ఇంటర్నేషనల్ రాడికల్ ఆర్గనైజేషన్‌తో సంబంధాలు కొనసాగిస్తున్నారనే ఆరోపణలతో మధ్యప్రదేశ్, తెలంగాణలో ముందస్తు ఆపరేషన్‌లో అదుపులోకి తీసుకున్న 16 మంది వ్యక్తులపై ఇంటెలిజెన్స్ బ్యూరో నిశితంగా నిఘా ఉంచింది. తెలంగాణ పోలీసు కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్, మధ్యప్రదేశ్ పోలీసుల యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) సమన్వయంతో మధ్యప్రదేశ్‌లో 11 మందిని, తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో మరో ఆరుగురిని అదుపులోకి తీసుకుంది. ఫిబ్రవరి 2022లో తమిళనాడుకు చెందిన జియావుద్దీన్ బాఖవీని అరెస్టు చేసిన తర్వాత ఉగ్రవాద సంస్థ హిజ్బ్-ఉత్-తహ్రీర్ (HuT) సభ్యులు, సానుభూతిపరులతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తులపై నిఘా సంస్థలు నిశితంగా గమనిస్తున్నాయి.
Also Read : Karnataka Election: కర్ణాటక ఫలితాలపై జోరుగా బెట్టింగ్.. గెలుపెవరిది..? ఏ పార్టీకి ఎన్ని సీట్లు..?
అరెస్టైన వారి నుంచి ఇస్లామిక్ జిహాదీ బుక్స్, మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, కత్తులు ఏటీఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాడికల్ ఇస్లామిక్ కార్యకర్తలు హైదరాబాద్ లో తలదాచుకున్నట్లు ఏటీఎస్ పోలీసులు గుర్తించారు. వారిపై దాడులు నిర్వరించి 16 మందిని అరెస్ట్ చేసి భోపాల్ తీసుకెళ్లారు మధ్యప్రదేశ్ పోలీసులు. అయితే.. దీనిపై తాజా తెలంగాణ హోమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. ఇస్లామిక్ రాడికల్స్ కేసును దర్యాప్తు చేస్తున్నామన్నారు. హైదరాబాద్ నుంచి ఆరుగురిని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారని.. పట్టుబడిన వారి వివరాలను సేకరిస్తున్నామన్నారు. హైదరాబాద్ పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని, ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉందని మహమూద్ అలీ వెల్లడించారు.
Also Read : Ramabanam: ఎంటర్ టైన్ మెంట్ కట్… అందుకే ఆ రిజల్ట్!