సరూర్‌నగర్‌లో నిన్న రాత్రి 9 గంటల సమయంలో పరువు హత్య చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన నాగరాజు, అశ్రీన్‌లు ప్రేమించుకున్నారు. అయితే వారి వివాహానికి ఇంట్లో వాళ్లు అభ్యంతరం చెప్పడంతో.. ఈ ఏడాది జనవరి నెలలో మతాంతర వివాహం చేసుకున్నారు. అయితే.. వారిపై పెళ్లిపై కోపం పెంచుకున్న యువతి తరుపు బంధువులు.. నిన్న నాగరాజు, అశ్రీన్‌లు బైక్ వెళ్తున్న సమయంలో అడ్డగించి దాడి చేసి హతమార్చారు. ఈ నేపథ్యంలో బాధితురాలు అశ్రీన్ మాట్లాడుతూ.. ఇద్దరం కలిసి బంధువుల ఇంటికి వెళ్తున్నామని, వెనక నుండి ఐదుగురు వ్యక్తులు వచ్చి బండి మీద నుండి కింద పడవేశారని వెల్లడించింది. నా భర్త నాగరాజు తలపై విచక్షణారహితంగా కొట్టారని, హెల్మెట్ ఉన్నప్పటికీ హెల్మెట్ మీది నుంచి కొట్టడంతో అతని తలకు తీవ్రంగా గాయాలయ్యాయని, నాగరాజు అంటూ అతని మీద పడ్డానని, నన్ను నెట్టేసి మిగిలిన నలుగురు నా భర్త నాగరాజును తీవ్రంగా కొట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
గుమిగూడిన వారందర్నీ కాళ్లు పట్టుకున్నాను కాపాడమని.. కానీ ఎవరూ ముందుకు రాలేదు అంటూ ఆమో వాపోయింది. నా భర్తను చంపి అక్కడి నుంచి పరారయ్యారు.. పదేళ్ల నుంచి నాగరాజు తో నాకు పరిచయం ఉంది.. పెళ్లి చేసుకుంటానంటే చంపుతారని నాగరాజు కు కూడా చెప్పాను.. 3 నెలల పాటు నాగరాజుతో మాట్లాడకుండా ఉన్నాను.. చివరికి నాగరాజు ప్రేమకు ఒప్పుకొని పెళ్లి చేసుకున్నాను.. చంపుతారు అని తెలిసిన నాగరాజు నన్ను పెళ్లి చేసుకున్నాడు.. నాకు న్యాయం చేయాలని అశ్రీన్ కోరింది.