తెలంగాణ భవన్లో కార్మికులను ఉద్దేశించి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన బ్రతుకు బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి అని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో మర్చిపోయి కూడా లంగలకు, దొంగలకు ఓట్లు వేయొద్దని ఆయన కోరారు. హృదయం లేని మనిషి ప్రధాని మోడీ అని ఆయన విమర్శించారు. కార్పొరేట్లకు 14 లక్షలు కోట్లు మాఫీ చేశాడు. ఇది తప్పని బండి సంజయ్, కిషన్ రెడ్డి నిరూపిస్తే నేను రాజీనామా చేస్తానని, మోడీ కార్పొరేట్ దోస్త్ లకు…
జగిత్యాల జిల్లా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో జన జాతర సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఉత్తర తెలంగాణకే అనేక సందర్భాల్లో రాజకీయ సలహాలతొ పాటు ప్రజా సమస్యల పై పోరాట మార్గాన్ని ఇచ్చిన పెద్దలు జీవన్ రెడ్డిని నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గా గెలిపించండన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని ఆయన అన్నారు. 30 సంవత్సరాల తరువాత బీజేపీ ఎవరి సహకారం లేకుండా…
నల్లగొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. గల్లీ నుండి నన్ను ఢిల్లీ వరకు పంపిన మీకు నా చర్మం వలిచి చెప్పులు కుట్టించినా తక్కువే అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల కోసం నా ప్రాణాలైన ఇస్తానని మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. నాకు కొడుకు లేడు.. మీరే నా వారసులు అని, సీఎం వద్ద ఏ పని కావాలన్నా నేను…
Operation Chirutha: శంషాబాద్ ఎయిర్పోర్టు రన్వేపై చిరుత కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆపరేషన్ చిరుత నాలుగురోజుకు చేరింది.
‘‘రేవంతన్నా… నేను 6 గ్యారంటీల సంగతేమైందని అడిగితే… గుండు, అరగుండ అంటూ హేళనగా మాట్లాడతవా? 5 ఏళ్లలో నేను చేసిన పోరాటాలు, కరీంనగర్ అభివ్రుద్ధికి తెచ్చిన నిధులు నీ కళ్లకు కన్పించడం లేదా?’’అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి వాడుతున్న భాషను చూసి జనం అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. ‘‘మీరెన్ని డ్రామాలాడినా, ఎంతగా హేళన చేసినా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ వచ్చే సీట్లు గుండు సున్నా’’అని…
కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి క్లియర్ గా చెబుతున్నారు కొత్తగూడెం జిల్లా తీస్సివేయాలని అంటున్నారని, కొత్తగూడెం జిల్లా వుండాలంటే బీఆర్ఎస్ గెలవాలన్నారు. కాంగ్రెస్కు సురుకు పెట్టాలన్నారు. అడ్డగోలుగా వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ అని కేసీఆర్ మండిపడ్డారు. ఈ రోజు కరెంట్ రావడం లేదని, రెప్ప పాటు పోకుండా నేను ఇచ్చాననన్నారు. దొంగతోపు గ్రామానికి కరెంట్ మా హాయం లో ఇచ్చానని, కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో అతి ఎక్కువ పోడు పట్టాలు…
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. జగదేవ్ పూర్లో ఇవాళ హరీష్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ ఇంటిపై వాలిన కాకి మా ఇంటిపై వాలొద్దు అని రేవంత్ రెడ్డి అన్నారని, చెవేళ్ళలో రంజిత్ రెడ్డి, మల్కాజిగిరి లో సునీతా, వరంగల్ లో కడియం కావ్య, సికింద్రాబాద్ లో దానం నాగేందర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు ఎక్కడి నుంచి వచ్చారన్నారు. కాకులు వాలనీయను అని చెప్పి గద్దలను ఎత్తుకు వెళ్లినవ్యక్తి రేవంత్ రెడ్డి అని…
వికారాబాద్ జిల్లా తాండూరు డిపోలో శ్రామిక్గా పనిచేస్తోన్న టి.రాజప్ప ఆత్మహత్యపై వస్తోన్న వార్తలు పూర్తి అవాస్తవమని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. ఆయన ఎక్స్ వేదికగా.. ‘ఆర్టీసీ అధికారులు వేధించడం వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారనడంలో ఏమాత్రం నిజం లేదు. ఈ నిరాధారమైన వార్తలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఖండిస్తోంది. 2013లో డ్రైవర్గా ఆర్టీసీలో చేరిన రాజప్ప.. ఆరోగ్య సమస్యల కారణంగా అన్ఫిట్ అయ్యారు. 2018 నుంచి శ్రామిక్ గా డిపోలో పనిచేస్తున్నారు. గత నెలలో అధికారులకు…
భూపాలపల్లి జిల్లా రేగొండ జన జాతరలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రొఫెసర్ జయశంకర్ సార్ గ్రామాన్ని కెసిఅర్ ప్రభుత్వం చేయలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి రాగానే రెవెన్యూ గ్రామము చేసి మన చిత్త శుద్దిని చాటుకున్నామన్నారు. సెమీ ఫైనల్ లో ఆరోజు కేసీఆర్ను ఓడించి బుద్ధి చెప్పామని, ఈ ఫైనల్ లో గుజరాత్ నుండి వచ్చిన మోడీ నీ ఒడగొట్టాలన్నారు. ఈ గడ్డ పైనా…
ఒక వ్యక్తి కారు బైక్ లో పెట్టకుండా తన చొక్కాలు 20 లక్షల నగదు 27 తులాల బంగారం తీసుకుని వెళ్ళవచ్చా ఏమో కానీ ఈ యువకుడు తన చొక్కాలో దాచిపెట్టుకొని అంత పెద్ద మొత్తంలో డబ్బుని తీసుకు వెళుతు వుండగా పోలీసులు పట్టుకున్నారు.పుష్ప సినిమా తరహాలో డబ్బులని చొక్కల్లో దాచుకున్న యువకుడు పట్టుబడిన వైనం ఇది. ఖమ్మం జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్లో పరిధిలో ఘటన జరిగింది. గత రాత్రి పోలీసులు తనిఖీలు చేస్తుంటే ఒక…