Breaking : ఏపీలో మరో దారుణం.. బాలికపై కరస్పాండెంట్ అత్యాచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో పరిస్థితులు రోజురోజుకు మరింత ఇబ్బందికరంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. అత్యాచార ఘటనలు వరుసగా చోటు చేసుకోవడంతో ఇటు ప్రభుత్వం, అటు పోలీసు శాఖ మృగాళ్లను కట్టడి చేసేందుకు కఠిన ఆంక్షలు, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినా ఫలితం లేకపోతోంది. పాఠశాలలకు పంపితే పాఠశాలలోని ఉపాధ్యాయులే విద్యార్థినులపై అత్యాచారం చేస్తున్న ఘటనలు వెలుగులోకి రావడం శోచనీయం. అయితే తాజాగా మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాకినాడ నగరానికి చెందిన బాధిత బాలిక ఆరో తరగతి నుంచి కొండయ్యపాలెంలోని హెల్పింగ్ హ్యాండ్స్ ప్రైవేటు వసతి గృహంలో ఉంటూ చదువుకుంటోంది.
అయితే.. తండ్రి చనిపోవడంతో తల్లే ఆమెను చూసుకుంటోంది. ఈ నేపథ్యంలో.. ఇటీవలే తొమ్మిదో తరగతి పరీక్షలు రాసిన బాలికపై వసతిగృహం కరస్పాండెంట్ కొత్తపల్లి విజయకుమార్ (60) కన్నేశాడు. ఈ క్రమంలో బాలికకు మాయమాటలు చెప్పి ఈ ఏప్రిల్‌లో తన గదికి తీసుకెళ్లిన నిందితుడు విజయకుమార్ కరోనా మాత్రలంటూ బాలికకు కొన్ని మాత్రలు ఇచ్చాడు. అవి వేసుకున్నాక బాలిక మత్తులోకి జారుకుని నిద్రపోయింది. ఇదే అదునుగా భావించిన దుర్మార్గుడు విజయ కుమార్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇలా పలుమార్లు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. వేసవి సెలవుల నేపథ్యంలో ఇంటి వద్ద ఉంటున్న బాలిక మూడు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది.
Also Read
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
- CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
- Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు...
అంతేకాకుండా.. తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో ఆందోళన చెందిన ఆమె తల్లి ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం బాధిత బాలిక కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. ఆమెకు గర్భస్రావం అయినట్టు వైద్యులు తెలిపారు. విజయకుమార్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు విజయ కుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!