Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Krishna Lockup Dea*th Case : విజయవాడలో జరిగిన సాయికృష్ణ కస్టడీ మృతి కేసుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణకు చెందిన హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మనేని చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ ఘటనను స్వీకరించిన కమిషన్, ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాష్ట్ర డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్‌కు వారం రోజుల్లో సమగ్ర యాక్షన్ టేకెన్ రిపోర్ట్ సమర్పించాలని నోటీసులు జారీ చేసింది.
ప్రాథమిక సమాచారం, ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నివేదికల ఆధారంగా అక్రమ నిర్బంధం, కస్టడీలో హింస జరిగి ఉండొచ్చని కనిపిస్తోందని NHRC పేర్కొంది. ఈ కేసులో ఆధారాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయనే ఆరోపణలు కూడా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజీని డిలీట్ చేసిన అంశంపై కూడా పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించింది.
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
బాధితుడి మృతదేహాన్ని దహనం చేసి, అస్థికలను నదిలో కలిపేశారనే ఆరోపణలపై కూడా కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. డిలీట్ చేసిన సీసీటీవీ ఫుటేజీని రికవర్ చేయడంతో పాటు, అవసరమైతే బాధితుడి అస్థికలను వెలికితీసే చర్యలు చేపట్టాలని సూచించింది. అలాగే బాధితుడి తల్లి గాదె విజయలక్ష్మికి తక్షణ రక్షణ, భద్రత కల్పించాలని రాష్ట్ర అధికారులను ఆదేశించింది. ఈ ఘటనలో కృష్ణలంక సీఐ నాగరాజుపై ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఆయనను సస్పెండ్ చేసి, SIT దర్యాప్తు నేపథ్యంలో రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొంది. ఎఫ్ఐఆర్ ప్రస్తుత స్థితి, నిందితులపై తీసుకున్న చర్యలు, బాధిత కుటుంబానికి పరిహారం, దర్యాప్తు పురోగతిపై సమగ్ర నివేదికను వారం రోజుల్లో సమర్పించాలని NHRC స్పష్టం చేసింది. ఈ ఘటన జీవించే హక్కుపై తీవ్రమైన ఉల్లంఘనగా కనిపిస్తోందని పేర్కొన్న కమిషన్, చట్టాన్ని అమలు చేయాల్సిన సంస్థలే చట్టాన్ని ఉల్లంఘించే పరిస్థితులు ప్రజాస్వామ్యానికి ఆందోళనకరమని వ్యాఖ్యానించింది. కేసులో పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారులను ఆదేశించింది.
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!