Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ సికింద్రాబాద్ లో పర్యటించనున్నారు. నేడు ఉదయం 11 గంటలకు రైల్యే స్టేషన్ అభివృద్ది పనులను పర్యవేక్షించునున్నారు.
బోధన్ మాజీ ఎమ్మెల్యే అమీర్ షకీల్, ఆయన కుమారుడు రహీల్ షకీల్‌తో పాటు మరో ఇద్దరిపై హైదరాబాద్ పోలీసులు ‘లుక్ అవుట్’ సర్క్యులర్ జారీ చేశారు. అన్ని విమానాశ్రయాలు, ఓడరేవులు, అంతర్జాతీయ సరిహద్దు చెక్‌పోస్టులను పోలీసులు అప్రమత్తం చేశారు. గత ఏడాది డిసెంబర్ 24న సోమాజిగూడ ప్రజాభవన్ ఎదుట మద్యం మత్తులో ఉన్న రహీల్ షకీల్ తన కారును పోలీసు బారికేడ్‌పైకి ఢీకొట్టాడు. అతడిని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించగా అక్కడి నుంచి ఇన్స్పెక్టర్ దుర్గారావు సహాయంతో…
HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. శివ బాలకృష్ణ సోదరుడు శివ నవీన్ కుమార్ అరెస్టు ఎసీబీ అధికారులు. మూడు రోజులపాటు నవీన్ కుమార్ విచారించిన తరువాత ఏసీబీ ఆయనను అరెస్టు చేసింది. నవీన్ కుమార్ బినామీగా ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ, బాలకృష్ణకు బినామీగా ఉండి ఆస్తులను కూడబెట్టినట్టు గుర్తించారు. ఇప్పటికే శివ బాలకృష్ణ ను ఎనిమిది రోజుల కస్టడీలో భాగంగా ప్రశ్నిస్తోంది ఏసీబీ బృందం. ఇప్పడు ఆయన సోదరుడిని…
కేంద్రప్రభుత్వం రూ.715 కోట్లతో.. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు చాలా వేగంగా సాగుతున్నాయి. గతేడాది ప్రధానమంత్రి చేతుల మీదుగా.. ఈ రైల్వే స్టేషన్ ను అట్టహాసంగా ప్రారంభించుకున్నసంగతి తెలిసిందే. ఈ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తిచేసేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవతీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు దక్షిణమధ్యరైల్వే జీఎం, ఇతర అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం మూడు దశల్లో స్టేషన్ నిర్మాణ పనులను సంకల్పించగా.. మొదటిదశ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కేంద్రమంత్రి కిషన్…
రాజ్యాంగ బద్ధంగా నియమితుడైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు పిచ్చెక్కినట్లు మాట్లాడుతున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ అన్నారు. ప్రజా ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కావడాన్ని మింగుడుపడక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర స్థాయి ఆత్మీయ సభలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ తో కలిసి మధుయాష్కీ పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్…
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. నీళ్ల గురించి మాకు తెలుసు కాబట్టే నాగార్జున సాగర్ కట్టామన్నారు. నీళ్ల గురించి మాకు తెలుసు కాబట్టే శ్రీశైలం కట్టామని ఆయన పేర్కొన్నారు. నీకు తెలియదు కాబట్టి కూలి పోయేలా కాళేశ్వరం కట్టావు కేసీఆర్ అని ఆయన విమర్శలు గుప్పించారు. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మాకు…
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈనెల 10 నుండి మరోసారి యాత్రకు సిద్ధమయ్యారు. ప్రజాహితమే లక్ష్యంగా…. కేంద్ర అభివ్రుద్ధి పథకాలను జనంలోకి తీసుకెళ్లడమే ధ్యేయంగా…. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంపై తిరిగి కాషాయ జెండా ఎగరేయడమే అంతిమంగా ఈ యాత్ర కొనసాగనుంది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని మండలాలను, వీలైనన్ని ఎక్కువ గ్రామాల్లో పాదయాత్ర చేసేలా రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగా కొండగట్టు అంజన్న సన్నిధిలో పూజలు నిర్వహించి…
సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ కేసు విచారణకు తెలంగాణ మంత్రి దామోదర రాజ నర్సింహ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ అంశంపై తెలంగాణ ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. ఢిల్లీలో న్యాయవాదులతో మాట్లాడాం.. సుప్రీంకోర్టు కు హాజరై వాదనలు విన్నాం.. వాదనలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్…
గ్రూప్-1లో మరో 60 పోస్ట్‌ల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ద్వారా 60 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేసింది. 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ప్రభుత్వం త్వరలో రిక్రూట్మెంట్ పరీక్షను నిర్వహించనుందని ఆ ప్రకటనలో పేర్కొంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు, నియామక ప్రక్రియ ను వేగంగా చేయాలని సర్వీస్…
రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరానికి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎప్‌సెట్ (TS EAPCET) పరీక్షాతేదీలు ఖరారయ్యాయి. ఈ పరీక్షలను మే 9 నుంచి 12 వరకు నిర్వహించనున్నారు. ఈ ప్రవేశ పరీక్షను ఇదివరకు టీఎస్ ఎంసెట్‌గా పిలిచేవారు. ఇటీవల టీఎస్ ఎప్‌సెట్‌గా మారుస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే మంగళవారం JNTUH, TS EAPCET-2024 కన్వీనర్, ప్రొఫెసర్, సివిల్ ఇంజనీరింగ్ హెడ్ డాక్టర్ బి డీన్ కుమార్ మంగళవారం…