MP K. Laxman : ఒక వర్గం ఓట్ల కోసమే సనాతన ధర్మాన్ని విమర్శిస్తున్నారు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్టీ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం, సమాజాన్ని కులం, భాష పేరుతో విభజన చేయాలనే ఆలోచనతో కాంగ్రెస్ ఉందని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ విమర్శించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విచ్ఛిన్న కర శక్తులకు ఆ పార్టీ టిక్కెట్లు కూడా ఇచ్చిందని ఆయన మండిపడ్డారు. మత ప్రాతిపదికన దేశ విభజనకు కారణం కాంగ్రెస్ చర్యలు అని ఆయన ఆరోపించారు. దేశ ప్రతిష్టను దిగజార్చే విధంగా రాహుల్ గాంధీ తో పాటు ఆ పార్టీ నాయకులు విదేశాల్లో మాట్లాడారని, రాహుల్ గాంధీ గురువు, రాజీవ్ గాంధీ అడ్వైజర్ శాం పిట్రోడ.. భారతీయుల పై విషపూరిత వ్యాఖ్యలు చేశారని ఆయన మండిపడ్డారు. ఇది జాత్యహంకారం కు నిదర్శనమన్నార లక్ష్మణ్. రాహుల్, సోనియా, ప్రియాంకా ఖండించకపోవడం దేశం పట్ల వారికున్న గౌరవం ఏంటో తెలుస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ విధాన పరమైన ఆలోచనలు ప్రజల ముందు శాం పిట్రోడ పెట్టారని, శాం పిట్రోడా రాజీనామా ఒక డ్రామా… నష్ట నివారణ చర్య మాత్రమే అన్నారు. శాం పిట్రోడ ను బహిస్కరించాలి.. ఆ పార్టీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు లక్ష్మణ్.
అంతేకాకుండా..’రాహుల్ గాంధీ మొహబ్బత్ కు దుకాన్ లో ద్వేషం వ్యాపింప చేస్తున్నారు. డికే సురేష్ దక్షిణ భారత దేశం కావాలని డిమాండ్ చేస్తే కాంగ్రెస్ చర్యలు తీసుకోలేదు… రేవంత్ రెడ్డి అగ్గికి ఆజ్యం పోస్తున్నారు… రాహుల్ గాంధీ కూడా నార్త్ సౌత్ అని మాట్లాడారు.. ఓట్ల కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు.. వారసత్వ పన్ను గురుంచి కూడా పిట్రోడ మాట్లాడారు.. ఒక వర్గం ఓట్ల కోసమే సనాతన ధర్మాన్ని విమర్శిస్తున్నారు… రాజ్యాంగ నిర్మానం లో అంబేద్కర్ కన్నా నెహ్రూ కాంట్రిబ్యూషన్ ఎక్కువ అని శాం పిట్రోడా మాట్లాడిన కాంగ్రెస్ స్పందించదు.. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రహస్య ఎజెండా తెలుసుకొని మాట్లాడు… లేకుంటే పుట్టి మునుగుతుంది.. పాకిస్తాన్ రాహుల్ గాంధీకి మద్దతు ఇస్తుంది.. పాకిస్తాన్ మీద ఉన్న ప్రేమ మాతృ దేశం మీద లేదు.. సిక్కుల మారణహోమం పై ఇప్పటికీ కాంగ్రెస్ క్షమాపణ చెప్పలేదు….. విభజన రాజకీయాల చేస్తున్న వారికి కాకుండా దేశం కోసం, దేశ సమగ్రత కోసం మోడీ కి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్న’ అని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.
Also Read
- World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో 'గ్రూప్ ఆఫ్ డెత్'గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
- Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
- Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
- High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
తాజావార్తలు
-
World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో ‘గ్రూప్ ఆఫ్ డెత్’గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
-
Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
-
Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
-
రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
-
High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!