బీఆర్ఎస్ పార్టీ కి మరో ఎదురు దెబ్బ తగిలింది. వరుసగా పార్టీ నుంచి నేతలు వెళ్ళిపోతున్నా వేళ మరో ముఖ్యనేత కూడా బీఆర్‌ఎస్‌ను వీడారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లనున్నారు. అయితే.. ఈ రోజు ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవల ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి ద్వారా ఇంద్రకరణ్ రెడ్డితో కాంగ్రెస్ అధిష్టానం మంతనాలు జరుపుతోంది. ఇంద్రకరణ్ రెడ్డి పెద్దన్న చనిపోవడంతో పరామర్శించేందుకొచ్చారు సుదర్శన్‌రెడ్డి. ఆ సమయంలో కాంగ్రెస్ లో చేరికపై చర్చలు జరిపినట్టు సమాచారం. దీనికి ఇంద్రకరణ్ రెడ్డి సానుకూలంగా స్పందించారని.. కాంగ్రెస్ లో చేరేందుకు ఆయన అంగీకరించినట్టు సన్నిహితులు గతంలోనే చెప్పారు. కాంగ్రెస్ లో ఎప్పుడు చేరేది త్వరలో ప్రకటిస్తారని అంటున్నారు. ఇప్పటికే సన్నిహితులతో, ద్వితీయ శ్రేణి నాయకులతో సమావేశమై ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిక గురించి చర్చించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండుసార్లు మంత్రిగా పనిచేశారు ఇంద్రకరణ్ రెడ్డి..
2014లో జరిగిన ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి హరిరావుపై 10 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొంది, 14వ లోక్‌సభ(Lok Sabha) లో అడుగుపెట్టారు ఇంద్రకరణ్ రెడ్డి. ఆ తర్వాత డీఆర్ఎస్‌లో చేరారు. 1980 నుంచి క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతున్న ఇంద్రకరణ్ రెడ్డి.. జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా కూడా కొనసాగారు. 1991 నుంచి 1996వరకు ఎంపీగాను, 1999 నుంచి 2004 వరకు 11వ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడిగా 2004 నుంచి 2008 వరకు ఉమ్మడి ఏపీ ఎమ్మెల్యేగా, 2008 నుంచి 2009 వరకు 14వ లోక్‌సభ సభ్యుడిగా, 2014 నుంచి 2018 వరకు తొలి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడిగా, 2018 నుంచి రెండోసారి తెలంగాణ శాసనసభ సభ్యుడిగా మంత్రిగా చేశారు.