క్రోధి నామ సంవత్సరంలో కోపం తగ్గించుకొని కార్యకర్తలంతా పాజిటివ్ దృక్పథంతో పనిచేయాలని ఎమ్మెల్సీ, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇవాళ ఆయన ఉగాది పండుగను పురస్కరించుకొని ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తున్నాయన్నారు. ప్రజల అభీష్టం మేరకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అద్భుతంగా పాలన కొనసాగిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రతీ కార్యకర్త…
ప్రజలకు ఉగాది క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సంవత్సరం అందరికి మంచే జరిగి అభివృద్ధి చెందాలని భగవంతుణ్ని కోరుకుంటున్నట్టు చెప్పారు. మన ప్రాంతాన్ని,మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అందరం శ్రమ పడాలని సూచించారు. అందరికి శుభం జరిగి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని పొన్నం తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి ప్రకటన ఇప్పుడు ఈ క్షణము రేపు ఎల్లుండి వరకు రావచ్చని, పార్లమెంట్ స్థానిక…
మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వ తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఇవాళ పలువురు నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… దొంగలుపోయి గజదొంగలు వచ్చినట్లు ఈ రోజు తెలంగాణలో అంటూ తీవ్ర విమర్శలు చేశారు. తెలుగువారమంతా ఏ పని చేసినా పంచాగం చూస్తుంటామని, అలాంటి పంచాంగ పఠనం జరిగే ఈ రోజు మనకు ఎంతో శుభసూచమని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అనంతరం ఆయన బీఆర్ఎస్,…
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ సిరిసిల్లలో రేపు జరప తలపెట్టిన ‘నేతన్నకు అండగా భరోసా దీక్ష’ కు ప్రభుత్వం దిగివచ్చిందని, ఇది బండి సంజయ్ కుమార్ పోరాటే ఫలితమేనని , నేత కార్మికుల సమస్యలు, డిమాండ్లకు ప్రభుత్వం అంగీకారం తెలిపినందున, దీక్షా కార్యక్రమాన్ని ఎంపీ బండి సంజయ్ వాయిదా వేస్తున్నారని బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ నేతన్నల ప్రధాన…
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TS TET 2024) దరఖాస్తు గడువు రేపటితో(ఏప్రిల్ 10) ముగియనుంది. మార్చి 27 నుంచి ప్రారంభమైన దరఖాస్తుల గడువు రేపటితో.. అంటే ఏప్రిల్ 10వ తేదీతో ముగియనుంది. ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ ఈ సందర్భంగా పేర్కొంది. దరఖాస్తుల అనంతరం ఏప్రిల్ 15వ తేదీ నుంచి హాల్‌టికెట్ల జారీ ప్రారంభమవుతుంది. మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు సీబీటీ విధానంలో టెట్…
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ నగరవ్యాప్తంగా ఎంతోగానో ప్రాచుర్యం పొందిన చిలుకూరు బాలాజీ దేవస్థానం నుంచి చేవెళ్ళ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ జి.రంజిత్ రెడ్డి తన ఎన్నికల క్యాంపెయిన్‌ను మంగళవారం(ఏప్రిల్ 9వ తేదీ నుంచి) షురూ చేశారు. తమ ఇంటి దేవుడు(ఇలవేల్పు) శ్రీ వెంకటేశ్వరుడికి కుటుంబ సభ్యులతో సంయుక్తంగా చిలుకూరులో పూజలు నిర్వహించిన తర్వాత ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. 45 రోజుల పాటు ఆయన చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియెజకవర్గాల్లో అన్ని మండలాలు, గ్రామాల్లో…
డోర్ టూ డోర్ వెళ్లడం మా తొలి ప్రణాళిక అని, పెద్దగా సభలు పెట్టాలని అనుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇవాళ ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. బీజేపీ గెలవాలి.. మోడీ ప్రధాని కావాలని ప్రజలు కోరుతున్నారన్నారు. పోలింగ్ చేయించుకోవాల్సిన అవసరం ఉందని, రాష్ట్ర అధ్యక్షుడిగా, నేను అభ్యర్ధిగా ఉన్నాను సో అందరిని కో ఆర్డినేట్ చేస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కు ఎందుకు ఓటెయ్యల్లో కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలన్నారు.…
వివిధ ప్రాంతాల మధ్య 48 వేసవి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రకటించింది. దీని ప్రకారం, సికింద్రాబాద్ – నాగర్సోల్ (07517) సర్వీస్ ఏప్రిల్ 17 మరియు మే 29 మధ్య నడుస్తుంది మరియు నాగర్సోల్ – సికింద్రాబాద్ (07518) సర్వీస్ ఏప్రిల్ 18 మరియు మే 30 మధ్య నడుస్తుంది. ఇతర వేసవి ప్రత్యేక రైళ్లలో హైదరాబాద్ మరియు కటక్ మధ్య మంగళవారం అంటే ఏప్రిల్ 16, 23 మరియు 30…
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో నిజామాబాద్‌లో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో విప్, ఎమ్మెల్యే లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజాన్ని చీల్చడమే లక్ష్యంగా బిజెపి మేనిఫెస్టో అని ఆయన విమర్శించారు. భగవద్గీత లాంటి రాజ్యాంగాన్ని బీజేపీ మారుస్తాం అనడం హాస్యాస్పదమని ఆయన మండిపడ్డారు. మోడీకి ఆదాని, అంబానీ అండ రాహుల్ గాంధి కి ఎవరు ఉన్నారని, దేశ సమగ్రత, దేశ…
ఏడాదిన్నరగా నమ్మకంగా పని చేస్తున్న కారు డ్రైవర్ యజమానిని బురిడీ కొట్టించి 40 లక్షల నగదు, కారుతో పరారయ్యాడు. పెళ్లి చేసుకొని కొట్టేసిన నగదుతో బిజినెస్ చేసి సెటిల్ అవుదాం అనుకున్నాడు. ఇటీవలే నిశ్చితార్థం చేసుకొని , మరి కొద్ది రోజుల్లో పెళ్లి చేసుకొనేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండగా పోలీసులకు చిక్కాడు. పెళ్లి పీటలు ఎక్కబోయే ఆ డ్రైవర్ ను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ కేసుకు సంబంధించి… పోలీస్ స్టేషన్…