సూర్యాపేట జిల్లా మోతె, నడిగూడెం మండల కేంద్రాల్లో నల్గొండ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనతో పాటు నల్గొండ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చందర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ మతాన్ని అడ్డుపెట్టుకుని విద్వేషాలను సృష్టిస్తుందని, బీజేపీకి మరో అవకాశం ఇస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్లకు తూట్లు పడతాయని…
Operation Chirutha: శంషాబాద్ ఎయిర్పోర్టు రన్వేపై చిరుత కలకలం సృష్టిస్తోంది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆపరేషన్ చిరుత 5వ రోజుకు చేరింది. దీంతో ఎయిర్ పోస్టు పరిసర ప్రాంతాల్లో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల పాటు నిషేధం విధించింది. ఈ చర్యలు నేటి రాత్రి 8గంటల నుంచి అమల్లోకి రానున్నాయి. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సీరియస్ అయిన ఎన్నికల సంఘం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల సిరిసిల్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు అందడంతో పరిశీలించిన అనంతరం ఎన్నికల సంఘం ఈ మేరకు…
మహబూబాబాద్ రోడ్డు షో లో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ నా మీదా నిషేధం పెట్టిందని, మారుమూల ప్రాంతం అయిన మహుబాబాద్ అభివృద్ధి కోసం మహబూబాబాద్ ను జిల్లా చేసుకున్నామన్నారు. ఈ ప్రభుత్వం మాహుబాబాద్ జిల్లా ను తీసేస్తా అని చెబుతుందన్నారు కేసీఆర్. మహబూబాబాద్ జిల్లా ను సీఎం తిషేస్తా అంటున్నాడని, మహబూబాబాద్ జిల్లా ఉండాలి అంతే మలోతు కవిత ను గెలిపించాలనన్నారు. కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి…
ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతాలపై .. స్పష్టంగా మాట్లాడానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం ద్వారా వచ్చిన రిజర్వేషన్లు రద్దు చేయాలని మూల సిద్ధాంతమని, ఆర్ఎస్ఎస్ రాజకీయ కార్యచరణ పేరే బీజేపీ అని ఆయన అన్నారు. బీజేపీ ని అడ్డుపెట్టుకుని రిజర్వేషన్లు రద్దు చేయించాలి అనేదే అజెండా అని, దేశ స్థాయిలో చర్చ కు రావడం తో.. బీజేపీ కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తోందన్నారు. దాంట్లో భాగంగానే.. ఢిల్లీలో కేంద్ర హోం శాఖ ఫిర్యాదు చేసి అక్రమ…
బీఆర్ఎస్ పార్టీ కి మరో ఎదురు దెబ్బ తగిలింది. వరుసగా పార్టీ నుంచి నేతలు వెళ్ళిపోతున్నా వేళ మరో ముఖ్యనేత కూడా బీఆర్ఎస్ను వీడారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లనున్నారు. అయితే.. ఈ రోజు ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవల ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి ద్వారా ఇంద్రకరణ్ రెడ్డితో కాంగ్రెస్ అధిష్టానం మంతనాలు జరుపుతోంది. ఇంద్రకరణ్ రెడ్డి పెద్దన్న చనిపోవడంతో పరామర్శించేందుకొచ్చారు సుదర్శన్రెడ్డి. ఆ…
కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ నీ, రాజ్యాంగాన్ని ఏ విధంగా అవహేళన చేసిందో మోడీ ప్రజల ముందు పెట్టారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. వారం రోజులు నుండి రేవంత్ రెడ్డీ కి ఏమయిందో ఏమో కానీ ఆయన వ్యవహార శైలి ఆందోళన కరంగా ఉందన్నారు. అయన నిజస్వరూపం తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారని, రేవంత్ రెడ్డి పరిస్థితి దిగజారింది.. అపరిపక్వంగా , అహంకారం తో మాట్లాడుతున్నారన్నారు. సీఎం…
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల కోసం ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే.. ప్రచారంలో ప్రత్యర్థులు విమర్శలు, ప్రతివిమర్శలు గుప్పించుకుంటున్నారు నేతలు. అయితే.. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఈసీ చర్యలకు దిగుతోంది. ఈ నేపథ్యంలోనే.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల పాటు నిషేధం విధించింది. ఈ చర్యలు నేటి రాత్రి 8గంటల నుంచి అమల్లోకి రానున్నాయి. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ అనుచిత…
ఉప్పల్ స్టేడియం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఇవాళ ఉప్పల్ స్టేడియంలో సిబ్బంది మెరుపు ధర్నాకు దిగారు. దీంతో.. రేపటి మ్యాచ్ పై నీలినీడలు అలుముకున్నాయి. తమకు బోనస్, ఇంక్రిమెంట్లు ఇవ్వడం లేదని సిబ్బంది ఆరోపణ చేస్తూ ధర్నాకు దిగారు. కాంప్లిమెంటరీ పాసులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ కు ముందు ఉప్పల్ స్టేడియంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. స్టేడియంలో గ్రౌండ్ స్టాఫ్ సహా 94 మంది…
వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేటలో నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశంలో కడియం శ్రీహరి, ఎంపీ అభ్యర్థి కావ్య, ఎమ్మెల్యే నాగరాజు, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఅర్ఎస్, బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని ఆయన అన్నారు. రాజకీయంగా కడియం కావ్య ఎదురుకోలేకనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయారని ఆయన వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు కడియం కావ్యను…