BREAKING NEWS: ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు వెళ్తున్నట్లు తెలిసింది. జూన్ 22న ప్రధాని అమెరికా పర్యటకు వెళ్తారని, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చే విందులో పాల్గొంటారని వైట్ హౌజ్ వర్గాలు వెల్లడించాయి. ప్రధాని మోడీ పర్యటన అమెరికా, భారతదేశం మధ్య స్నేహబంధం మరింత పెరుగుతుందని, భారతీయులు, అమెరికన్ల స్నేహాన్ని ధృవీకరిస్తుందని వైట్ హౌజ్ ఓ ప్రకటనలో పేర్కొంది.