Ambati Rambabu : చంద్రబాబుకు నన్ను విమర్శించే నైతిక హక్కు లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పల్నాడులోని సత్తెనపల్లి లో మంత్రి అంబటి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు సత్తెనపల్లి లో సభ పెట్టి ముఖ్యమంత్రి జగన్ మీద నా మీద విమర్శలు చేస్తున్నాడన్నారు. చంద్రబాబు కు నన్ను విమర్శించే నైతిక హక్కు లేదని, చంద్రబాబు ను విమర్శించిన వాళ్లను పక్కన పెట్టుకొని మమ్మల్ని విమర్శిస్తున్నాడన్నారు. చంద్రబాబు పదేపదే ఆంబోతు అని విమర్శిస్తున్నాడు చంద్రబాబు ఆంబోతులకు ఆవులను సప్లై చేసేవాడని, మా పార్టీలో పుట్టి పెరిగిన వాళ్ళని సంకన ఎత్తుకొని తిరుగుతున్నాడన్నారు. టీడీపీ సర్వేలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయని, కుప్పంలో చంద్రబాబు గెలవడం కూడ ఈసారి కష్టమన్నారు అంబటి రాంబాబు.
అంతేకాకుండా..’ లోకేష్ యువ గళం అని తిరిగాడు మంగళగిరి కే పరిమితమయ్యాడు. పవన్ కళ్యాణ్ రెండు రోజులు తిరిగితే ఐదు రోజులు జ్వరం వస్తుంది. నా మీద బురద చల్లడానికి బహిరంగ సభలో నామీద విమర్శలు చేశాడు. అసెంబ్లీలో నన్ను ఎదుర్కోలేక నా మీద కక్ష పెట్టుకొని నన్ను సత్తెనపల్లి లో గెలవకుండా చూడాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు చంద్రబాబు. కన్నా లక్ష్మీనారాయణ అనేక పార్టీలు మారాడు రేపు ఓటమి తర్వాత ఎక్కడ ఉంటాడు కూడా తెలియదు. పోలవరం ఎందుకు పూర్తి కాలేదు చంద్రబాబు సమాధానం చెప్పాలి. పోలవరం పూర్తి కాకపోవడానికి చంద్రబాబు కారణం. చంద్రబాబు అసమర్థత వల్లే కక్కుర్తి వల్లే పోలవరం పూర్తి కాలేదు.. చంద్రబాబు పొలిటికల్ డాన్సర్ కాసేపు పవన్ కళ్యాణ్ తో కాసేపు మోడీతో సిపిఎం సిపిఐతో కూడా డాన్సులు వేస్తాడు. నేను సంక్రాంతికి మాత్రమే డాన్స్ వేస్తాను.. మంత్రి అంటే తెలియకుండానే తన కుమారుడు లోకేష్ మంత్రిని చేశాడు చంద్రబాబు. మంత్రి అంటే ఏంటో తెలుసా అని మమ్మల్ని ఎదురు ప్రశ్నలు వేస్తున్నాడు చంద్రబాబు.
Also Read
- Central Cabinet Decision: తెలుగు రాష్ట్రాల్లో 4 లేన్ల రైల్వే ట్రాక్‌లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- Supreme Court: సీజేపీ నిరసనకారుడికి నోటీసు.. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
- YS Jagan: గట్టిగా పోరాడదాం.. జరిగేది కురుక్షేత్ర సంగ్రామం.. స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు!
- Padayatra 2.0: పాదయాత్ర 2.0పై వైఎస్ జగన్ క్లారిటీ!
జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో సత్తెనపల్లిలో రెండవసారి పోటీ చేస్తున్నాను. ఎన్నికల తర్వాత చంద్రబాబు జైలు కు వెళ్లడం ఖాయం మళ్లీ అధికారంలోకి రాబోయే వైసీపీ ప్రభుత్వం. 175 స్థానాల్లో వైసిపి గెలవబోతోంది. పోలవరం ఎందుకు పూర్తి కాలేదో చంద్రబాబు సమాధానం చెప్పాలి. పోలవరం పూర్తి కాకపోవడానికి కారణం చంద్రబాబే. చంద్రబాబు అసమర్థత, కక్కుర్తి వల్లే పోలవరం పూర్తి కాలేదు.. నేను సంక్రాంతికి మాత్రమే డాన్స్ వేస్తాను.. కాని చంద్రబాబు పొలిటికల్ డాన్సర్, కాసేపు పవన్ కళ్యాణ్ తో , కాసేపు మోడీతో , కుదిరితే సిపిఎం సిపిఐతో కూడా డాన్సులు వేస్తాడు.. మంత్రి అంటే తెలియకుండానే తన కుమారుడు లోకేష్ మంత్రిని చేశాడు చంద్రబాబు.. అలాంటి చంద్రబాబు మంత్రి అంటే ఏంటో తెలుసా అని మమ్మల్ని ఎదురు ప్రశ్నలు వేస్తున్నాడు.. ఎన్నికల తర్వాత చంద్రబాబు మళ్ళీ జైలు కు వెళ్లడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో సత్తెనపల్లిలో మళ్ళీ పోటీ చేస్తున్నాను.మళ్లీ అధికారంలోకి రాబోయేది వైసిపి నే … 175 స్థానాల్లో వైసిపి గెలవబోతోంది’ అని అంబటి రాంబాబు అన్నారు.
తాజావార్తలు
-
AI Danger Warning: Anthropic పరిశోధకుడు రాజీనామా.. షాకింగ్ వార్నింగ్.. ఈ దశాబ్దం చివరికి AIతో మానవాళికి ముప్పు?
-
Central Cabinet Decision: తెలుగు రాష్ట్రాల్లో 4 లేన్ల రైల్వే ట్రాక్‌లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
Uday Krishna Reddy : ఉదయ్ కృష్ణారెడ్డికి హైకోర్టు బిగ్ రిలీఫ్.. పొటెన్సీ టెస్ట్‌పై కీలక ఆదేశాలు.!
-
Ayyappa Prasadam: శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం ఇంట్లోనే చేసుకోండిలా!
-
Tollywood Stars : ఆరోగ్యాన్ని పక్కన పెట్టి షూటింగ్స్‌కు పరుగులు ఎందుకు?
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!