Mahmood Ali : దేశంలోనే అత్యున్నత పోలీస్ శాఖగా తెలంగాణ పోలీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అనంతరం రాష్ట్ర పోలీస్ శాఖ ఆధునీకరణకు, పోలీస్ అధికారుల నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, ప్రాధాన్యత దేశంలోని మరే రాష్ట్రంలో ఆయా ప్రభుత్వాలు చేయలేదని రాష్ట్రం హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ పేర్కొన్నారు. విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పోలీసు అధికారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన పలు సేవా పతకాల ప్రదానం 281 మంది పోలీస్ అధికారులకు బుధవారం నాడు రవీంద్ర భారతిలో జరిగింది. ఈ పతకాల పంపిణి కార్యక్రమానికి రాష్ట్ర హోం శాఖా మంత్రి మహమూద్ అలీ, డీజీపీ అంజనీ కుమార్ లు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిస్థితి మెరుగ్గా ఉంటేనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు సక్రమంగా జరిగి రాష్ట్రం పురోభివృద్ధిలో పయనిస్తున్నదని అన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పోలీస్ శాఖ ఆధునీకరణ, పెద్ద ఎత్తున నియామకాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యతనిచ్చారని అన్నారు. ఇటీవల ప్రారంభించిన రామగుండం పోలీస్ కమిషనరేట్ లాంటి భవనం మరెక్కడా లేదని ప్రస్తావించారు.
Also Read : Martin Scorsese: మార్టిన్ స్కార్ససే… ఎందుకంత సేపు!
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
కొత్త పోలీస్ జోన్లు ఏర్పాటు చేయడం, పోలీస్ డివిజన్లు, పోలీస్ స్టేషన్లు కొత్తగా ఏర్పాటుతోపాటు నార్కోటిక్స్ కంట్రోల్ విభాగం, ఐ 4 సి లను కూడా ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో కూడిన కమాండ్ కంట్రోల్ టవర్ ను కూడా ప్రారంభించుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో మెరుగైన శాంతియుత పరిస్థితులు ఉన్నందునే, అనేక బహుళ జాతి సంస్థలు తమ కార్యకలాపాలను హైదరాబాద్ లో ప్రారంభించాయని అన్నారు. ఫ్రెండ్లి పోలీసింగ్, మహిళా భద్రతా విభాగం, షీ టీమ్స్ , భరోసా కేంద్రాలు, సీసీ టీవీ ల ఏర్పాటు, మట్కా-గ్యాంబ్లిగ్ కేంద్రాల మూసివేత, మాదక ద్రవ్యాల నివారణ తదితర చర్యలతో తెలంగాణా పోలీస్ దేశంలోనే అత్యున్నత పోలీస్ శాఖగా నిలిచిందని హోం మంత్రి తెలియచేసారు.
Also Read : HD Kumaraswamy: “కింగ్ మేకర్” కాదు.. “కింగ్”గా మారబోతున్నాం..
డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ, ఈ పతకాలు కేవలం వ్యక్తిగతం కావని, తమ పరిధిలో పనిచే వారందరితోపాటు, కుటుంబ సభ్యులకు వచ్చినట్టుగా బావించాలన్నారు. పోలీస్ శాఖ ఆర్థికాభివృద్ధిలో కీలకమైన ఒక ప్రధాన భాగమని అన్నారు. పోలీస్ ఉద్యోగం కత్తిమీద సాములాంటిదని అన్నారు. నిరంతరం 24/7 ప్రజా సేవలో విధులు నిర్వర్తించే పోలీసులు తాము అందించే ఉత్తమ సేవలకు గుర్తింపుగా సేవా పతకాలను అంద చేయడం జరుగుతుందని, ఈ పతకాల స్పూర్తితో మరింత అంకిత భావంతో పనిచేయాలని పోలీసు అధికారులకు పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్ శాఖకు ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత నిస్తున్నారని అన్నారు.
అడిషనల్ డీజీ. అభిలాష బిస్త్ ఈ కార్యక్రమానికి స్వాగతం పలకగా, హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, ఎసిబి డీజీ రవిగుప్త, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండి రాజీవ్ రతన్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, అడిషనల్ డీజీలు విజయ కుమార్, షిఖా గోయల్, స్వాతి లక్రా, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఐజి లు కమలహాసన్ రెడ్డి, చంద్ర శేఖర్ రెడ్డి, షా నవాజ్ కాసీం, రమేష్, లతోపాటు పలువురు సీనియర్ పోలీసు అధికారులు హాజరయ్యారు. మెడల్స్ గ్రహీతలను సైబరాబాద్ అడిషనల్ కమీషనర్ రితీ రాజ్ వేదికపై ఆహ్వానించారు
మెడల్స్ గ్రహీతలు….
2022 సంవత్సరానికి గాను అతి ఉత్క్రిష్ట్ సేవ పతకం స్వీకరించిన వారిలో డీజీపీ అంజనీ కుమార్, తెలంగాణ పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ ఎండి రాజీవ్ రతన్, హైదరాబాద్ సీపీ సి.వీ ఆనంద్, ఐ.జి. వి.బి కమలాసన్ రెడ్డి లతోపాటు 26 మంది పోలీస్ అధికారులు ఉన్నారు. ఉత్క్రిష్ట్ సేవ పథకాలు -2022 కుగాను స్వీకరించిన వారిలో ఐజి తరుణ్ జోషి, సైబరాబాద్ జాయింట్ కమీషనర్, డీఐజీ అవినాష్ మొహంతి లతోపాటు 28 మంది పోలీస్ అధికారులున్నారు. 20-21 కి గాను అసాధారణ ఆసూచన కుశలత పతకం స్వీకరించిన వారిలో హైదరాబాద్ ఐజి వీ. శివ శంకర్ తదితరులున్నారు. హోం మంత్రి ప్రదానం చేసిన ఈ అవార్డులలో అతి ఉత్క్రిష్ట్ సేవ పథకాలు -2022 లను 30 మంది పోలీస్ అధికారులకు, ఉత్క్రిష్ట్ సేవ పథకాలు- 2022 కుగాను 28 మందికి, అసాధారణ ఆసూచన కుశలత పధకం లను 7 గురికి, ఇన్వెస్టిగేషన్ లో ఉత్తమ ప్రతిభ చూపిన వారికి కేంద్ర హోమ్ మంత్రి మెడల్స్ 8 మందికి, ట్రైనింగ్ లో ఉత్తమ ప్రతిభ చూపిన వారికి కేంద్ర హోమ్ మంత్రి మెడల్స్ 11 మందికి, శౌర్య పధకం – 2022 లు 11 మందికి, మహోన్నత సేవ పథకం -2022 లు 7 గురు పోలీస్ అధికారులకు అందచేయనున్నారు.
తాజావార్తలు
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!