గత 25 ఏళ్లుగా మెదక్ పార్లమెంటు బీజేపీ, బీఆర్ఎస్ చేతిలో నలిగిపోయిందని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ నర్సాపూర్‌లో నిర్వహించిన జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అందుకే రాహుల్ గాంధీ నీలం మధుని మెదక్ నుంచి బరిలో నిలిపారని, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుని దుబ్బాకలో బండకేసి కొడితే ఇక్కడికి వచ్చారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ అభ్యర్థి మల్లన్నసాగర్ లో…
పార్టీ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం, సమాజాన్ని కులం, భాష పేరుతో విభజన చేయాలనే ఆలోచనతో కాంగ్రెస్ ఉందని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ విమర్శించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విచ్ఛిన్న కర శక్తులకు ఆ పార్టీ టిక్కెట్లు కూడా ఇచ్చిందని ఆయన మండిపడ్డారు. మత ప్రాతిపదికన దేశ విభజనకు కారణం కాంగ్రెస్ చర్యలు అని ఆయన ఆరోపించారు. దేశ ప్రతిష్టను దిగజార్చే విధంగా రాహుల్ గాంధీ తో పాటు ఆ పార్టీ నాయకులు విదేశాల్లో మాట్లాడారని,…
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ తిరుమల గార్డెన్లో సీపీఐ కార్యకర్తల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గా గెలవడానికి సహకరించిన మీ అందరికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇప్పటికే మద్దతు కోరుతూ సిపిఐ నేతలను కలిశారని, భవిష్యత్ లో హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి సిపిఐ కాంగ్రెస్ మధ్య ఎలాంటి బిఫభిప్రాయాలు ఉండవని ఆయన తెలిపారు.…
కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన “నోట్లతో నిండిన టెంపో” వ్యాఖ్యలకు ధీటుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు గురువారం మాట్లాడుతూ.. డీ-మానిటైజేషన్ విఫల ప్రయత్నమని ప్రధాని మోదీ భావిస్తున్నారా? అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఇటీవల తెలంగాణలో పర్యటించిన సమయంలో కాంగ్రెస్‌కు అదానీ, అంబానీలు టెంపోల నిండుగా డబ్బు పంపుతున్నారని ప్రధాని మోదీ అన్నారని, ఆయన మాట ప్రకారం కాంగ్రెస్‌కి వాళ్లు అంతగా డబ్బు పంపుతుంటే ఈడీ, సీబీఐ, ఐటీలు ఎందుకు మౌనంగా ఉన్నాయని…
ఏప్రిల్ 26 నుంచి 29 వరకు నాలుగు రోజుల పాటు నిర్వహించిన సిటీ నేచర్ ఛాలెంజ్-2024లో పాల్గొన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాలు, పట్టణాల్లో హైదరాబాద్ వరుసగా రెండోసారి అగ్రస్థానంలో నిలిచింది. హైదరాబాద్ 2023లో ఈ ఈవెంట్లో పాల్గొనడం ప్రారంభించింది. దేశంలో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉండగా, ఉత్తరాఖండ్‌లోని నానక్‌మట్ట దేశంలో రెండవ స్థానంలో నిలిచింది. 670కి పైగా నగరాలు మరియు పట్టణాలు వార్షిక గ్లోబల్ ఈవెంట్లో పాల్గొనే హైదరాబాద్ హాంకాంగ్ తర్వాత ఆసియాలో రెండవ స్థానంలో ఉంది…
నిజామాబాద్ ఆర్మూర్ కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వంద రోజుల్లో చక్కెర కర్మాగారం తెరిపిస్తామని కల్వకుంట్ల కవిత పోటీ చేశారని, చక్కెర కర్మాగారం తెరవకపోవడంతో నమ్మించి మోసం చేసినందుకు 2019లో వంద మంది నామినేషన్లు వేశారన్నారు. 2019 లో ఒక గుండు బాండ్ పేపర్ రాసి ఇచ్చాడని, ఎంపీగా గెలిచిన ఐదు రోజుల్లో పసుపు బోర్డు తీసుకువస్తానని బాండ్ పేపర్ రాసి ఇచ్చాడంటూ సీఎం రేవంత్…
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చిందని, ఒక ఉచిత బస్సు తప్ప మిగతా ఏవి అమలు కాలేదన్నారు బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్. ఇవాళ ఆయన మెదక్‌లో మాట్లాడుతూ.. రైతు బంధు వచ్చిందా..? రుణమాఫీ అయ్యిందా..? కరెంట్ సరిగా వస్తుందా..? అని ఆయన ప్రశ్నించారు. తొమ్మిదేళ్లు సరిగా వచ్చినటువంటి కరెంట్ ఎక్కడికి పోయింది..? అని ఆయన మండిపడ్డారు. విద్యార్థులకు 5 లక్షల కార్డు…ఫ్రీ బస్సు పెట్టి ఆటో కార్మికుల పొట్ట కొట్టారని, ఐదు నెలల్లో…
పార్లమెంట్ ఎన్నికలకు ముందు కర్ణాటక నుంచి అత్యవసరంగా విడుదల చేసిన 2.25 టీఎంసీల నీటిని రాష్ట్ర ప్రభుత్వం దక్కించుకుంది . రాబోయే నీటి ఎద్దడిని ఊహించి, తీవ్రమైన కొరత పరిస్థితులలో ఎగువ కృష్ణా ప్రాజెక్టుల నుండి నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులు మార్చిలో కర్ణాటక ప్రభుత్వానికి అభ్యర్థన చేశారు. తమ అభ్యర్థనకు కర్ణాటక కౌంటర్లు సానుకూలంగా స్పందించి బుధవారం నారాయణపూర్ డ్యాం నుండి నీటిని విడుదల చేయడం ప్రారంభించారు. కర్ణాటకలో విడుదల చేసిన నీరు 167…
బీజేపీనీ గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు… మేము వారి దగ్గర వెళ్తే అదే మాట చెబుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. రిజర్వేషన్ ల ద్వారా లబ్ధి పొందుతున్న వారే బీజేపీ కి ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్ తప్పుడు ప్రచారం నమ్మడం లేదు… నవ్వుకుంటున్నారని, ఎవరు కూడా ఆందోళన లు చేయలేదన్నారు కిషన్ రెడ్డి. సీఎం బాధ్యతారాహితమైన కామెంట్… శాంతి భద్రతలకు భంగం కలిగే విధంగా మాట్లాడారని, మోడీ నాయకత్వాన్ని విశ్వసిస్తున్నారు…
బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అరెస్ట్ అప్రజాస్వామికమని, ఆయనను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు డిమాండ్ చేశారు. యూనివర్సిటీ హాస్టళ్లకు వేసవి సెలవులు, మెస్‌లకు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ జారీ చేసిన నకిలీ సర్క్యులర్‌ను పోస్ట్ చేసిన ఆరోపణలపై క్రిశాంక్‌ని అరెస్టు చేశారు. బుధవారం క్రిశాంక్‌ను కలిసిన అనంతరం చంచల్‌గూడ జైలు వెలుపల మీడియా ప్రతినిధులతో మాట్లాడిన రామారావు, తనను వేధించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం క్రిశాంక్‌పై…