విజయనగరం జిల్లాలో నేడు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణెదల నాగబాబు పర్యటించారు. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ.. జనసేనా ఫ్యామిలీ చూడడానికి… వాళ్ల అభిప్రాయం తెలుసుకోవడంతో పాటు అవగాహన పెంచుకునేందుకు వచ్చానని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాదులో కూర్చొని ఎవ్వరో చెప్పింది తెలుసుకునే కంటె నేరుగా వచ్చి తెలుసుకోవాలనుకున్నానని ఆయన వివరించారు. అంతేకాకుండా ఈ పర్యటన ద్వారా క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితి తెలుసుకొనే అవకాశం వచ్చిందన్నారు…
ఏపీ సీఎం జగన్ నేడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మధ్యాహ్నం ఢిల్లీ పర్యటనకు బయలుదేరిన జగన్ రాజధాని చేరుకున్న వెంటనే సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. సుమారు 45 నిమిషాల పాటు సమావేశం కొనసాగింది. సీఎం వైఎస్ జగన్ వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఉన్నారు. అయితే.. ఈ భేటీలో జగన్ పలు కీలక అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం. రాష్ట్ర…
ఏపీ మంత్రి పినిపే విశ్వరూప్ కొడుకు కృష్ణారెడ్డి బెదిరింపులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అమలాపురం రూరల్ ఈదరపల్లి వైసీపీ ఎంపీటీసీ అడపా సత్తిబాబును ఆయన ఫోన్లో బెదిరించినట్టు ఆరోపిస్తున్నారు. నా ఇంటికి నిప్పు పెడతారా మిమ్మల్ని చంపుతా అంటూ ఎంపీటీసీని మంత్రి తనయుడు బెదిరించినట్టు చెబుతున్నారు. తల్లి, భార్య పేరుతో అసభ్య పదజాలంతో తిట్టడమే కాకుండా తీవ్రస్థాయిలో బెదిరించినట్టు ఆరోపిస్తున్నారు. అయితే ఇది మంత్రి కుమారుడు కృష్ణారెడ్డి ఆడియోనా.. కాదా అని పరిశీలిస్తున్న పోలీసులు. అమలాపురం…
ఉత్తరప్రదేశ్లోని లఖ్నవూలో 2 రోజుల పాటు నిర్వహించాల్సిన “నవ సంకల్ప్ కార్యశాల”లో పాల్గొనడానికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వెళ్లారు. అయితే.. ఉన్నట్టుండి.. ఉత్తరప్రదేశ్ పర్యటనను ముగించుకొని ఢిల్లీకి తిరిగివెళ్లారు. గత ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి గల కారణాలతో పాటు పార్టీని రాష్ట్రంలో బలపర్చే అంశాలపై కీలక చర్చల్లో ప్రియాంక గాంధీ పాల్గొనాల్సి ఉంది. అయితే.. ఆమె ఒక్కసారిగా ఢిల్లీకి ఎందుకు వెళ్లారన్న విషయం ఆ పార్టీ యూపీ నేతలకు కూడా తెలియకపోవడంతో…
అవినీతి చేసే ఎమ్మెల్యేలు, మంత్రుల కోసం యాప్ ఎందుకు పెట్టలేదు అంటూ వైసీపీ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రభుత్వ అండ లేకుండా ఎవరైనా మైనింగ్ చేయగలరా..? అని ప్రశ్నించారు. ఇసుక అక్రమాల గురించి బొల్లా బ్రహ్మానాయుడు, విత్తన అక్రమాల గురిoచి ఆర్కే మాట్లాడలేదా..? అని ఆయన అన్నారు. కృష్ణపట్నం పోర్టులోకి లారీలు వెళ్లాలంటే కాకాణి టోల్…
సీఎం జగన్ లాభాపేక్షకు విద్యారంగం నాశనమైందని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు కేఎస్ జవహర్ ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీచర్లను లిక్కర్ షాపుల వద్ద నిలబెట్టినప్పుడే విద్యారంగంపై జగన్ చిత్తశుద్ధేమిటో అర్థమైందని ఆయన మండిపడ్డారు. నూతన విద్యావిధానం అంటూ ఎవరిని సంప్రదించి సీఎం నిర్ణయాలు తీసుకున్నారు..? అని ఆయన ప్రశ్నించారు. మంత్రులంతా వేలి ముద్రగాళ్లు అవ్వబట్టే, రాష్ట్రంలో విద్య వ్యాపారాంశమైందని, చంద్రబాబు బడ్జెట్లో 15శాతం నిధులు విద్యకు కేటాయిస్తే, జగన్ వచ్చాక 10శాతం…
రాజధాని నిర్మాణంపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తొలి సంతకం రాజధాని నిర్మాణ పనులపైనే అంటూ స్పషీకరించారు. అంతేకాకుండా.. రాజధాని నిర్మాణం మూడేళ్లల్లో పూర్తి చేస్తామని, అధికారంలోకి వస్తే రాజధాని పనుల మీదే బిజెపీ మొదటి సంతకం చేస్తుందని ఆయన వెల్లడించారు. ఒకాయన ఎక్కడికెళ్లినా ఆ మోడల్ కేపిటల్ కడతానంటారు.. మాట తప్పను మడమ తిప్పను అంటూ రాజధానిని విశాఖకు తీసుకెళ్తానంటాడు ఇంకొకాయన.. బీజేపీ అమరావతిలోనే…
నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు శతిజయంతి వేడుకులను పురస్కరించుకొని టీడీపీ అధినేత ఎన్టీఆర్కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనం మన వెంట ఉంటే జనం లేని బస్సులు వైసీపీ వైపు ఉన్నాయంటూ ఆయన విమర్శించారు. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండే వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగు జాతి వెలుగు ఎన్టీఆర్. తెలుగు ప్రజల పౌరుషం ఎన్టీఆర్. ఎంతమంది పుట్టినా ఎన్టీఆర్ ఎన్టీఆరే అంటూ ఆయన కొనియాడారు.…
టీడీపీ మహానాడు కార్యక్రమం కొనసాగుతోంది. అయితే తాజాగా ప్రకాశం జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ.. ఒక్క ఛాన్స్ అంటూ.. ప్రజల బుగ్గలు గిల్లుతూ.. ముద్దులు పెడుతూ అధికారంలోకి వచ్చాడు ఈ జగన్ మోసపు రెడ్డి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాకుండా.. ఎన్నికల ముందు సంక్షేమాన్ని పెంచుతామంటూ ధరలన్నీ పెంచుతున్నాడని, చెత్తపై కూడా పన్ను వేసేవాడిని చెత్త నాకొడుకు అంటామంటూ విమర్శలు గుప్పించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 850 మంది మహిళలపై దాడులు,…