సిద్దిపేటకి కేసీఆర్, హరీష్ రావు ఏం చేశారని రేవంత్ చెబుతున్నారని, కళ్ళుండి సీఎం రేవంత్ రెడ్డి చూడలేకపోతున్నారా అర్థం కావట్లేదన్నారు హరీష్ రావు. జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి అవార్డులు లేకుండా సిద్దిపేట లేదని, సిద్దిపేట అభివృద్ధి కాలేదని సీఎం రేవంత్ పచ్చి అబద్దాలు మాట్లాడారన్నారు హరీష్. తెలంగాణ రావడానికి కారణం కేసీఆర్, సిద్దిపేట గడ్డ అని, రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడంటే కారణం సిద్దిపేట అని ఆయన హరీష్ రావు అన్నారు. తెలంగాణ రాకపోతే రేవంత్…
దేశంలో 2014కి ముందు 2014 తరవాత అన్నట్టు చూడాలని ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నల్లధనం తీసుకు వస్తా అని.. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా నని హామీలు ఇచ్చి మోసం చేశారని, భారతీయ జుమ్లా పార్టీ గా మారింది బీజేపీ అని ఆయన మండిపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే దేశ ద్రోహి అని ముద్ర వేస్తున్నారని మధు యాష్కీ విమర్శించారు. కరోనా వస్తే మోడీ దీపాలు…
అంబేడ్కర్ స్పూర్తితో మోడీ పాలన సాగిస్తున్నారని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. మరోసారి అధికారంలోకి వచ్చాక గ్రామ గ్రామానికి రాజ్యాంగాన్ని తీసుకెళ్తాం.. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు కిషన్ రెడ్డి. అంబేడ్కర్ పంచ తీర్థ స్థలాలను అభివృద్ధి చేశామని, పార్లమెంట్ లో తొలిసారి అంబేడ్కర్ ఫోటో పెట్టింది అటల్ జీ.. బీజేపీ అని ఆయన అన్నారు. ఇక్కడ కూడా అంబేడ్కర్ ఫోటో పెట్టాలని ధర్నాలు చేసి.. లాఠీలతో కొట్టించారని, సబ్ కా సాథ్.. సబ్…
కొమురం భీం జిల్లాలోని నిర్వహించిన సభలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఈనెల 5 వ తేదీన నిర్మల్ కు రాహుల్ గాంధీ వస్తున్నారని, బహిరంగ సభలో రాహుల్ పాల్గొంటారన్నారు. ఆసిఫాబాద్ లో సిఎం రేవంత్ రెడ్డి సభ సక్సెస్ అయిందని, అనేక ప్రాజెక్టులు , రోడ్లు ఇతర సమస్యల పై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. బీజేపి సిద్దాంతమే మనుధర్మంది అని, మేము చెప్పేది ప్రజల్లోకి వెళ్ళిందన్నారు మంత్రి సీతక్క. బీజేపి…
తిరుమలలో భారీ వర్షం.. చల్లబడిన వాతావరణం తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఎక్కడ చూసినా 45 డిగ్రీలు, 46 డిగ్రీలు నమోదవుతోంది. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాలంటేనే జనం జంకుతున్నారు. మండే ఎండలతో వడగాలులకు వడదెబ్బ తాకి జన ప్రాణాలు కోల్పోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా ఉంటే.. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల కొండల్లో జోరు వాన పడింది. భారీ వర్షం పడడంతో వాతావరణం చల్లబడింది. తిరుపతి దేవస్థానం…
మండుటెండలో సుడిగాలి పర్యటన చేస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ… కేసీఆర్ బస్సు యాత్రకు అన్యుహ్య స్పందన వస్తుందని 12 సీట్లలో బీఆర్ఎస్ గెలుస్తుందని నివేదికలు రావటంతో బీజేపీ-కాంగ్రెస్ కుమ్మక్కై కేసీఆర్ 48 గంటలు ప్రచారాన్ని అడ్డుకుంటున్నారన్నారు. 5 నెలల్లో రేవంత్ పరిపాలన చూసి కేసీఆర్ని ఎందుకు వదులుకున్నాం అని నేడు ప్రజలు బాధపడుతున్నారన్నారు. కేసీఆర్…
కొమురంభీం జిల్లాలో నిర్వహించిన జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆదివాసీలపై బీజేపీ, బీఆర్ఎస్ లకు ప్రేమ లేదన్నారు. ఆదివాసీల సమస్యల్ని పట్టించు కోలేదని ఆయన మండిపడ్డారు. సోయం బాపూరావు సమస్యలు పరిష్కరించాలని బీజేపీ కేంద్ర మంత్రుల చూట్టూ తిరిగినా పట్టించు కోలేదని, ఆఖరికి బీజేపీ సిట్టింగ్ ఎంపీ అయిన సోయం బాపు రావు కు టికెట్ ఇవ్వకుండా అవమానించిందని ఆయన విమర్శించారు. ఆత్రం సుగుణకు అవకాశం…
బండి సంజయ్ పై కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ఫైర్ అయ్యారు. ఇవాళ వెలిచాల రాజేందర్ మాట్లాడుతూ.. బండి సంజయ్.. పిచ్చి ప్రేలాపనలు, కట్టుకథలు మానేయండని ఆయన వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్ రావు ఎవరో కూడా నాకు తెలియదని, నేనెప్పుడూ ఆయన్ని కలవలేదు… అలాంటప్పుడు ఆయనెలా నాకు టికెట్ ఇప్పిచే ప్రయత్నం చేస్తారన్నారు వెలిచాల రాజేందర్. ఎన్నికల నేపథ్యం లో బండి సంజయ్ చెబుతున్న కట్టు కథలు అని, అశోక్ రావు…
బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందం చేసుకొని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలే స్వయంగా ఈ పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి పార్టీకి ఓటు వేయాలని చెప్పడం విడ్డూరంగా ఉందని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక మర్చిపోయారన్నారు బాల్క సుమన్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ మీటింగ్ పెట్టిన ప్రజలు స్వాగతిస్తున్నారని, ప్రజాదరణ పొందుతున్న మాజీ…
ఈ నెల 5 న అమిత్ షా, 6న జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించనున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రచార షెడ్యూల్ను బీజేపీ విడుదల చేసింది. 5న ఉదయం 11:30 గంటలకు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సిర్పూర్ కాగజ్నగర్ లో బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు నిజామాబాద్ పార్లమెంట్ నిజామాబాదులో బహిరంగ సభకు విచేస్తారు. సాయంత్రం 4 గంటలకు మల్కాజ్ గిరి లోక్ సభ ఎన్నికల ప్రచారంలో…