నిషేధిత మావోయిస్టులకు డబ్బులు, ఇతర వస్తువులు అధిస్తున్న నలుగురు బీడీ కాంట్రాక్టర్లను అరెస్ట్ చేశారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసులు. వారి వద్ద నుండి 76 లక్షల 58 వేల నగదు,మెడికల్ కిట్టు,జిలెటిన్ స్టిక్స్, నాలుగు సెల్ ఫోన్లు, ట్యాబ్, మూడు స్మార్ట్ వాచ్ లను స్వాధీనం చేసుకున్నారు. కాటారం ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ చేస్తున్న భూపాలపల్లి పోలీసుల ఒక వాహనం అనుమానస్పదంగా కనబడడంతో విచారించగా నలుగురు వ్యక్తులతో పాటు భారీ మొత్తంలో 76 లక్షల 58 వేల నగదు, ట్యాబ్, వాచీలు, జెలెటిన్ స్టిక్స్ ,డిటోనేటర్లు, కార్డెక్స్ వైర్ తదితర అనుమానాస్పద వస్తువులు లభించాయి.
Also Read : Pakistan: ఇమ్రాన్ ఖాన్ విషయంలో పాక్ సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా కరీంనగర్ కు చెందిన అబ్దుల్ అజీజ్, మొహమ్మద్ అబ్దుల్ రజాక్, జనగామ రాఘవ్ , కౌసర్ అలీ లుగా గుర్తించారు.. వీరంతా బీడీ ఆకు కాంట్రాక్టర్లు, వీరు ఛతీస్‌ఘడ్‌లో తమ బీడీ కాంట్రాక్టు నిర్వహించుకోవడానికి మావోయిస్టులకు ప్రతి సంవత్సరం డబ్బులు, వస్తువులు మామూళ్ల రూపంలో సరఫరా చేస్తున్నారని, ఇదే క్రమంలో ఈ సంవత్సరం కూడా మావోయిస్టు లకు నగదు ఇచ్చేందుకు వెళుతున్న వారిని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. అయితే.. వీరితో పాటు మరో నలుగురు పరారీలో ఉన్నారని పోలీసు విచారణ లో తేలింది. వీరికి సహకరిస్తున్న మరో నలుగురు స్థానికులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారి కోసం వేట మొదలు పెట్టారు.
Also Read : Pre-wedding shoots: ప్రీ వెడ్డింగ్ షూట్స్ అమ్మాయిలకు హానికరం.. మహిళా కమిషన్ చైర్‌పర్సన్ కీలక వ్యాఖ్యలు..