సెంటి మెంట్ తో బీఆర్ఎస్ ,బీజేపీ రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి సీతక్క మండిపడ్డారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభంజనం నడుస్తుంది కాబట్టి కొంతమంది వ్యూహరక్తలతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారన్నారు. ప్రశాంత్ కిశోర్ ముందునుంచి మాకు వ్యతిరేఖంగానే ఉన్నారని, రాహుల్ గాంధీ వద్దకు వస్తే ఆయన్ను పక్కన పెట్టారన్నారు. పీకే గతంలో బీఆర్ఎస్ కోసం పనిచేశారని, ఆయన చెప్పింది ఏం కాలేదు..అంతకంటే గొప్పవాళ్లు మాకున్నారన్నారు. బీజేపీ గుడుల గురించి తప్పా బడులగురించి మాట్లాడడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎంపీ గా ఉన్న వాళ్లు ఏం చేశారని, ఇస్తానన్న 20 కోట్ల ఉద్యోగాలేవన్నారు.
విద్య,బట్టల మీద సైతం జీఎస్టీ వేస్తున్నారు. ఆఖరికి అగర్ బత్తీల మీద ఐదు శాతం జీఎస్టీ విధించిన ఘతన బీజేపీదేనని, బీజేపీ టాక్స్ టెర్రరిజం చేస్తోందన్నారు మంత్రి సీతక్క. ఏనుగుదాడిలో చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందిస్తాం..సంబందిత శాఖ మంత్రి ఇప్పటికే ప్రకటించారన్నారు మంత్రి సీతక్క. బీజేపీ అటవీహక్కులను కాలరాసిందని, ఆదివాసీలు గుడిసెలు వేసుకుంటే కూల్చి వేస్తున్నారు.. అడవులను కార్పోరేట్ కు అప్పగిస్తున్నారన్నారు. సెంటిమెంట్ తో రాజకీయాలు చేయడం తప్పా చేసింది ఏంటో చెప్పడం లేదని, రెండు పార్టీలు సెంటిమెంట్ ల చుట్టే తిరగుతున్నారన్నారు. మిల్లర్లకు బీఆర్ఎస్ దోచిపెట్టింది.. కాంగ్రెస్ తో కరువు రాలేదు..బీఆర్ఎస్ ఇచ్చిన కరువే అని ఆమె అన్నారు.