కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. మొన్నటి వరకు ఒమిక్రాన్ వేరియంట్‌తో థర్డ్‌వేవ్ సృష్టించిన కరోనా రక్కసి.. మరోసారి ప్రజలపై విరుచుకుపడేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికూ చైనాలో రోజువారి కరోనా కేసులు భారీ నమోదవుతున్నాయి. అయితే.. ఇటీవల థర్డ్ వేవ్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో సమర్థవంతంగా ఎదుర్కున్నాయి. అయితే ఒకవేళ ఫోర్త్‌వేవ్ వచ్చినా.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయితే తాజాగా గత 24 గంటల్లో 4.23 లక్షల మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 3,275 మందికి కరోనా నిర్ధారణ అయింది.
వీటిలో ఢిల్లీలో అత్యధికంగా 1,354 కేసులు నమోదయ్యాయి. నిన్న 3,010 మంది కరోనా నుంచి కోలుకోగా… 55 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 19,719 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 4.30 కోట్లకు పైగా కరోనా కేసులు నమోదు కాగా… 5.23 లక్షల కంటే ఎక్కువ మంది కరోనాతో మరణించారు. మరోవైపు పంజాబ్ లోని రాజీవ్ గాంధీ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లా లో కరోనా కల్లోలం సృష్టించింది. యూనివర్సీటీలోని 60 మంది విద్యార్థులకు కరోనా సోకింది. దీంతో యూనివర్సీటీ మొత్తాన్ని అధికారులు కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించారు. మరోవైపు మద్రాస్ ఐఐటీలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 170కి చేరుకుంది.