The Paradise: నాని కోసం రూల్స్ బ్రేక్ చేశాను.. శ్రీకాంత్ ఓదెల ఎమోషనల్ ట్వీట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద ఒక సెన్సేషన్. ‘దసరా’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన ఈ ద్వయం, ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ (The Paradise) కోసం మళ్లీ జతకట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా మేకింగ్ విషయంలో నాని తనపై ఉంచిన అపారమైన నమ్మకం గురించి శ్రీకాంత్ ఓదెల తాజాగా చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. నాని తనపై పెట్టిన నమ్మకమే తనను ప్రతి క్షణం కష్టపడేలా చేస్తోందని శ్రీకాంత్ భావోద్వేగానికి గురయ్యారు.
Also Read : Anupama: కార్తికేయ 2 సెట్‌లో చేదు అనుభవం.. అసిస్టెంట్ చెప్పిన మాటతో అనుపమకు వాంతులు!
Also Read
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
శ్రీకాంత్ ఓదెల తన ట్విట్టర్ (X) ఖాతాలో నానిని ఉద్దేశించి.. ‘నాని అన్న.. నువ్వు ఏదైనా అడిగినప్పుడు ‘నీ ఇష్టం శ్రీకాంత్’ అని అన్న ప్రతిసారీ.. నాకు అది ‘శ్రీకాంత్ నిన్ను నేను నమ్ముతున్నాను’ అన్నట్లుగా వినిపిస్తుంది. ఆ నమ్మకమే నన్ను ప్రతి సెకను భయపెడుతోంది. అందుకే ‘ది ప్యారడైజ్’ కోసం నా రక్తాన్ని, ఆత్మను ధారపోస్తున్నాను’ అని పేర్కొన్నారు. ఈ సినిమా కోసం నాని కెరీర్‌లో ఎప్పుడూ లేని విధంగా కొన్ని నిబంధనలను పక్కన పెట్టాల్సి వచ్చిందని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.. ‘ఈ సినిమా కోసం నేను నీ సినిమా రూల్స్ అన్నింటినీ బ్రేక్ చేశాను. నీ వర్కింగ్ డేస్ ప్యాటర్న్‌ను మార్చేశాను.. అంతెందుకు నీ రిలీజ్ డేట్ ప్లానింగ్‌ను కూడా మార్చాల్సి వచ్చింది. అయినా సరే నువ్వు నాపై చూపిస్తున్న ఆ నమ్మకం నన్ను మరింత బాధ్యతగా ఉంచుతోంది’ అంటూ శ్రీకాంత్ తన మనసులోని మాటను బయటపెట్టారు. ఈ పోస్ట్‌తో నాని – శ్రీకాంత్ మధ్య ఉన్న బాండింగ్‌ను చూసి మెగా ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. నాని లాంటి స్టార్ హీరో ఒక యంగ్ డైరెక్టర్‌కు ఇంతటి ఫ్రీడమ్ ఇవ్వడం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. దసరాను మించిన మాస్ యాక్షన్ డ్రామాగా ‘ది ప్యారడైజ్’ ఉండబోతోందని ఈ ట్వీట్‌తో స్పష్టమవుతోంది.
Nani Anna,
Nuvvu "Ni istam Srikanth" ani anna prathisari I hear "I trust you Srikanth"
And that trust scares me, every single second to give my blood and soul to The Paradise.
I broke your every rule of cinema.
I broke your working days pattern…
I broke your release date… pic.twitter.com/p7Z1pFKrx8
— Srikanth Odela (@odela_srikanth) February 24, 2026
తాజావార్తలు
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!