తెలంగాణ ఇంటర్ బోర్డు ఇటీవల ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో తాజాగా డిగ్రీలో ఆన్లైన్ ప్రవేశాలకు దోస్త్ షెడ్యూలును అధికారులు ప్రకటించారు. ఈనెల 16 నుంచి జూన్ 10 వరకు దోస్ట్ వెబ్‌సైట్ (dost.cgg.gov.in)లో విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈనెల 20 నుంచి జూన్ 11 వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. జూన్ 16న తొలి విడత డిగ్రీ సీట్ల కేటాయింపు చేపడతారు. జూన్ 30న రెండో విడత, జులై 10న మూడో విడత సీట్ల కేటాయింపు ఉండనుంది. జులై 17న తరగతులు ప్రారంభం అవుతాయి. ఇదిలా ఉంటే.. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్లో మెదక్ చివరి స్థానంలో నిలిచింది. సెకండియర్ ఫలితాల్లో ములుగు జిల్లాకు ప్రథమ స్థానంలో నిలిచింది. అయితే.. గతేడాది కంటే ఉత్తీర్ణత శాతం తగ్గడం గమనార్హం. జూన్ 4 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. అదే సమయంలో ఫెయిలైన విద్యార్థులు ఎవరూ కూడా ఆందోళన చెందొద్దన్నారు.
Also Read : Karnataka Election: కర్ణాటక ఫలితాలపై జోరుగా బెట్టింగ్.. గెలుపెవరిది..? ఏ పార్టీకి ఎన్ని సీట్లు..?
అయితే.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకూ జరిగాయి. మొదటి సంవత్సరం పరీక్షలకు 4,82,501 మంది, రెండో సంవత్సరం పరీక్షలకు 4,23, 901 మంది హాజరయ్యారు. దాదాపు 9.06 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన సమాధాన పత్రాల మూల్యంకన ప్రక్రియ ఏప్రిల్ రెండో వారంలోనే పూర్తయింది. పలు దఫాలుగా ట్రయల్‌రన్ చేసిన అనంతరం సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండటంతో జీరో సాంకేతిక సమస్యలు నిర్ధారణ అయిన తర్వాత.. ఫలితాల వెల్లడికి ఎలాంటి ఆటంకాల్లేవని అధికారులు నిర్ణయానికి వచ్చారు.
Also Read : Mahmood Ali : ఇస్లామిక్ రాడికల్స్ కేసును దర్యాప్తు చేస్తున్నాం