మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 24వ బోర్డు సమావేశం ఈ రోజు సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, దీనిని పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తామన్నారు. ప్రాజెక్ట్‌పై పెట్టుబడిదారులు, వాటాదారుల విశ్వాసాన్ని పెంచడానికి మూసీ పరివాహక ప్రాంతాన్ని వేగంగా అభివృద్ధి చేసేవిధంగా కొన్ని ప్రాజెక్టులను గుర్తించాలని ఆమె అధికారులను కోరారు. నిపుణుల కమిటీ, సలహా…
ఈ లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ను 14 సీట్లలో గెలిపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకు తగ్గట్టుగానే వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు రేవంత్ రెడ్డి.. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే సొంత నియోజకవర్గంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో పార్టీ నేతలకు, శ్రేణులకు కీలక సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మహబూబ్‌నగర్ పార్లమెంట్ సీటుపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. తన…
రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రేపటి నుంచి శ్రీ క్రోధి నామ తెలుగు సంవత్సరం ప్రారంభం కానుంది. కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలని, ప్రజల ఆశలు ఆకాంక్షలన్నీ నెరవేరాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలో కాలం కలిసి రావాలని, సమృద్ధిగా వానలు కురిసి, రైతుల రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని ముఖ్యమంత్రి అభిలషించారు. నూతన సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మెరుగైన అభివృద్ధి…
రాష్ట్రంలో తాగునీటి సమస్యకు కాంగ్రెస్ పాలకులే కారణం, ప్రణాళికలు లేనీ వ్యవహారశైలి మూలమని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. ఇవాళ ఆయన నాగర్‌కర్నూలు జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. రిజర్వాయర్ల నీళ్లపై అబద్ధాలు చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వమన్నారు. రాష్ట్రంలో రిజర్వాయర్ల నీటిని సద్వినియోగపరిస్తే పంటలు ఉండేవి కావని, 100 రోజుల పాలనలో తెలంగాణను బ్రష్టు పట్టించిన కాంగ్రెస్ అని ఆయన వ్యాఖ్యానించారు. రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, కల్యాణ లక్ష్మి లేదు, కెసిఆర్ ని తిట్టడం…
గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అధికారంలో నేతన్నల మీద ఉంది శవ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఇవాళ ఆయన రాజన్న సిరిసిల్ల పట్టణం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ప్రెస్ మీట్లో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మేల్యే ఆది శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. నేతన్నల కోసం ప్రయోజనాలు తీసుకున్నది…
తుక్కుగుడా వేదికగా రాహుల్ గాంధీ పంచ్ న్యాయ గ్యారెంటీలు ప్రకటించాడని, సోనియా గాంధీ కూడా అసెంబ్లీ ఎన్నికల ముందు అదే తుక్కుగుడా లో ఆరు గ్యారెంటీ లు ప్రకటించిందన్నారు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. ఇవాళ ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. వంద రోజుల్లో అమలు చేస్తాం అని చెప్పిన కాంగ్రెస్.. హామీల అమలు విఫలం అయ్యిందన్నారు. సోనియా గాంధీ కి తెలంగాణ ప్రజలకు మొహం చూపించలేకే రాహుల్ గాంధీ వచ్చాడన్నారు. రాష్ట్ర మహిళలకు ప్రకటించిన 2500 రూపాయలే ఇవ్వలేక…
సెంటి మెంట్ తో బీఆర్ఎస్ ,బీజేపీ రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి సీతక్క మండిపడ్డారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభంజనం నడుస్తుంది కాబట్టి కొంతమంది వ్యూహరక్తలతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారన్నారు. ప్రశాంత్ కిశోర్ ముందునుంచి మాకు వ్యతిరేఖంగానే ఉన్నారని, రాహుల్ గాంధీ వద్దకు వస్తే ఆయన్ను పక్కన పెట్టారన్నారు. పీకే గతంలో బీఆర్ఎస్ కోసం పనిచేశారని, ఆయన చెప్పింది ఏం కాలేదు..అంతకంటే గొప్పవాళ్లు మాకున్నారన్నారు. బీజేపీ గుడుల గురించి తప్పా బడులగురించి మాట్లాడడం లేదని ఆమె…
ఈనెల 14న తెనాలిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారని, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాలు పరిపాలన సాగించిన జగన్ మోహన్ రెడ్డికి ఈ రాష్ట్ర పరిస్థితులపై ఎప్పటికీ అవగాహన రాలేదన్నారు. వాలంటరీ వ్యవస్థను ఎన్నికల డ్యూటీలో పెట్టవద్దని ఎన్నికల కమిషన్ చెప్పిందన్నారు. కాంట్రాక్టు బేస్ తో పనిచేసేవాళ్లను ఎలక్షన్ కమిషన్ ఎన్నికల్లో వాడదని, గ్రామ…
పల్నాడులోని సత్తెనపల్లి లో మంత్రి అంబటి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు సత్తెనపల్లి లో సభ పెట్టి ముఖ్యమంత్రి జగన్ మీద నా మీద విమర్శలు చేస్తున్నాడన్నారు. చంద్రబాబు కు నన్ను విమర్శించే నైతిక హక్కు లేదని, చంద్రబాబు ను విమర్శించిన వాళ్లను పక్కన పెట్టుకొని మమ్మల్ని విమర్శిస్తున్నాడన్నారు. చంద్రబాబు పదేపదే ఆంబోతు అని విమర్శిస్తున్నాడు చంద్రబాబు ఆంబోతులకు ఆవులను సప్లై చేసేవాడని, మా పార్టీలో పుట్టి…
పర్యాటక నగరం విశాఖలో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి.. మాడు పగిలే ఎండకు నగర వాసులతో పాటు పర్యాటకులు కూడా ఇళ్ల నుండి హోటల్స్ నుండి బయటకు వచ్చే సాహసం చేయలేకపోతున్నారు.. వేడి వడగాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.. సాధారణ రోజుల కంటే వీకెండ్స్ ఆదివారాల్లో రద్దీగా ఉండే రోడ్లన్నీ బోసిపోయాయి.. ఉదయం 8-9 గంటల నుండే సూర్యుడు సూర్యుడు సుర్రు మనిపిస్తున్నాడు.. విశాఖలో భగ్గుమని మండుతున్న ఎండల తీవ్రంగా ఉన్నాయి. శనివారం ఏడు జిల్లాలలో దాదాపుగా 45…