విశాఖలో చికెన్ ధరలు అమాంతంగా పెరిగిపోయాయి.. వారం రోజుల వ్యవధిలో 50 రూపాయలు పెరిగి ట్రిపుల్ సెంచరీ వైపు పరుగులు పెడుతుంది.. సాధారణంగా వేసవికాలంలో చికెన్ ధరలు నేలచూపు చూసేవి కానీ ఈ సారి మాత్రం భిన్నంగా చికెన్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి… దీని గల కారణం చికెన్ కు డిమాండ్ ఉన్న దానికి తగ్గ సప్లై లేకపోవడమే అని వ్యాపారులు చెబుతున్నారు.. మరోవైపు పెరిగిన చికెన్ ధరలతో సామాన్యులు ముక్కున వేలేసుకుంటున్నారు.. కేజీ రెండు కేజీలు కొనే వారు 1/2 కేజీ పావు కేజీ తో సరిపెట్టుకుంటున్నారు… రానున్న రోజుల్లో రూ.350 వరకు కూడా వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు వ్యాపారులు..
ఇదిలా ఉంటే.. గ్రేటర్ హైదరాబాద్, విజయవాడలో చికెన్ రేటు కేజీ.. రూ.300 నుంచి 320 వరకు పలుకుతోంది.. లైవ్ కోడి ధర రూ.220 నుంచి రూ.250 వరకు విక్రయిస్తున్నారు. ఇక నాటు కోడి కేజీ రూ.500 వరకు విక్రయిస్తున్నారు. కోడి గుడ్డు ఒక్కొక్కటి రూ. 6 వరకు విక్రయిస్తున్నారు. పెరిగిన ఎండలతోపాటు, దాణ రేట్లు పెరగడం.. ఉత్పత్తి తగ్గడంతో చికెన్ ధరలు కొండెక్కినట్లు పేర్కొంటున్నారు. ఏప్రిల్ నెలలోనే ఇదే పరిస్థితి ఉంటే.. మే, జూన్ నెలల్లో చికెన్ రేట్లు అమాంతం పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొంటున్నారు.