విశాఖలో చికెన్ ధరలు అమాంతంగా పెరిగిపోయాయి.. వారం రోజుల వ్యవధిలో 50 రూపాయలు పెరిగి ట్రిపుల్ సెంచరీ వైపు పరుగులు పెడుతుంది.. సాధారణంగా వేసవికాలంలో చికెన్ ధరలు నేలచూపు చూసేవి కానీ ఈ సారి మాత్రం భిన్నంగా చికెన్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి… దీని గల కారణం చికెన్ కు డిమాండ్ ఉన్న దానికి తగ్గ సప్లై లేకపోవడమే అని వ్యాపారులు చెబుతున్నారు.. మరోవైపు పెరిగిన చికెన్ ధరలతో సామాన్యులు ముక్కున వేలేసుకుంటున్నారు.. కేజీ రెండు కేజీలు…
మార్చి 16 నాటికి ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఓటర్ల సంఖ్య 4.09 కోట్లని, జనవరి 22న నమోదైన 4.07 కోట్లతో పోలిస్తే ఇది పెరిగిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) ముఖేష్ కుమార్ మీనా శనివారం తెలిపారు. మొత్తం ఓటర్లలో రెండు కోట్ల మంది పురుషులు, 2.08 కోట్ల మంది మహిళలు, 3,346 మంది థర్డ్ జెండర్ ఉన్నారని ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికలను ప్రకటించిన రోజున ఆయన ఇక్కడ విలేకరుల సమావేశంలో అన్నారు. మే 13న…
సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర, బహిరంగ సభ సందర్భంగా ఆ రహదారిలో వాహనాల దారి మళ్లింపు చేశారు పోలీసులు. ట్రాఫిక్ మళ్లింపు ఇలా.. మార్కాపురం నుంచి ఒంగోలు వైపు వెళ్లే వాహనాలు నాగిరెడ్డిపల్లి దగ్గర నుంచి వెలిగొండ స్వామి గుడి మీదుగా చినమనగుండం వద్ద నంద్యాల నుంచి ఒంగోలు వెళ్లే రహదారిలో వెళ్లాలి. ఒంగోలు నుంచి మార్కాపురం వైపు వెళ్లే వాహనాలు పొదిలి, చిన్నారికట్ల జంక్షన్ దాటిన తర్వాత పాతపాడు మీదుగా కాట్రగుంట, చౌటపాలెం…
నేడు పదోరోజు సీఎం జగన్ మేమంతా సిద్ధం యాత్ర కొనసాగనుంది. ప్రకాశం జిల్లాలో జగన్ బస్సుయాత్ర కొనసాగుతుంది. పెద్దఅలవలపాడు, కనిగిరి మీదుగా పెద్ద అరికట్లకు జగన్. సాయంత్రం కొనకనమెట్ల క్రాస్ దగ్గర బహిరంగ సభకు చేరుకుంటారు. అనంతరం బత్తువారిపల్లి, సలకనూతల, పొదిలి, రాజంపల్లి దర్శి మీదుగా వెంకటాచలంపల్లికి జగన్. వెంకటాచలంపల్లిలో రాత్రి బస చేయనున్నారు సీఎం జగన్. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉదయం తొమ్మిది గంటలకు జువ్విగుంట క్రాస్లో రాత్రి బస చేసిన ప్రాంతం…
నేడు కృష్ణాజిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం యాత్రలో పాల్గొనున్నారు. అంతేకాకుండా.. ఆయన బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. నేడు కృష్ణా జిల్లాలో చంద్రబాబు ప్రజాగళం పర్యటన కొనసాగనుంది. ఈ సందర్భంగా ఆయన రోడ్ షోలు, బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. ప్రజాగళం పేరుతో చంద్రబాబు రాష్ట్రమంతటా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మలి విడత యాత్రలో భాగంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించిన చంద్రబాబు నిన్న పల్నాడు జిల్లాలో పర్యటించారు. పామర్రు, ఉయ్యూరులో… ఈరోజు చంద్రబాబు కృష్ణా జిల్లాలో…
చంద్రబాబు తీరు పరకాష్ఠకు చేరిందన్నారు సజ్జల రామకృష్ణా రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో బాబు కలల కన్న కూటమి వికటించిందన్నారు. చంద్రబాబు ఎవరు అనుకుంటే కూటమి పార్టీ అభ్యర్థులు డిసైడ్ అవుతారన్నారు. పవన్ కళ్యాణ్ కు ఉనికి లేకుండా పోయిందన్నారు. బీజేపీలో కూడా బాబు అనుకున్నట్టే సీట్లు ఖరారు అయ్యాయన్నారు. 2019 ఎన్నికల కంటే ఘోరంగా టీడీపీ ఓటమి చూడబోతుందన్నారు. ప్రతి ఎన్నికల సమయంలో కూడా చంద్ర బాబుకు పునకాలే అని, సైకిల్ రావాలి… సైకో పోవాలి…
ఎన్నికల్లో పోటీలో ఎవరున్నారో అని పేద వాడు ఆలోచించడు అని, అక్కడ పేద వాడికి కనిపించేది జగన్ మాత్రమే అన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంచి చేసిన జగన్ కు మాత్రమే ఓటు వెయ్యాలని పేద వాడు అనుకుంటాడన్నారు. సీఎం రమేష్ ఎక్కడి నుంచి అనకాపల్లికి వచ్చాడని, సీఎం రమేష్ ఆధార్ కార్డు అడ్రెస్ చూడండి.. హైదరాబాద్ అడ్రెస్ ఉంటుందన్నారు మంత్రి అమర్నాథ్. సీఎం రమేష్ ఎస్టీడీ.. బూడి ముత్యాలనాయుడు లోకల్..…
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగి నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుల్ సింగ్, మాజీ సీఎం, రాజంపేట పార్లమెంట్ బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో బీజేపీ జెండా ఆవిష్కరణతో పాటు, బీజేపీ శ్రేణుల బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ్ సింగ్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో కార్యకర్తల ఉన్న పార్టీ…
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో బీజేపీ కార్యాలయంను రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, పరిశీలకుడు సిద్ధార్థ నాథ్ సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజమండ్రి ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు పార్టీ కార్యాలయం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. జగన్ కాలనీల్లో అవినీతి ఉందన్నారు. ల్యాండ్ లెవెలింగ్ చేయటానికి కూడా నిధులు దోచేశారని, మడ అడవులు అడవుల్లో జగనన్న కాలనీల నిర్మాణం ఎలా జరిపారన్నారు. Vetukuri Suryanarayana Raju : ఆనాడు జనసంఘ్…
గత 44 ఏళ్ళుగా బీజేపీ పని చేస్తోందని, 45వ పుట్టిన రోజు జరుపుకుంటోంది బీజేపీ అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణ రాజు వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. జనసంఘ్ను శ్యాంప్రసాద్ ముఖర్జీ ప్రారంభించారని తెలిపారు. ఇందిరాగాంధీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే.. జనసంఘ్ రద్దు చేసి.. జనతా పార్టీని ప్రారంభించారని ఆయన పేర్కొన్నారు. 1980 ఏప్రిల్ 6 న జనతావపార్టీ నుంచీ బయటకి వచ్చి స్వతంత్రంగా బిజెపి ఏర్పడిందని, బీజేపీ మిగిలిన పార్టీలతో…