ తరువాత…
అబ్దుల్లాపూర్ మెట్ జంట హత్యల కేసు మిస్టరీ వీడింది. పక్కా రెక్కీ, పక్క స్కెచ్ ప్రకారమే యశ్వంత్, జ్యోతిల హత్యలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. కొత్తగూడ శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి ఇద్దరూ పలుసార్లు వచ్చినట్టు గుర్తించారని.. అయితే ఇద్దరినీ గతంలో జ్యోతి భర్త శ్రీనివాస్ రావు ఫాలో అయ్యాడు. ఆదివారం సాయంత్రం వారాసిగూడ నుండి యశ్వంత్ ను ఫాలో అయిన శ్రీనివాస్ రావు.. అప్పటికే సుపారీ గ్యాంగ్ తో సిద్ధంగా ఉన్నాడు. భార్య ప్రవర్తనతో ఇద్దరిపై…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. పాలమూరు ఎడారిగా మారిందని ఆయన అన్నారు. కేసీఆర్ ఇక్కడ ఎంపీగా ఉన్న పాలమూరుకు చేసింది శూన్యమన్నారు. జిల్లాను సస్యశ్యామలం చేస్తానన్న కేసీఆర్ మాటలు మాటలుగానే ఉండిపోయాయన్నారు. పాలమూరు ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు, వారి కష్టాలను తెలుసుకునేందుకే పాదయాత్ర చేస్తున్నామన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పు బీజేపీతోనే సాధ్యమన్నారు. రేపు జేపీ నడ్డా వస్తున్నారని,…
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ ఈ నెల 6,7 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సీటీని సందర్శించేందుకు ఓయూ వీసీని అనుమతులు కోరగా.. ఆయన నిరాకరించారు. దీంతో ఎన్ఎస్యూఐ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన హై కోర్టు నిర్ణయాన్ని.. ఓయూ వీసీకే వదిలేసింది. అయితే.. ఈ నెల 5వ తేదీలోగా నిర్ణయం తీసుకుని, వారికి తెలియజేయాలని ఓయూ అధికారులను ఆదేశించింది హై కోర్టు. అయితే తాజాగా మరోసారి రాహుల్ గాంధీ…
హైదరాబాద్ వ్యాప్తంగా.. బుధవారం వేకువజామున భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని పలు చోట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రామంతపూర్ లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురియడంతో.. వరదనీటి కారణంగా రామ్ శంకర్ నగర్ లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇప్పుడు కురిసిన చిన్నపాటి వర్షానికే పరిస్థితి ఈ విధంగా ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఏమిటని కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుటికైన నాయకులు, అధికారులు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఈ పరిస్థితి గమనించి…