రోజు రోజకు ఆడపిల్లలపై ఆఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. తమ స్థాయిని మరిచి చిన్నా పెద్దా తేడా లేకుండా తమ కామకోరికలను తీర్చుకునేందుకు ప్రేమ, పెళ్లి పేర్లను అడ్డుపెట్టుకుంటున్నారు. తీరా కావాల్సిన కోరిక తీరాక ముఖం చాటేస్తున్నారు. అలాంటి ఘటనే ఇది. 22 ఏళ్ల బాధితురాలి ఫిర్యాదుతో కర్ణాటక పోలీసులు హాకీ ప్లేయర్ వరుణ్ కుమార్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బెంగళూరు నగరంలోని జ్ఞానభారతి పోలీసులు వరుణ్ కుమార్‌పై లైంగిక నేరాల నిరోధక చట్టంలోని సెక్షన్…
తెలంగాణలో అప్పుడే భానుడి భగభగలు మొదలయ్యాయి. వింటర్ సీజన్ పూర్తిగా పోకుండానే సూర్యుడు ఠారెత్తిస్తున్నాడు. ఎండలు ఎడతెరిపి లేకుండా మండిపోవడంతో హైదరాబాద్‌లోని మోండా మార్కెట్, హయత్‌నగర్, బేగంపేట ప్రాంతాల్లో మంగళవారం 36.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) గణాంకాల ప్రకారం, కాప్రా, సరూర్‌నగర్, చార్మినార్, రాజేంద్రనగర్, మెహదీపట్నం, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్‌తో సహా అనేక ఇతర ప్రాంతాలలో కూడా గత 24 గంటల్లో ఉష్ణోగ్రతల స్థాయిలు 35 డిగ్రీల సెల్సియస్ కంటే…
తెలంగాణ ప్రభుత్వం చిల్డ్రన్ ఆఫ్ చైల్డ్ కేర్ ఇనిస్టిట్యూట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ధృవీకరణ పత్రాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ ఇంఛార్జి, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఆయనతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురశెట్టి, ఇతర ఉన్నతాధికారులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. పెద్దల సంరక్షణ కరువైన, పేరెంట్స్ లేని ప్రభుత్వ ,ప్రైవేట్ చిల్డ్రన్ హోమ్స్ లో ఉన్న పిల్లలకు ప్రభుత్వమే…
రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో బీసీ డిక్లరేషన్ లో ప్రకటించిన మేరకు 6 నెలల్లో కులగణన చేపట్టడానికి తక్షణమే ప్రక్రియ ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఆగమాగం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. మంగళవారం నాడు వరంగల్ లో బీసీ హక్కుల సాధన కోసం భారత…
హరీశ్ రావు లాగా పెట్రోల్ ముందు పోసుకున్నట్లు నటించి వేరే వాళ్ల చావుకు కారణం కాలేదని, పోసుకుని చచ్చిపోతా అని నాటకాలు ఆడలేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో కూడా వాళ్ళు అందరూ బ్లాక్ మైలర్స్ గా ఉన్నారని, ఆ బ్లాక్ మెయిల్ వివరాలు కూడా బయట పెట్టాల్సి వస్తదన్నారు. తెలంగాణ రావడానికి మూల కారణం… ఆల్ పార్టీ లో కేంద్రాన్ని ఒప్పించింది ఉత్తమ్ కుమార్ రెడ్డే. అవిషయం…
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం పకడ్బందీ ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) చేస్తోంది. భక్తులను తరలించేందుకు 6 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. మేడారం జాతర ఈ నెల 21 నుంచి 24 వరకు జరుగుతుండగా.. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నెల 18 నుంచి 25వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులను నడపుతున్నట్లు తెలిపింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ…
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ సమన్లను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈనెల 16కు వాయిదా వేసింది. న్యాయమూర్తులు బేల ఎం త్రివేది, పంకజ్ మిథాల్‌లతో కూడిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. విచారణ సందర్భంగా, ఈడీ తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు, సమన్లు జారీ చేసినప్పటికీ ఆమె హాజరుకావడం లేదని సుప్రీంకోర్టుకు తెలియజేయగా, తదుపరి తేదీ వరకు మధ్యంతర ఉపశమనం మంజూరు…
ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థుడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. సోమవారం జరిగిన మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ సమావేశంలో ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజాభవన్‌లో ప్రజాదర్బార్ నిర్వహణపై ముఖ్యమంత్రి బాంబు పేల్చారని, ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే హాజరయ్యారని అన్నారు. 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని, రైతుబంధు ఎకరాకు రూ.15 వేలకు పెంచుతామని ఎన్నికల్లో ఇచ్చిన…
కాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని ఐటీ శాఖ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు.. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం, మహాదేవపూర్ మండలాలల్లో పర్యటించారు. కాటారం మండలం కొత్తపల్లి శివారు పాలిటెక్నిక్ కళాశాలలో రూ. 3 కోట్లతో నిర్మించిన బాలుర హాస్టల్ నీ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు.విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.కాటారం ప్రభుత్వ హస్పిటల్ లోని డాక్టర్ల క్వార్టర్స్ రూములను ప్రారంభించారు. Upasana Kamineni తాత పుట్టినరోజు..…
భువనగిరి ఎస్సీ సంక్షేమ హాస్టల్లో శనివారం రాత్రి 10వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు హాస్టల్ గదిలో మృతి చెందిన ఘటనలో ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు భువనగిరి పోలీసులు హాస్టల్ వార్డెన్ శైలజ, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ప్రతిభ, ఆటోడ్రైవర్ ఆంజనేయులు, వంటవాళ్లు సుజాత, సులోచన, హాస్టల్ ట్యూషన్ టీచర్ భువనేశ్వరిపై కేసు నమోదు చేశారు. హాస్టల్ వార్డెన్, ఇతర సిబ్బంది కౌన్సెలింగ్ చేయడంతో తమ కుమార్తెలు ఆత్మహత్యాయత్నానికి…