ఈ రోజు తెల్లవారుజామున ఒక్క సారిగా కురిసిన భారీ వర్షం, గాలుల నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని సీజీమ్, సూపరింటిండెంట్ ఇంజినీర్లతో సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రఘుమా రెడ్డి ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యుత్ సరఫరా పరిస్థితిని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలపై కూలిన చెట్ల మూలాన విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగిందని ఆయన అధికారులు వివరించారు. ఈ సందర్భంగా రఘుమా…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరుణుడు బీభత్సం సృష్టించాడు. బుధవారం వేకువజామున్న ఒక్కసారిగా ఈదురు గాలులతో కుండపోత వర్షం కురియడంతో చెట్లు నేలకొరిగాయి. అంతేకాకుండా కొనుగోలు కేంద్రాల వద్ద వరి ధాన్యం నీటి మునిగి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామి క్షేత్రంలో కూడా భారీ వర్షం కారణంగా ఆలయ క్యూలైనల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. అంతేకాకుండా గుట్టపైకి వెళ్లేందుకు నిర్మించిన నూతన ఘాట్ రోడ్ భారీ వర్షానికి కోతకు గురైంది.…
ఆరుగాలం కష్టపడి పండించిన పంట.. ఒక్క రాత్రిలో నీటిపాలైంది. వరుణుడి ధాటికి రైతన్న లబోదిబోమంటున్నాడు. బుధవారం వేకువజామున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసింది. భారీగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురియడంతో వరిధాన్యం కుప్పలు తడిసి ముద్దాయ్యాయి. కొనుగోలు కేంద్రాల్లో సరిపడ టార్ల్పిన్ కవర్లు లేకపోవడంతో వర్షపు నీటిలో వరి ధాన్యం కొట్టుకోయింది. దీంతో రైతన్నలు కన్నీరు కార్చుతున్నారు. మొన్నటి వరకు ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత రాక ఇబ్బందులు ఎదుర్కొన్న రైతన్నలు.. ఇప్పుడు వర్షా ధాటికి ఎంతో…
హైదరాబాద్లో బుధవారం వేకువజామునే భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. అంతేకాకుండా లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో రంగంలోకి దిగని జీహెచ్ఎంసీ సిబ్బంది.. సహాయక చర్యలు చేపట్టారు. దీంతో పాటు పలు చోట్ల ఈదురు గాలులతో వర్షం కురియడంతో చెట్లు విరిగిపడ్డాయి. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. అంతేకాకుండా పలు చోట్ల ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. ఓల్డ్ సిటీలో భారీ వర్షం కారణంగా కాలనీల్లో వరద నీరు…
రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తగూడెం బ్రిడ్జికి సమీపంలో జంట మృతదేహాలు కలకలం సృష్టించాయి. అయితే.. రెండు మృతదేహాలు వారసిగూడ చెందిన యువకుడు యశ్వంత్ మహిళ జ్యోతి గా పోలీసులు గుర్తించారు. క్యాబ్ డ్రైవర్గా యశ్వంత్ పనిచేస్తున్నాడు. అయితే ఆదివారం సాయంత్రం ఫోన్ కాల్ రావడంతో యశ్వంత్ ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. మృతిచెందిన జ్యోతికి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ హత్య కేసులో 3 ప్రత్యేక బృందాలను పోలీసులు…
రోజురోజుకు ఇంధన ధరలు పెరగిపోతుండడంతో వాహనాదారులపై పెనుభారం పడుతోంది. అయితే పలు నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. నేడు హైదరాబాద్లో పెట్రోల్ లీటర్ ధర రూ.119.49 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.105.49 వద్ద స్థిరంగా ఉన్నాయి. అయితే.. ఇక వరంగల్లో పెట్రోల్ ధర 18 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.119 కాగా, 17 పైసలు తగ్గడంతో డీజిల్ లీటర్ ధర రూ.105.02 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో 15 పైసలు తగ్గడంతో…
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. తెల్లవారు జామునే కురిసిన వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన ఎడతెరిపి లేని వాన కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. అయితే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అర్థరాత్రి ఏకదాటిగా భారీ వర్షం కురిసింది. జగిత్యాల, కోరుట్ల, హుజురాబాద్, జమ్మికుంటలో…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో దేవరకద్రలో బీజేపీ ప్రజాసంగ్రామ యాత్ర సభ నిర్వహించింది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలమూరు నుంచి వలసలు లేవని అంటున్నారని, కానీ ఇప్పటికీ పాలమూరు ప్రజలు ఉపాధి కోసం వలస వెళ్లిపోతున్నారని ఆయన అన్నారు. పాలమూరు నుంచి వలసలు లేవని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, దమ్ముంటే తన…
వేసవికాలంల భానుడి ధాటికి చెమటలు కక్కుతున్న ప్రజలకు ఉపశమనం కలిగింది. బుధవారం తెల్లవారుజామున భారీ వర్షం కురియడంతో పలు చోట్లు జలమయంగా మారాయి. అంతేకాకుండా ఈదురు గాలులతో కూడిన వర్షం కురియడంతో.. పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. అయితే రంగంలోకి దిగిన జీఎచ్ఎంసీ సిబ్బంది.. చెట్లను తొలగించారు. దీంతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో.. వర్షపు నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ఉక్కపోతతో విసిగిపోయిన హైదరాబాద్ వాసులకు భారీ వర్షంతో కొంత ఊరట లభించింది. అయితే పలు…
గతేడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం మద్యం అమ్మకాలు పెరిగినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. అయితే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బీర్ కేసులు 23 లక్షలు అధికంగా అమ్ముడైనట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. భానుడి ప్రభావానికి మందుబాబులు బీర్లను ఎక్కువగానే తాగేశారు. అయితే.. గత ఏప్రిల్ లో కన్నా ఈ ఏప్రిల్ లో 420 కోట్ల ఎక్కువ మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ పేర్కొంది. ఏప్రిల్ నెలలో డిపోల నుండి మద్యం అమ్మకాలు 2…