MP K.Laxman : మోడీ నేతృత్వంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీదర్ పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కేంద్ర మంత్రి భగవంత్ కుభా తరుపున ప్రచారంలో భాగంగా పార్లమెంట్ పరిధిలోని చించోలి తాలూకా కుంచవరం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు బీజేపీ ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ ఎంపి డా. లక్ష్మణ్. ఈ సందర్భంగా ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. బీదర్ పార్లమెంట్ నుండి రెండో సారి గెలిచి మోది అండతో భగవత్ కూభా కేంద్ర మంత్రి అయ్యారని, కేంద్ర మంత్రి అయ్యాక కర్ణాటక తో పాటు తెలుగు వారికి కూడా సేవలు అందించిన వ్యక్తి భగవత్ కూబా అని ఆయన అన్నారు. దక్షిణ భారతదేశంలో రైతులకు ఎరువులపై సబ్సిడీ ఇచ్చి ఆదుకున్న గొప్ప వ్యక్తి భగవత్ కూబా.. వ్యవసాయం చేసే కవులు రైతులతో సహా అందరూ లాభ పడేలా సహకారం అందించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలో తెలంగాణ రామగుండంలో ఎరువుల పరిశ్రమను కూచివేసిందని, భగవత్ కూభా ఎరువుల మంత్రిగా నియమితులయ్యాకా తిరిగి రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునఃప్రారంభించారని ఆయన వెల్లడించారు.
అంతేకాకుండా..’మూడో సారి బీదర్ పార్లమెంట్ నుండి ఎంపీ బరిలో దిగిన భగవత్ కూభా మరో సారి గెలిచి పార్లమెంట్ కి వెళ్ళబోతున్నారు.. మోడీ నేతృత్వంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగింది.. మోడీ గ్యారెంటీ అంటే గ్యారంటీగా జరిగే గ్యారెంటీ.. కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తుంది.. కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక అవినీతి కుంభకోణాలు జరిగాయి.. ఒక్క అవినీతి కుంభకోణం కూడా లేకుండా పదేళ్లుగా మోది పరిపాలన కొనసాగింది.. దేశ ప్రజలే తన కుటుంబ సభ్యులుగా మోది పరిపాల చేస్తున్నాడు.. కానీ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కుటుంబం కోసం పని చేస్తుంది.. కర్ణాటకలో గ్యారెంటీల పేరుతో అధికారం చేపట్టారు.. అధికారం చేపట్టాక గ్యారెంటీల ఊసే లేదు.. ఓడ దాటే వరకు ఓడ మల్లయ్య.. ఓడ దాటాక బోడి మల్లయ్య అన్నట్లుంది కాంగ్రెస్ వ్యవహారం.. అలాగే తెలంగాణలో కూడా అమలుకు వీలు కానీ హామీలు ప్రకటించి కాంగ్రెస్ అధికారం చేపట్టింది.. ఇప్పుడు ఆ హామీలు అమలు కావాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని మాట్లాడుతున్నారు.. హామీల విషయంలో కాంగ్రెస్ మోకాలుకు బోడి గుండుకు ముడి పెడుతుంది.. గ్యారెంటీల విషయంలో మోది ప్రభుత్వం మాత్రమే గ్యారంటీగా నెరవేరుస్తుంది.. కర్ణాటక ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి బుద్ది చెప్పాలి.. ప్రపంచం గర్వించే గొప్ప వ్యక్తి మన ప్రధాని మోడీ.. మీరు భగవత్ కుబా కు వేసే ప్రతి ఓటు మోది కె వెళ్తుంది.. బీజేపీ కి ఓటు వేసి మోది నీ గెలిపిద్ధాం..’ అని ఎంపీ లక్ష్మణ్ అన్నారు.
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!