ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను ఇప్పుడు చంద్రబాబు అమలు చేస్తానంటున్నారని మంత్రి తానేటి వనిత మండిపడ్డారు. నాకు అనుభవం ఉందని చెప్పుకోవడమే తప్ప పేదల పక్షాన ఇది చేస్తానని చెప్పే సత్తా చంద్రబాబుకు లేదన్నారు. శవరాజకీయాలు చేసింది టిడిపి మంత్రులే అని ఆమె ధ్వజమెత్తారు. పుష్కరాల సమయంలో భక్తులకు ఏర్పాట్లు చేయకుండా షూటింగ్ ల పేరుతో 32 మంది అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని, వృద్ధులకు పెన్షన్లు అందకూడదని టిడిపి నాయకులు చేత ఎలక్షన్…
కాంగ్రెస్, సీపీఐ పార్టీల మధ్య సీట్ల ఒప్పందం కుదిరిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వెల్లడించారు. ఒక్క పార్లమెంటు, ఎనిమిది అసెంబ్లీ స్థాన్నాల్లో సీపీఐని బలపర్చటానికి కాంగ్రెస్ పార్టీ అంగీకారం తెలిపిందని, ఇటీవల హైదరాబాద్ నందు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలా నివాసంలో ఇరుపార్టీల మధ్య చర్చలు జరిగాయన్నారు. సమావేశంలో కాంగ్రెస్ నుంచి షర్మిలా, సీడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, కేంద్ర పార్టీ ప్రతినిధి కె.రాజు, సీపీఐ నుంచి రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సహ కార్యదర్శి ముప్పాళ్ల…
ఏపీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ నిర్వహిస్తోన్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు నేడు విరామం ప్రకటించారు. నెల్లూరు జిల్లాలోని చింతారెడ్డి పాలెం దగ్గర క్యాంప్ లో జగన్ బస చేయనున్నారు. ఈరోజు పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశం కానున్నారు. నెల్లూరు జిల్లాలో నేతలతో ఆయన ప్రత్యేకించి మాట్లాడతారు. వారికి రానున్న ఎన్నికల్లో పది నియోజకవర్గాల్లో గెలుపు సాధించే దిశగా చేయాల్సిన ప్రయత్నాలపై దిశానిర్దేశం చేయనున్నారు. నెల్లూరు జిల్లాలోని వైసీపీ ముఖ్యనేతలకు క్యాంప్ సైట్ వద్దకు…
టెస్లా పెట్టుబడులను పొందేందుకు చర్యలు ముమ్మరం చేయాలని వివిధ వర్గాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో , డిసెంబర్ 2023 నుండి భారతదేశంలో టెస్లా పెట్టుబడులను రాష్ట్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని ఐటి మంత్రి డి శ్రీధర్ బాబు అన్నారు. నివేదికల ప్రకారం, టెస్లా భారతదేశంలో $2 బిలియన్-$3 బిలియన్ల ఎలక్ట్రిక్ కార్ ప్లాంట్ కోసం సైట్లను పరిశీలిస్తోంది. తెలంగాణకు టెస్లాను తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ మంత్రి కేటీఆర్…
నయీం కేసు మళ్లీ తెరిచి విచారణ జరిపించాలన్నారు మాజీ ఎంపీ వి హనుమంత రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నయీం కేసులో ఇన్వాల్వ్ అయిన పోలీస్ అధికారులు ఎవరు? నాయకులు ఎవరనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసును నీరుగార్చారని, బయట పడ్డ వందల కోట్ల డబ్బులు, పేద ప్రజల దగ్గర లాక్కున్న భూములు ఎక్కడికి పోయినవని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ భూములు ఎన్ని, పేద ప్రజల భూములు ఎన్ని తేలాలన్నారు. CM…
కేటీఆర్ ఎవడి తాటా తీస్తాడు.. మేము కూడా అదే చెప్తున్నా.. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు కేటీఆర్ అని మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. ఎక్కువ తక్కువ మాట్లాడేది మీరు.. మేము కౌంటర్ ఇవ్వగానే గోల చేస్తారని, ఫోన్ ట్యాపింగ్ చేసినం అనేది నువ్వే.. చేయలేదు అనేది నువ్వే.. సమంత.. నాగ చైతన్య విడిపోవడానికి ఫోన్ ట్యాపింగ్ కారణం అని అంతా కోడై కూస్తుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ ప్రభుత్వం అనుమత్జి లేకుండా చేయరన్నారు. అనుమతి ఇచ్చేది ప్రభుత్వం..…
రాష్ట్రాల్లో పది, ఇంటర్ పరీక్షలు పూర్తయి పాఠశాలు, కళాశాలలకు సెలవులు ప్రకటించిన దృష్ట్యా రాష్ట్రంలోని పలు దేవాలయాలను సందర్శించే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో అన్ని దేవాలయాల్లో భక్తులకు మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించాలని దేవాదాయ ధర్మాదాయ కమీషనర్ హనుమంత రావు ఆదేశించడంతో అన్ని ప్రధాన దేవాలయాల్లో భక్తులు ఎండబారిన పడకుండా షామియానాలు, ఆలయ ప్రాంగణంలో పలు చోట్ల తాగునీటి సౌకర్యాలు, చిన్న పిల్లలకు పాలిచ్చే లాక్టేషన్ గదులు, వృద్దులు, వికలాంగులకు వీల్ ఛైర్లు,…
రాష్ట్రంలో ప్రశ్నించాలంటే భయం రాయాలంటే భయం ఉండేది… అటువంటి ప్రభుత్వం ఇప్పుడు లేదని డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హామీ ఇచ్చిన గారెంటీలని అందిస్తున్నామని, మూడు నెలల్లోనే ముప్పై వేల ఉద్యోగాల ఇచ్చామన్నారు. నేతలు చేసిన వాగ్దానాలు మార్చి పోయారని లేని పోని అభాండాలు వేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కరెంట్ పొకపోయిన పోయినట్లుగా ప్రభుత్వం పై విమర్శలు చేసి దిగజారుడు తనం బయట పడిందని ఆయన వ్యాఖ్యానించారు. వేసవి…
వర్ఫ్ బోర్డ్ భూములను పరిరక్షించడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆల్ ఇండియా ముస్లిం మైనార్టీ ఆర్గనైజేషన్ విమర్శించింది. హైదరాబాద్ హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో నిర్వహించిన సమావేశంలో ఆల్ ఇండియా ముస్లిం మైనార్టీ ఆర్గనైజేషన్ చైర్మన్ సయ్యద్ ముక్తర్ హుస్సేన్ తో కలిసి ఉమ్మడి ఏపీ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ఎంఏ సిధ్ధిఖి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో 77 వేల ఎకరాలు ఉన్న వక్స్ భూములు చాలా వరకు కబ్జాలకు…