ఇంటర్ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు మాస్కుధారణ తప్పనిసరి అని ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా శుక్రవారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్ష కేంద్రాల్లో క్లీన్ అండ్ గ్రీన్‌తోపాటు శానిటైజేషన్ కార్యక్రమాలు పరీక్షలు పూర్తయ్యే వరకు కొనసాగే విధంగా చర్యలు చేపట్టింది విద్యాశాఖ. విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా సిట్టింగ్ ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ.. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలున్న వారికి ప్రత్యేకంగా ఐసోలేషన్ గదులు ఏర్పాటు…
రాహుల్ గాంధీ పర్యటన పై ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. గౌరవ రాహుల్ గాంధీ గారు, మీరు కానీ మీ పార్టీ కానీ ఎన్ని సార్లు పార్లమెంట్ లో తెలంగాణ అంశాలను, హక్కులను ప్రస్తావించారో చెప్పండి.? తెలంగాణ రాష్ట్ర హక్కులకోసం టిఆర్ఎస్ పార్టీ పోరాడుతుంటే మీరు ఎక్కడ ఉన్నారు ? దేశవ్యాప్తంగా ఒకే వరి కొనుగోలు విధానంపై టిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? తెలంగాణ ప్రాజెక్టులకు రావాల్సిన జాతీయ హోదా,…
ఏపీలో మరో దారుణం చోటు చేసుకుంది. ఎన్ని కఠిన శిక్షలు వేసినా.. చట్టాలు చేసినా.. కామాంధులు మాత్రం మారడం లేదు.. అన్య పుణ్యం తెలియని చిన్నారులపై మృగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ దుండగుడు.. అనకాపల్లి జిల్లాలో రాత్రి 2 గంటల సమయంలో అక్కాచెల్లెలు బహిర్భూమికి వెళ్లారు. దీంతో.. బయటకు వచ్చిన సమయంలో బాలికను లాక్కెళ్లి ఓ దుండగుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఎవరో చెల్లిని ఎత్తుకుపోయారని తల్లిదండ్రులకు బాలిక వచ్చి చెప్పింది. దీంతో హుటాహుటినా…
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన మినెట్ టూ మినెట్ షెడ్యూల్ విడుదలైంది. సాయంత్రం 4:50కి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రాహుల్ గాంధీ చేరుకుంటారు. 5:10కి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ ద్వారా వరంగల్ బయలుదేరుతారు.. 5:45కు వరంగల్ గాబ్రియెల్ స్కూల్ కు చేరుకుంటారు.. 6:05 వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో…
ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీ నేడు, రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్‌లో కాంగ్రెస్ నిర్వహించ తలపెట్టిన రైతు సంఘర్షణ సభకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాహుల్ గాంధీ వెంట కేంద్ర రక్షణ దళం ఎన్ఎస్జి కమాండ్ తో పాటు వ్యక్తిగత జడ్ ప్లస్ సెక్యూరిటీ సిబ్బంది ఉండనుంది. బాంబు స్క్వాడ్, డాగ్ స్పైడర్ తో నిరంతర పర్యవేక్షణ.. ఎన్ఎస్జీ కమాండోలు వేదికకు వెనుక ముందు చుట్టుపక్కల రక్షణ వలయంల ఏర్పాటు చేస్తారు. వరంగల్…
పెద్ద చదువులు మనిషి చరిత్రను, కుటుంబ చరిత్రను, సామాజిక వర్గ చరిత్రను, రాష్ట్ర చరిత్రను, దేశ చరిత్రను మారుస్తుందని సీఎం జగన్ అన్నారు. నేడు సీఎం జగన్ 10.85 లక్షల మంది పిల్లలకు విద్యాదీవెన ద్వారా వారి తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. చదువులు అన్నవి పిల్లలకు మనం ఇచ్చే ఆస్తులు అన్నారు. చదువును ఎవ్వరూ కూడా దొంగతనం చేయలేని ఆస్తి అని, మన తలరాతను మార్చే శక్తి…
రేపల్లె ఘటన బాధితురాలిని ఒంగోలు రిమ్స్ లో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పరామర్శించారు. బాధితురాలికి టీడీపీ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు కనుమరుగయ్యాయన్నారు. అవగాహన లేని వ్యక్తి సీఎం కావడంతో ఇలాంటి పరిస్థితి ఉందని, రాష్ట్రంలో మహిళలు పట్టపగలు కూడా తిరగలేని పరిస్థితి దాపురించిందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేని కారణంగానే రేపల్లె లాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయన్నారు. బాధితురాలు…
యాదాద్రి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. గత ఏడాది హైదరాబాద్‌లో పడినట్లు వర్షం పడలేదు అలా పడి ఉంటే యాదగిరిగుట్ట గుడి కూడా కులి పోయేదంటూ అగ్రహం వ్యక్తం చేశారు. రెండు గంటల వర్షానికే క్యూ లైనులు, రోడ్లు, గుడికి ఎదురుగా చెరువు తయారు అయింది అంటే ఎనమిది ఏండ్లగా నువ్వు ఇరవై సార్లు వచ్చి ఏమి చేశావు ముఖ్యమంత్రి కేసీఆర్ అని వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. ఎవరా కాంట్రాక్టర్, సినిమా ఆర్ట్…
కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. మొన్నటి వరకు ఒమిక్రాన్ వేరియంట్‌తో థర్డ్‌వేవ్ సృష్టించిన కరోనా రక్కసి.. మరోసారి ప్రజలపై విరుచుకుపడేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికూ చైనాలో రోజువారి కరోనా కేసులు భారీ నమోదవుతున్నాయి. అయితే.. ఇటీవల థర్డ్ వేవ్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో సమర్థవంతంగా ఎదుర్కున్నాయి. అయితే ఒకవేళ ఫోర్త్‌వేవ్ వచ్చినా.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయితే తాజాగా గత 24 గంటల్లో 4.23 లక్షల మందికి కోవిడ్ పరీక్షలు…
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్వంతగా పార్టీ పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఆయన ఓ కీలక ప్రకటన చేశారు. ఢిల్లీలో నేడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాలూ, నితీష్ పరిపాలనలో బీహార్ అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా మిగిలిపోయింది. రాబోయే పది, పదిహేను ఏళ్లలో బీహార్ “ప్రగతిశీల రాష్ట్రంగా” ఎదగాలంటే ఇప్పుడున్న దారిలో వెళితే సాధ్యం కాదు. కొత్త ఆలోచన, కొత్త ప్రయత్నం ద్వారానే ఇది సాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు.…